డాక్టర్ ఖాదర్ వలి
సిరిధాన్యాలు–కషాయాలతో సంపూర్ణ ఆరోగ్యం పొందే మార్గాలు, సిరిధాన్యాలను రసాయన రహిత పద్ధతుల్లో పండించుకోవడంపై జనవరి మూడో వారంలో తెలుగు రాష్ట్రాల్లో వివిధ చోట్ల ప్రముఖ స్వతంత్ర శాస్త్రవేత్త, ఆహార, ఆరోగ్య నిపుణులు డాక్టర్ ఖాదర్ వలి ప్రసంగించనున్నారు. ప్రవేశం ఉచితం.
జనవరి 27 (ఆదివారం)న ఉ. 10 గం. నుంచి సా. 4 గం. వరకు విజయవాడలోని సిద్ధార్థ హోటల్ మేనేజ్‌మెంట్ కాలేజ్ గ్రౌండ్ (పిన్నమనేని పాలీక్లినిక్ రోడ్డు)లో సిరిధాన్యాలపై రాష్ట్రస్థాయి సదస్సులో డా. ఖాదర్ వలి ప్రసంగిస్తారు. గోఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం, రైతునేస్తం ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ సదస్సు జరగనుంది.
వివరాలకు.. 98481 23050, 99632 32104, 98493 12629.
జనవరి 28 (సోమవారం) ఉ. 10– మ. 1 గం. వరకు ఖమ్మంలోని ఇ.ఆర్.ఆర్. రిసార్ట్స్ (మమతా ఆసుపత్రి రోడ్డు)లో తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల సంఘం, రైతునేస్తం ఫౌండేషన్, ఇ.ఆర్.ఆర్. రిసార్ట్స్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగే సభలో డాక్టర్ ఖాదర్ వలి ప్రసంగిస్తారు. వివరాలకు.. 98490 01725, 70939 73999
జనవరి 28 (సోమవారం)న సా. 4 గం.– రా. 7 గం. వరకు నల్లగొండలోని లక్ష్మీ గార్డెన్స్ (హైదరాబాద్ రోడ్డు)లో డాక్టర్ ఖాదర్ వలి ప్రసంగిస్తారు. తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల సంఘం, రైతునేస్తం ఫౌండేషన్, లయన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ సభను నిర్వహిస్తున్నాయి. వివరాలకు.. 98486 99282, 70939 73999.
జనవరి 29 (మంగళవారం)న ఉ. 10 గం. – మ. 1 గం. వరకు హైదరాబాద్ మెహిదీపట్నంలోని అశోక గార్డెన్స్, కొణిజేటి ఎన్‌క్లేవ్ (ఎక్స్‌ప్రెస్ హైవే పిల్లర్ 83 వద్ద)లో డాక్టర్ ఖాదర్ వలి సిరిధాన్యాల సాగు, అటవీ చైతన్య ద్రావణం తయారీ, సిరిధాన్యాలను మిక్సీలతో శుద్ధి చేయడంపై తదితర అంశాలపై ప్రసంగిస్తారు. తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల సంఘం, రైతునేస్తం ఫౌండేషన్, కొణిజేటి గార్డెన్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ సభను నిర్వహిస్తున్నాయి. వివరాలకు.. 94419 27808, 70939 73999.
26న చెవుటూరులో ప్రకృతి సేద్యంపై శిక్షణ
కృష్ణా జిల్లా జి. కొండూరు మండలం చెవుటూరులోని గోసేవా క్షేత్రంలో ఈ నెల 26 (శనివారం) ఉ. 9 గం.– సా. 4 గం. వరకు ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అనంతపురం జిల్లా బసంపల్లికి చెందిన ప్రకృతి వ్యవసాయదారుడు తాడిమర్రి నాగరాజు చేత శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు గోసేవా క్షేత్రం నిర్వాహకులు పోకూరి బాలకృష్ణ, ఇందిరారాణి తెలిపారు. ప్రవేశం ఉచితం. వివరాలకు.. 91826 71819, 94407 46074.
గోపాలనపై 4 రోజుల సర్టిఫికెట్ కోర్సు
గోపాలనలో వివిధ అంశాలపై బెంగళూరులోని ఆర్ట్ ఆఫ్ లివింగ్‌కు చెందిన ఎస్.ఎస్.ఐ.ఏ.ఎస్.టి. ఆధ్వర్యంలో జనవరి 31 నుంచి ఫిబ్రవరి 3 వరకు 4 రోజుల సర్టిఫికెట్ కోర్సు నిర్వహిస్తున్నట్లు ట్రస్టు బాధ్యులు ఉమామహేశ్వరి తెలిపారు. వివిధ దేశీ జాతులకు చెందిన వెయ్యి ఆవులతో కూడిన గోశాలను ప్రామాణికంగా నిర్వహిస్తున్న బెంగళూరులోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆశ్రమంలో శిక్షణ ఇస్తారు. దేశీ ఆవుల విశిష్టత, వాటి ఆలన – పాలన, సేంద్రియ మేత, ఎ2 పాల ఉత్పత్తి, గోమయం, గోమూత్రాలతో ఫినాయిల్, విభూది, అగర్‌బత్తీ, పంచగవ్య వంటి ఉత్పత్తుల తయారీపై శిక్షణ ఇస్తారు. కోర్సు చందా: రూ. 5 వేలు.
రిజిస్ట్రేషన్ ఇతర వివరాలకు.. 90004 08907, 79937 95246, 93810 25358.
Comments
Please login to add a commentAdd a comment