నేడు జగన్ పర్యటన ఇలా | ys jagan mohan reddy palamaner tour road map | Sakshi
Sakshi News home page

నేడు జగన్ పర్యటన ఇలా

Published Sat, Dec 28 2013 3:57 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

నేడు జగన్ పర్యటన ఇలా - Sakshi

నేడు జగన్ పర్యటన ఇలా

పలమనేరు, న్యూస్‌లైన్ : రెండో విడత సమైక్య శంఖారావంలో భాగంగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి శనివారం పలమనేరు నియోజకవర్గంలోని పెద్దపంజాణి మండలంలో పర్యటించనున్నట్లు ఆ పార్టీ జిల్లా కన్వీనర్ నారాయణస్వా మి, పార్టీ ప్రోగ్రామ్ కన్వీనర్ తలశిల రఘురామ్ పేర్కొన్నారు.

శనివారం ఉదయం పెద్దవెలగటూరు నుంచి పర్యటన సాగుతుంది. రాజుపల్లె, కరసనపల్లె కాలనీ, కరసనపల్లె, ముతుకూరు, పలమనేరు మెయిన్ రోడ్డు క్రాస్, తులసమ్మ గుడి, లింగాపురం క్రాస్‌లో రోడ్‌షో ఉంటుంది. పెద్దపంజాణిలో మహా నేత విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. బసవరాజుకండిగ, కోగిలేరు, గుడిపల్లె క్రాస్‌లో రోడ్‌షో నిర్వహిస్తారు.

రాయలపేటలో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. కమ్మపాళెంలో డోలు నాగరాజు కుటుంబాన్ని ఓదారుస్తారు. అక్కడి నుంచి  కొళత్తూరు, తుర్లపల్లె క్రాస్, తుర్లపల్లె, కొత్తూరుల్లో రోడ్‌షో జరుగనుంది. పుంగనూరు నియోజకవర్గంలోని బత్తాలపురంలో ఓదార్పు జరుగుతుంది. ఆపై తిరిగి కొళత్తూరుకు వచ్చి కెళవాతిలో జగన్‌మోహన్‌రెడ్డి బస చేస్తారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement