![Article On Pawan Kalyan Speeches - Sakshi](/styles/webp/s3/article_images/2018/10/17/pawan-kalyan.jpg.webp?itok=aNi2nhb0)
తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలో మంగళవారం జరిగిన సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ అలవాటైన ఆవేశం తోపాటు అంతే అనాలోచిత వ్యాఖ్యలు చేయడం సబబు కాదు. పవన్ చేసిన విమర్శలన్నీ వాస్తవాలకు చాలా దూరంగా ఉన్నాయని ఎవరికైనా సులువుగానే అర్థమవుతుంది.
వంగవీటి రంగాను చంద్రబాబు చంపించాడని కాపు నాయకులు ముద్రగడ పద్మనాభం, చేగొండి హరి రామయ్య జోగయ్య గతంలో చెప్పారు. అటువంట ప్పుడు చంద్రబాబుకు పవన్‌కల్యాణ్ మద్దతు ఎలా ఇచ్చారు? నా ప్రాణాలకు ముప్పు ఉందంటూ వంగవీటి రంగ స్వయంగా నిరాహార దీక్షలో కూర్చున్నప్పుడే కదా హత్యకు గురయ్యారు. అప్పుడు అధి కారంలో ఉన్నది టీడీపీ ప్రభుత్వమే నని పవన్ మర్చిపోయారా? ప్రజారాజ్యం యువ నేతగా 2009లో చంద్రబాబును దొంగల ముఠా నాయకుడు అని విమర్శించి 2014లో ఎలా మద్దతు ఇచ్చారు? ఇందుకు పవన్‌కు ముట్టినది ఎంత? రాజ్యసభ పదవి కట్టబెడ తానని ఇవ్వనందుకే పవన్ ఇప్పుడు ఎదురు తిరుగుతున్నారా?
వైఎస్ రాజశేఖరరెడ్డి తండ్రి రాజారెడ్డి 1998లో చంద్రబాబు అధికారంలో వుండ గానే హత్యకు గురయ్యారు. తర్వాత వైఎస్ సీఎం అయినా ప్రత్యర్థులపై ప్రతీ కారం తీర్చుకోలేదు. రాజారెడ్డి హంతకుల వ్యవహా రాన్ని చట్టానికే వదిలేసిన వైఎస్ కుటుంబం ఫ్యాక్షనిజాన్ని పెంచి పోషిస్తోందనడం హాస్యాస్పదం. గోదావరి జిల్లాలకు ఫ్యాక్షని జాన్ని తీసుకొస్తే ఊరుకోమనడం పవన్ అవి వేకం. వైఎస్‌కు రెండోసారి కూడా గోదావరి జిల్లాల ప్రజలు పట్టంకట్టారని తెలియకపో వడం పవన్ అజ్ఞానవాసి అనడానికి నిదర్శనం. లేక చంద్రబాబులా పవన్‌కు కూడా మెమరీలాస్ ఏమైనా వుందా అని సందేహం కలుగు తోంది. వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు పార్టీ పెట్టిన అన్న చిరంజీవి పైగానీ, అసెంబ్లీ బయట జగన్‌ను దారు ణంగా తిట్టిన టీడీపీ నేతలపైనగానీ దాడులు జరిగాయా? పరిటాల హత్యలో జేసీ దివా కర్‌రెడ్డి పాత్ర ఉందని ఆరోపించిన చంద్ర బాబు ఆయనకు టీడీపీ ఎంపీ టికెట్ ఎలా ఇచ్చారు?
ప్రతీకారంతోనే పరిటాల రవిని మద్దెల చెరువు సూరి హతమార్చాడని అందరికీ తెలుసు. ఒకవేళ ఎల్లో మీడియా ప్రచారమే నిజమని నమ్మేటట్లయితే, తన గురించి చేసిన ప్రచారం కూడా నిజమని పవన్ ఒప్పు కుంటారా? అయిదేళ్లుగా వైఎస్ జగన్‌పై పవన్ కల్యాణ్ విమర్శలు చేస్తున్నప్పటికీ కేవలం ఒక్కసారి మాత్రమే ఆయన పవన్‌పై వ్యాఖ్యలు చేశారు. దానికే పవన్ చాలా గింజుకున్నారు. గురివింద గింజ తన నలుపు తానెరుగదన్న సామెత పవన్ విష యంలో గుర్తుకు రాక తప్పదు.
– సి.వి.రెడ్డి
ccvr64@gmail.com
Comments
Please login to add a commentAdd a comment