Perfect health
-
ఏపీలో ప్రకృతి సాగు భేష్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ప్రకృతి వ్యవసాయ విధానం ఆదర్శనీయమని ప్రపంచ ప్రసిద్ధి చెందిన గ్లోబల్ ఇన్ఫర్మేషన్ షేరింగ్ టూల్‌కిట్ (జిస్ట్) ఇంపాక్ట్ సంస్థ ప్రకటించింది. వైఎస్ జగన్ ప్రభుత్వ ప్రోత్సాహంతో రాష్ట్రంలో పెద్ద ఎత్తున అమలవుతున్న ప్రకృతి వ్యవసాయం ప్రపంచంలోనే వ్యవసాయ పర్యావరణానికి (అగ్రో ఎకాలజీకి) అతి పెద్ద పరివర్తన (మార్పు) అని తెలిపింది. ప్రకృతి వ్యవసాయం ప్రస్తుత వ్యవసాయ విధానాలకు సరియైన లాభసాటి ప్రత్యామ్నాయ విధానమని వెల్లడించింది. అధిక దిగుబడి, అత్యున్నత జీవనోపాధి, సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రకృతి వ్యవసాయం ఎంతగానో దోహదపడుతుందని తెలిపింది. ప్రపంచ స్థాయి సంస్థల కూటమి (గ్లోబల్ అలయన్స్ ఫర్ ది ఫ్యూచర్ ఆఫ్ ఫుడ్ ) మద్దతుతో జిస్ట్ ఇంపాక్ట్ సంస్థ ఆంధ్రఫ్రదేశ్‌లో నిర్వహించిన అధ్యయన ఫలితాలను బుధవారం వెల్లడించింది. భావితరాలను దృష్టిలో ఉంచుకొని ప్రపంచ స్థాయిలో ఆహార వ్యవస్థల్లో పరివర్తన తేవడానికి ఈ సంస్థలు కలిసి పనిచేస్తున్నాయి. ఇందులో భాగంగా రాష్ట్రంలోని మూడు విభిన్న ప్రాంతాల్లో ప్రకృతి వ్యవసాయ ఫలితాలను నిశితంగా పరిశీలించారు. కోస్తా, రాయలసీమ, డెల్టా ప్రాంతాల్లో అధ్యయనం చేశారు. 2020 – 2022 మధ్య ఎంపిక చేసిన 12 గ్రామాల్లో ఇంటింటా సమగ్ర ప్రాథమిక సర్వే చేశారు. విస్తృత ప్రయోజనాలతో నిర్వహించిన ఈ అధ్యయనంలో పలు అంశాలు వెలుగు చూశాయి. వ్యవసాయ పర్యావరణ మార్పునకు దోహదం ఇతర విధానాలతో పోల్చితే సంప్రదాయ జీవ ఎరువులతో చేస్తున్న ప్రకృతి వ్యవసాయంలో అధిక దిగుబడి వస్తోంది. ఈ విధానంలో పంట వైవిధ్యత చూపితే 11% అధిక దిగుబడి వ స్తుంది. ఇది పెరుగుతున్న జనా భాకు సరిపడే ఆహారాన్ని ఉత్పత్తి చేస్తుంది. తద్వారా 49% అధిక లాభం చేకూరడంతో ప్రకృతి వ్యవసాయ కుటుంబాల్లో ఆనందం వెల్లి విరుస్తోంది. ఆ రైతుల కుటుంబాల జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయి. రైతు వ్యవస్థ బలంగా తయారవుతోందని వెల్లడించింది. ప్రకృతి సాగులో మహిళా శ్రామిక శక్తి అధికం మహిళా సంఘాల సభ్యులు భాగస్వామ్యం పెరుగు తుండడంతో ప్రకృతి సాగులో మహిళా శ్రామిక శక్తి అధికంగా కనిపిస్తోందని జిస్ట్ ఇంపాక్ట్ పేర్కొంది. మహిళలు క్రియాశీలక పాత్ర పోషిస్తుండడంతో కు టుంబాల మధ్య ఐక్యత, అన్యోన్యత పెరుగు తు న్నాయి. తద్వారా సామాజిక పెట్టుబడిలో పెరుగు దల స్పష్టంగా కన్పిస్తోంది. ఇతర పద్ధతుల్లో వ్యవ సాయం చేసే రైతులతో పోలిస్తే ప్రకృతి సాగు చేసే రైతుల్లో 33%తక్కువ పని దినాలతోనే అనుకున్న లక్ష్యాలను సాధిస్తున్నారు. సంప్రదాయ పద్ధతుల్లో వ్యవసాయం చేసే రైతులు మితిమీరి వినియోగి స్తున్న రసాయనిక ఎరువులు, పురుగు మందుల వాడకం వల్ల ఉత్పాదకత నష్టాలతోపాటు అనారో గ్యానికి గురవుతున్నారు. ప్రకృతి సాగులో ఆ పరిస్థితి కన్పించడంలేదు. గ్రామీణ జీవనోపాధి, పౌష్టికాహా రం, జీవ వైవిధ్య నష్టం, వాతావరణ మార్పు, నీటి కొరత, కాలుష్యం వంటి బహుళ అభివృద్ధి సవాళ్లను ప్రకృతి సాగు చేస్తున్న రైతులు అధిగమిస్తున్నారని అధ్యయనంలో గుర్తించినట్టు ఆ సంస్థ తెలిపింది. భవిష్యత్ ప్రణాళికకు ఇదొక బ్లూ ప్రింట్ మా పరిశోధన వాతావరణ పర్యావరణ అనుకూల వ్యవసాయ అభివృద్ధికి ఒక నమూనా (బ్లూప్రింట్)గా ఉపయోగపడుతుంది. ఏపీని స్ఫూర్తిగా తీసు కొని ప్రకృతి వ్యవసాయంలో ముందుకె ళ్లాలని భాగస్వామ్య దేశాలకు సిఫార్సు చేస్తాం. – పవన్ సుఖ్‌దేవ్, జిస్ట్ ఇంపాక్ట్, సీఈవో ప్రభుత్వ కృషి ప్రశంసనీయం ప్రకృతి వ్యవసాయం ద్వారా రైతుల జీవితాలు, సమాజంలో మార్పుకు కృషి జరుగు తున్నట్టు గుర్తించాం. సంప్రదాయ వ్యవ సాయం నుంచి రైతులను ప్రకృతి వ్యవ సాయం దిశగా తీసుకు వె ళ్లేందుకు ప్రభుత్వం చే స్తున్న కృషి ప్రశంసనీయం. – లారెన్ బేకర్, డిప్యూటీ డైరెక్టర్, గ్లోబల్ అలయన్స్ ఫర్ ది ఫ్యూచర్ అంతర్జాతీయంగా గుర్తింపు భవిష్యత్‌లో ఎదురయ్యే ఆహార సంక్షోభ పరి స్థితులకు ప్రకృతి వ్యవసాయం ఒక్కటే చక్క టి పరిష్కారమని జిస్ట్ ఇంపాక్ట్ సర్వే స్పష్టం చేస్తోంది. రెండేళ్లపాటు శాస్త్రీయ పద్ధతిలో చేసిన ఈ అధ్యయనం ఫ లితాలు రాష్ట్రంలో ప్రకృతి సాగుకు అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చేందుకు దోహదపడతాయి. – టి.విజయ్ కుమార్, ఎగ్జిక్యూటివ్ వైస్‌చైర్మన్, రైతు సాధికార సంస్థ -
‘సిరి’ దారిలో ప్రజా వైద్య సేద్యం!
వైద్యుడు అనారోగ్యాన్ని తగ్గించడం గురించి మాత్రమే కాదు, ఆరోగ్యాన్ని అందించే సరైన ఆహారం గురించి, ఆ ఆహారం పండించే పద్ధతుల గురించి కూడా పట్టించుకోవాలంటున్నారు డాక్టర్ ధర్మకారి రాంకిషన్. మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న ఆయన చాలాకాలంగా నల్లమల ప్రాంత చెంచుల గ్రామాల్లోకి వెళ్లి వైద్య శిబిరాలు నిర్వహిస్తూ ఉంటారు. గత రెండేళ్లుగా సిరిధాన్యాలనే ఆహారంగా తింటూ.. వందలాది మంది రోగులకూ ఈ ఆహారాన్ని అలవాటు చేసి దీర్ఘవ్యాధుల నుంచి వారిని విముక్తం చేస్తున్నారు. అంతేకాదు.. స్వయంగా 20 ఎకరాల్లో సిరిధాన్యాలను వర్షాధారంగా పండిస్తున్నారు. మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో కొందరు చెంచులు, ఇతర రైతులను ప్రోత్సహించి ఈ ఖరీఫ్ సీజన్లో 200 ఎకరాల్లో సిరిధాన్యాలను సాగు చేయిస్తున్నారు. చెంచులోకం స్వచ్ఛంద సంస్థకు గౌరవాధ్యక్షుడు కూడా అయిన ఆయన ఐటీడీఏ తోడ్పాటుతో చెంచులతో సిరిధాన్యాల ప్రాసెసింగ్ యూనిట్లు, విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేయించబోతున్నారు. వచ్చే ఏడాది వెయ్యి ఎకరాల్లో సాగు చేయించాలని, సిరిధాన్యాల విత్తన బ్యాంకులను నిర్మించాలన్న దృఢ సంకల్పంతో ఉన్నారు. ఇందుకోసం ‘రైతు లోకం ఫౌండేషన్’ను రిజిస్టర్ చేయించి టోల్ ఫ్రీ నంబరు ద్వారా సిరిధాన్యాలు ఆహార, ఆరోగ్య, వ్యవసాయ సంబంధమైన శాస్త్రీయ అవగాహనను ప్రజలకు అందించాలని అభిలషిస్తూ ఇతరులకు స్ఫూర్తినిస్తున్నారు. మెట్ట రైతుల పక్షపాతి, సిసలైన ప్రజావైద్యుడు డాక్టర్ రామ్‌కిషన్‌కు వందనాలు! అరుదైన ప్రజా వైద్యుడు డాక్టర్ ధర్మకారి రామ్‌కిషన్. వృత్తి రీత్యా ఆయన ఎముకల శస్త్రచికిత్సా నిపుణుడు. వైద్య విద్యార్థులకు 20 ఏళ్లుగా పాఠాలు చెబుతున్న ప్రొఫెసర్. ప్రస్తుతం మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రి సూరపింటెండెంట్గా సేవలందిస్తున్నారు. ప్రవృత్తి రీత్యా అట్టడుగు వర్గమైన నల్లమల చెంచులకు ఆప్తుడు. చెంచులోకం స్వచ్ఛంద సంస్థకు గౌరవాధ్యక్షుడిగా చెంచుల పెంట(గూడేల)ల్లో వైద్య శిబిరాలు పెడుతూ వారికి అండదండగా ఉంటుంటారు. గత రెండేళ్లుగా వరి, గోధుమలను తినటం నిలిపివేసి పూర్తిగా వర్షాధారంగా పండించిన సిరిధాన్యాలనే తింటున్నారు. ప్రజావైద్యంలో సిరిధాన్యాలను మిళితం చేసి వందలాది మంది దీర్ఘ రోగులను సంపూర్ణ ఆరోగ్యం దిశగా నడిపిస్తున్నారు. బంధు మిత్రుల కుటుంబాలను కూడా కొర్రలు, సామలు, ఆరికలు, ఊదలు, అండుకొర్రలనే ముఖ్య ఆహారంగా, అంబలిగా, అల్పాహారంగా, చిరుతిండ్లుగా తీసుకోవడం.. రోజూ 7–10 కిలోమీటర్లు నడవడం ద్వారా దీర్ఘరోగాల నుంచి కూడా విముక్తి పొంది సంపూర్ణ ఆరోగ్యం సంతరించుకోవచ్చని సూచిస్తూ సత్ఫలితాలు సాధిస్తున్నారు. స్వయంగా తాను 20 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. అంతగా ఆదాయం లేక అల్లాడుతున్న వర్షాధార వ్యవసాయదారులను నాలుగు వర్షాలు పడితే నిశ్చింతగా పండే ఈ సిరిధాన్యాల సాగుకు చెంచులను, ఇతర వర్గాల రైతులను ప్రోత్సహిస్తున్నారు. స్వతంత్ర శాస్త్రవేత్త డా. ఖాదర్ వలితో కూడా అనేక సదస్సులు నిర్వహించారు. పత్తి పొలాల మధ్య సిరిధాన్యాల సాగు నాగర్‌కర్నూల్ జిల్లా తాడూరు మండలం ఇంద్రకల్ డాక్టర్ రామ్‌కిషన్ సొంత గ్రామం. అక్కడే ఆయనకు రెండెకరాల పొలం ఉంది. మరో 18 ఎకరాల నల్లరేగడి భూమి కౌలుకు తీసుకొని మొదటి సారిగా ఈ ఏడాదే 5 రకాల సిరిధాన్యాలు – కొర్రలు, సామలు, ఆరికలు, ఊదలు, అండుకొర్రల–ను పండిస్తున్నారు. గొర్రు/ట్రాక్టర్‌తో సాళ్లుగా వెద పెట్టించారు. పంట 5 అడుగుల ఎత్తు ఏపుగా ఎదిగి కంకి దశలో కనువిందు చేస్తోంది. మరో నెల రోజులకు కోతకు వస్తుంది. ఎకరానికి 10 క్వింటాళ్లకు పైగానే దిగుబడి వస్తుందని, కొన్ని చోట్ల 15 క్వింటాళ్ల వరకు కూడా దిగుబడి రావచ్చని ఆయన సంతోషంగా చెప్పారు. చుట్టూ పత్తి పొలాల మధ్యలో తమ సిరిధాన్యాల పంటలు చూస్తుంటే ముచ్చటగా ఉందని ఆయన సంబరపడుతున్నారు. విత్తనం చల్లటం తప్ప చేసిందేమీలేదు. కలుపు కూడా ఉంది. కానీ, అది పంట ఎదుగుదలకు ఆటంకం కాలేదని డా. రామ్ కిషన్ చెప్పారు. ఉచితంగా సిరిధాన్యాల విత్తనాలు సిరిధాన్యాల సాగులో అనుభవం లేనందున వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన విఆర్డిఎస్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు, రైతు శాస్త్రవేత్త కొమ్ములూరి విజయకుమార్‌ను డా. రామ్‌కిషన్ తమ ప్రాంతానికి ఆహ్వానించి ఆయన సహాయ సహకారాలు తీసుకున్నారు. రెండు నెలల క్రితం విజయకుమార్ ఈ ప్రాంతంలో పర్యటించి డాక్టర్ రామ్‌కిషన్ చెంచులు, మెట్ట రైతుల అభ్యున్నతికి చేస్తున్న కృషికి ముగ్ధుడయ్యారు. 50 ఎకరాల్లో సిరిధాన్యాల సాగుకు అవసరమైన సేంద్రియ విత్తనాలను విజయకుమార్ డా. రామ్‌కిషన్ ద్వారా ఉచితంగా అందించి, సిరిధాన్యాల సాగులో మెలకువలను తెలియజెప్పారు. వంద ఎకరాలకు విత్తనాన్ని ఐటిడిఏ ఉచితంగా పంపిణీ చేసింది. వీరి సహకారంతో తాడూరు మండలం ఇంద్రకల్‌కు చెందిన ఇంజినీరింగ్ పట్టభద్రుడు ప్రశాంత్ తొలి సారిగా ఈ ఏడాది 30 ఎకరాల్లో సిరిధాన్యాలు సాగు చేస్తున్నారు. ఎక్కువ విస్తీర్ణంలో అండుకొర్రలు, సామలు, అరికలు సాగు చేస్తున్నారు. అదేవిధంగా తాడూరు మండలం యాదిరెడ్డి కాలనీకి చెందిన మర్రెడ్డి, శౌర్రెడ్డి, అనిల్ తలా ఒక రెండెకరాల్లో ప్రయోగాత్మకంగా సిరిధాన్యాలు సాగు చేశారు. పత్తి, వరి సాగు చేసే అలవాటు ఉన్న ఈ రైతులు సిరిధాన్యాల పంట ఎదుగుతున్న తీరు, పది క్వింటాళ్లకు పైగా దిగుబడి వచ్చే అవకాశం ఉండటంతో సంతోషిస్తున్నారు. అధిక పెట్టుబడులతో జూదంగా మారిపోయిన పత్తి కన్నా సిరిధాన్యాల సాగు మేలన్న భావనతో వచ్చే ఏడాది మరిన్ని ఎకరాల్లో సాగు చేస్తామని వారు చెబుతున్నారు. మహబూబ్‌నగర్ మండలం తాటికొండ శివారులో వరి రైతు శంకర్ తొలిసారిగా 6 ఎకరాల్లో సిరిధాన్యాలను సాగు చేస్తూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. లింగాల మండలం అప్పాయపల్లి, శ్రీరంగాపురంలలో కూడా డా. రామ్‌కిషన్, విజయకుమార్ ప్రోత్సాహంతో కొందరు రైతులు సిరిధాన్యాల సాగుకు శ్రీకారం చుట్టారు. ఆముదం, వరి సాగు చేసే అలవాటున్న చెంచు మహిళా రైతు శీతమ్మ ఈ ఏడాది 3 ఎకరాల్లో సిరిధాన్యాలు సాగు చేస్తున్నారు. లింగాల మండలం దారారంలో చెంచు రైతు కాట్రాజ శ్రీనివాస్ 12 ఎకరాల్లో కొర్రలు సాగు చేస్తున్నారు. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం శ్రీరంగాపురంలో శ్రీనివాస్ అనే రైతు 5 ఎకరాల్లో కొర్రలు సాగు చేస్తున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా ఐజ గ్రామ శివారులో రామకృష్ణ 8 ఎకరాల్లో కొర్రలు సాగు చేస్తున్నారు. ఈ విధంగా సుమారు 200 ఎకరాల్లో ఈ ఏడాది డా. రామ్‌కిషన్ ప్రోత్సాహంతో రైతులు సిరిధాన్యాల సాగును ప్రారంభించారు. గ్రామాల్లో 40–50 చోట్ల రైతుల గ్రూప్ మీటింగ్‌లు ఏర్పాటు చేసి వర్షాధారంగా సిరిధాన్యాల సాగు ఆవశ్యకత గురించి రైతులను చైతన్యవంతం చేయడం విశేషం. ఎకరానికి కనీసం 10 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా వేశామని, కనీసం రూ. 30 వేల ఆదాయం వస్తుందన్నారు. ఎకరానికి రూ. 50 వేలు పెట్టుబడి పెట్టి 6 నెలల పంటకాలం ఉండే పత్తి వేసి నానా బాధలు పడేకన్నా స్వల్ప పెట్టుడితో 100 రోజుల్లో చేతికి వచ్చే సిరిధాన్యాల వర్షాధార సాగు మేలని రైతులు సంతృప్తిగా చెబుతున్నారని డా. రామ్‌కిషన్ తెలిపారు. చెంచులతో ప్రాసెసింగ్ యూనిట్లు సిరిధాన్యాల పంట సంతృప్తికరంగా ఉన్నందున కోత, కోత అనంతర ప్రాసెసింగ్ విషయాలపై దృష్టి సారిస్తున్నారు. ఐటీడీఏ తోడ్పాటుతో రెండు చోట్ల చెంచు రైతుల ఆధ్వర్యంలో సిరిధాన్యాల శుద్ధి యంత్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నానని డా. రామ్‌కిషన్ తెలిపారు. అంతేకాదు, వర్షాధారంగా, సేంద్రియ పద్ధతుల్లో సాగు చేసే సిరిధాన్యాల విక్రయానికి ప్రత్యేక బ్రాండ్‌ను రిజిస్టర్ చేయించి, ప్రత్యేక దుకాణాల ద్వారా విక్రయం చేపట్టాలని ఆలోచిస్తున్నామన్నారు. బోరు నీటితో భార ఖనిజాల బెడద బోరు నీటితో పండించిన వరి, గోధుమలు తినటం మానేసి వర్షాధారంగా పండించిన సిరిధాన్యాల ఆహారం తీసుకోవడంతో రక్తపోటు, సుగర్, ఊబకాయం, మానసిక ఆందోళన తదితర ఆరోగ్య సమస్యలు ఉపశమిస్తున్నాయని డా. రామ్‌కిషన్ తెలిపారు. తనకు తెలిసిన కనీసం వెయ్యి మంది రోగులు ఆహారం మార్చుకోవడంతోపాటు రోజూ నడవడం ద్వారా ఆరోగ్యవంతులుగా మారుతున్నారన్నారు. ఆహారం ద్వారానే కాకుండా నడక ద్వారా మనిషిలో రోగనిరోధక శక్తిని పెంచే యాంటీ ఆక్సిడెంట్లు పెరుగుతాయన్నారు. బోరు నీటితో పండించే వరి తదితర పంట దిగుబడుల్లో భార ఖనిజాలు ఉంటాయని, ఆ బియ్యం తిన్న వారికి కిడ్నీ జబ్బులు వస్తున్నాయని ఆయన తెలిపారు. సిరిధాన్యాలు నాలుగు వర్షాలు పడితే పండుతాయని, వీటి ద్వారా సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందన్నారు. 300 లోపు టిడిఎస్(టోటల్ డిసాల్వుడ్ సాలిడ్స్) ఉన్న నీరు తాగడానికి, 400 లోపు టీడీఎస్ ఉన్న నీరు సాగుకు పనికివస్తుందన్నారు. అయితే, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో బోరు నీటిలో 800–1300 మేరకు టీడీఎస్ ఉంటున్నదన్నారు. ఇందువల్లే కిడ్నీ రోగుల సంఖ్య పెరుగుతోందన్నారు. అందువల్ల సిరిధాన్యాలు వంటి నాలుగు వర్షాలతో పండే పంటలే ఆరోగ్యదాయకమని గుర్తించాలని డా. రామ్‌కిషన్ కాలికి బలపం కట్టుకొని ప్రచారం చేస్తున్నారు. ఇన్పుట్స్ : జమ్ముల దామోదర్, సాక్షి, బిజినేపల్లి బోరు నీటితో పండించే వరి తదితర పంట దిగుబడుల్లో భార ఖనిజాలు ఉంటాయి. ఆ బియ్యం తిన్న వారికి కిడ్నీ జబ్బులు వస్తున్నాయి. సిరిధాన్యాలు నాలుగు వర్షాలు పడితే పండుతాయి. వీటి ద్వారా సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుంది. బోరు నీటిలో 800–1300 మేరకు టీడీఎస్ ఉంటున్నది. ఈ నీటితో పండించే పంటల దిగుబడుల్లో, బియ్యంలో భారఖనిజాలు నిక్షిప్తమై ఉంటాయి. వీటిని తిన్న వారు కిడ్నీ, తదితర జబ్బులకు గురవుతున్నారు. అందువల్ల సిరిధాన్యాలు వంటి నాలుగు వర్షాలతో పండే పంటలే ఆరోగ్యదాయకమని గుర్తించాలి. ఉచిత ఫోన్ సదుపాయం సిరిధాన్యాలను వర్షాధారంగా సేంద్రియ పద్ధతుల్లో సాగు చేసే పద్ధతులు, ప్రాసెసింగ్, సిరిధాన్యాల ఆహార పదార్థాలు, సంపూర్ణ ఆరోగ్యం పొందే పద్ధతులపై రైతులు, ప్రజల్లో వ్యక్తమవుతున్న సందేహాలను శాస్త్రీయ సమాచారంతో నివృత్తి చేయడానికి ఉచిత ఫోన్ (టోల్ ఫ్రీ) నంబరును ప్రారంభించాలని భావిస్తున్నట్లు డా. రామ్‌కిషన్ తెలిపారు. సిరిధాన్యాల విత్తన బ్యాంకులను సైతం గ్రామాల్లో విరివిగా ఏర్పాటు చేయనున్నామన్నారు. తొలి ఏడాది రైతులకు ఉచితంగా విత్తనాలు ఇస్తామని, వారు పండించిన పంటలో నుంచి రెట్టింపు పరిమాణంలో తిరిగి విత్తన బ్యాంకుకు జమచేయాల్సి ఉంటుందన్నారు. ఈ పనులన్నిటినీ చేపట్టేందుకు ‘రైతు లోకం ఫౌండేషన్’ను నెలకొల్పనున్నట్లు వివరించారు. (డా. రామ్‌కిషన్‌ను 94407 12021 నంబరులో సంప్రదించవచ్చు) – పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
27,28,29 తేదీల్లో డా. ఖాదర్‌వలి ప్రసంగాలు
సిరిధాన్యాలు–కషాయాలతో సంపూర్ణ ఆరోగ్యం పొందే మార్గాలు, సిరిధాన్యాలను రసాయన రహిత పద్ధతుల్లో పండించుకోవడంపై జనవరి మూడో వారంలో తెలుగు రాష్ట్రాల్లో వివిధ చోట్ల ప్రముఖ స్వతంత్ర శాస్త్రవేత్త, ఆహార, ఆరోగ్య నిపుణులు డాక్టర్ ఖాదర్ వలి ప్రసంగించనున్నారు. ప్రవేశం ఉచితం. జనవరి 27 (ఆదివారం)న ఉ. 10 గం. నుంచి సా. 4 గం. వరకు విజయవాడలోని సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ గ్రౌండ్ (పిన్నమనేని పాలీక్లినిక్ రోడ్డు)లో సిరిధాన్యాలపై రాష్ట్రస్థాయి సదస్సులో డా. ఖాదర్ వలి ప్రసంగిస్తారు. గోఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం, రైతునేస్తం ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ సదస్సు జరగనుంది. వివరాలకు.. 98481 23050, 99632 32104, 98493 12629. జనవరి 28 (సోమవారం) ఉ. 10– మ. 1 గం. వరకు ఖమ్మంలోని ఇ.ఆర్.ఆర్. రిసార్ట్స్ (మమతా ఆసుపత్రి రోడ్డు)లో తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల సంఘం, రైతునేస్తం ఫౌండేషన్, ఇ.ఆర్.ఆర్. రిసార్ట్స్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగే సభలో డాక్టర్ ఖాదర్ వలి ప్రసంగిస్తారు. వివరాలకు.. 98490 01725, 70939 73999 జనవరి 28 (సోమవారం)న సా. 4 గం.– రా. 7 గం. వరకు నల్లగొండలోని లక్ష్మీ గార్డెన్స్ (హైదరాబాద్ రోడ్డు)లో డాక్టర్ ఖాదర్ వలి ప్రసంగిస్తారు. తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల సంఘం, రైతునేస్తం ఫౌండేషన్, లయన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ సభను నిర్వహిస్తున్నాయి. వివరాలకు.. 98486 99282, 70939 73999. జనవరి 29 (మంగళవారం)న ఉ. 10 గం. – మ. 1 గం. వరకు హైదరాబాద్ మెహిదీపట్నంలోని అశోక గార్డెన్స్, కొణిజేటి ఎన్క్లేవ్ (ఎక్స్‌ప్రెస్ హైవే పిల్లర్ 83 వద్ద)లో డాక్టర్ ఖాదర్ వలి సిరిధాన్యాల సాగు, అటవీ చైతన్య ద్రావణం తయారీ, సిరిధాన్యాలను మిక్సీలతో శుద్ధి చేయడంపై తదితర అంశాలపై ప్రసంగిస్తారు. తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల సంఘం, రైతునేస్తం ఫౌండేషన్, కొణిజేటి గార్డెన్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ సభను నిర్వహిస్తున్నాయి. వివరాలకు.. 94419 27808, 70939 73999. 26న చెవుటూరులో ప్రకృతి సేద్యంపై శిక్షణ కృష్ణా జిల్లా జి. కొండూరు మండలం చెవుటూరులోని గోసేవా క్షేత్రంలో ఈ నెల 26 (శనివారం) ఉ. 9 గం.– సా. 4 గం. వరకు ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అనంతపురం జిల్లా బసంపల్లికి చెందిన ప్రకృతి వ్యవసాయదారుడు తాడిమర్రి నాగరాజు చేత శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు గోసేవా క్షేత్రం నిర్వాహకులు పోకూరి బాలకృష్ణ, ఇందిరారాణి తెలిపారు. ప్రవేశం ఉచితం. వివరాలకు.. 91826 71819, 94407 46074. గోపాలనపై 4 రోజుల సర్టిఫికెట్ కోర్సు గోపాలనలో వివిధ అంశాలపై బెంగళూరులోని ఆర్ట్ ఆఫ్ లివింగ్‌కు చెందిన ఎస్.ఎస్.ఐ.ఏ.ఎస్.టి. ఆధ్వర్యంలో జనవరి 31 నుంచి ఫిబ్రవరి 3 వరకు 4 రోజుల సర్టిఫికెట్ కోర్సు నిర్వహిస్తున్నట్లు ట్రస్టు బాధ్యులు ఉమామహేశ్వరి తెలిపారు. వివిధ దేశీ జాతులకు చెందిన వెయ్యి ఆవులతో కూడిన గోశాలను ప్రామాణికంగా నిర్వహిస్తున్న బెంగళూరులోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆశ్రమంలో శిక్షణ ఇస్తారు. దేశీ ఆవుల విశిష్టత, వాటి ఆలన – పాలన, సేంద్రియ మేత, ఎ2 పాల ఉత్పత్తి, గోమయం, గోమూత్రాలతో ఫినాయిల్, విభూది, అగర్బత్తీ, పంచగవ్య వంటి ఉత్పత్తుల తయారీపై శిక్షణ ఇస్తారు. కోర్సు చందా: రూ. 5 వేలు. రిజిస్ట్రేషన్ ఇతర వివరాలకు.. 90004 08907, 79937 95246, 93810 25358. -
ఒంటికి యోగా మంచిదేగా..!
బేస్తవారిపేట: నేటి మానవ జీవనం అస్తవ్యస్తంగా.. ఉరుకులు పరుగులతో సాగిపోతోంది. పాశ్చాత్య పోకడలతో, నవ్యత పేరిట మనిషి జీవన విధానంలో అసంబద్ధత చోటుచేసుకుంది. దీనివల్ల ఆరోగ్యం కూడా దూరం అవుతోంది. అందుకే ప్రస్తుతం యోగాకు విస్తృత ప్రాచుర్యం కల్పించాల్సిన అవసరం వచ్చింది. పురాతన భారతీయ ఆచార వ్యవహారాల్లో ముఖ్యంగా యోగాలోని సూర్యనమస్కారాల్లో ఎన్నో ఆరోగ్య రహస్యాలున్నాయని గ్రమించి మళ్లీ వాటిని అనుసరించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. సనాతన సంప్రదాయం నిత్య నూతన మనడానికి నేటి పరిస్థితులే నిదర్శనంగా నిలుస్తున్నాయనడంలో సందేహంలేదు. తెల్లవారుజామున, తిరిగి సాయంత్రం వేళ సూర్యునికి ఎదురుగా నిలబడి దండం పేరిట కాసేపు నిలబడితే మంచే జరుగుతుందని నిరూపితమైన సత్యం. ఇలా చేయడం వల్ల సూర్యుని కాంతి నుంచి ప్రసరించే డి విటమిన్ సహజ సిద్ధంగా శరీరానికి అందుతుంది. తద్వారా ఎముకల పటుత్వం పెరిగి శారీరక బలం చేకూరుతుంది. చర్మం తేజోవంతం అవుతుంది. 12 భంగిమల్లో సూర్యనమస్కారం చేయడంతో దృఢత్వం రావడంతో పాటు అనేక రోగాలు మాయమవుతాయి. సూర్యనమస్కారాలు అంటే.. సూర్యునికి ఎదురుగా నిలబడి నమస్కారం చేయడం సూర్య నమస్కారం అంటారు. ఈ భంగిమ వల్ల మానసిక ఏకాగ్రత పెరుగుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. పాద హస్తాసనం రక్తప్రసరణలో లోపాలు తగ్గి నాడీ మండల వ్యవస్థ ఉత్తేజితమై కడుపులోని అవయవాల సామర్థ్యం పెరుగుతుంది. చతురంగ దండాసనం కాళ్లు, చేతులు, భుజ కండరాలు దృఢపడి శరీర సౌష్టవం పెరుగుతుంది. సాష్టాంగ నమస్కారం గుండె కండరాలు బలోపితమై గుండె పనితీరు మెరుగై, హృదయ సంబంధిత వ్యాధులు దూరమవుతాయి. హస్త ఉత్తవాసనం చేతులు, భుజంలో ఉండే కండరాలు బలోపితం అవుతాయి. వెన్నెముక నరాలు ఉత్తేజితమై ఊపిరితిత్తులు శుభ్రమవుతాయి. శ్వాస సంబంధిత రోగాలు తగ్గు ముఖం పడుతాయి. ఏకప్రాద ప్రసరణ ఆసనం కాళ్ల కండరాలు బలోపితమై నాడీమండలం అందించే సూచనలు ఆటంకాలు లేకుండా సంబంధిత ప్రదేశాలకు నిరాటంకంగా చేరుతాయి. భుజంగాసనం ఈ ఆసనం వల్ల వెన్నునొప్పి, ఉబ్బసం, సర్వైకల్ స్పాండిలోసిస్ వంటి అనోరోగ్యాలు దూరమై ఆరోగ్యం కుదుటపడుతుంది. పర్వాతాసనం చేతులు, భుజాన్ని బలోపితం చేసి మెన్నెముక కండరాన్ని శక్తివంతం చేసి నడుం చుట్టూ ఉండే కొవ్వును కరిగిస్తుంది. మిగిలిన 4 ఆసనాలు తిరిగి మొదటి నుంచి ప్రారంభమవుతాయి. ఇలా 12 రకాల సూర్యనమస్కారాలను ఉదయం సూర్యోదయ సమయంలో చేయడం వలన భక్తితో పాటు ఆరోగ్యం కలుగుతుంది. యోగా మనదే.. ఒంగోలు కల్చరల్: శరీరం, మనస్సుపై నియంత్రణ సాధించగలిగిన వారిని యోగులుగా వ్యవహరిస్తారు. ప్రాణాయామం, యోగాసనాలు, «ధ్యానంవంటి వాటిని భారతదేశం వేల సంవత్సరాల క్రితమే ప్రపంచానికి కానుకగా అందచేసింది. ప్రధాని నరేంద్ర మోదీ కృషివల్ల ఐక్యరాజ్య సమితి జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించింది. 2015 నుంచి పలు దేశాలు యోగ డే నిర్వహిస్తున్నాయి. ప్రపంచానికి యోగాను మరోసారి కానుకగా ఇచ్చిన ఘనత ఆధునిక కాలంలో మన దేశానికి కలిగింది. మోక్షసాధనకు, భగవత్సాక్షాత్కారానికి యోగాభ్యాసం దోహదం చేస్తుందని పలువురు పేర్కొంటున్నారు. కురుక్షేత్ర సంగ్రామంలో అంపశయ్యపై పడిపోయిన భీష్ముడు చివరకు యోగమార్గంలో తన ప్రాణాలను విడిచిపెట్టాడు. ఏ మతానికి చెందిన వారైనా యోగాభ్యాసం, యోగాసనాలు సాధన చేయవచ్చని దీనిలో హిందుత్వాన్ని సూచించే ఓంకారాన్ని పలకవలసినవసరం లేదంటూ యోగాను అంతర్జాతీయంగా పరిచయం చేసేందుకు కొందరు కృషి చేశారు. పలు శిక్షణ సంస్థలు జిల్లాలో యోగ శిక్షణ ఇచ్చే సంస్థలు అనేకం ఉన్నాయి. పతంజలి యోగ భారత్‌స్వాభిమాన్ ట్రస్ట్‌తో పాటు అరవింద సొసైటీ, వివేకానంద హఠయోగ కేంద్రం వంటి పలు సంస్థలు యోగ శిక్షణను అందచేస్తున్నాయి. నేటి కార్యక్రమాలు అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని గురువారం ఉదయం ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. అలాగే గురువారం సాయంత్రం 6 గంటలకు వాసవీ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక తాతా కల్యాణ మండపంలో యోగ దినోత్సవాన్ని ఏర్పాటు చేశారు. వేద విజ్ఞాన పీఠం నిర్వాహకులు కుప్పా శివసుబ్రహ్మణ్య అవధాని పతంజలి యోగ విశిష్టత గురించి ప్రసంగిస్తారు. పతంజలి యోగ సాధకులచే యోగాసనాల ప్రదర్శన, మనోన్మని విద్యార్థు«లచే నృతప్రదర్శనలు జరుగుతాయి. -
యోగాతోనే సంపూర్ణారోగ్యం
కుల్కచర్ల: యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని, ప్రతి ఒక్కరూ తప్పకుండా యోగా చేయాలని జిల్లా పతంజలి యోగా ప్రచారక్ లాలయ్, పతంజలి ఆరోగ్య కేంద్రం నిర్వహకుడు రమేష్ అన్నారు.మంగళవారం మండల పరిధిలోని ఇప్పాయిపల్లి గేట్ దగ్గర పంచవటి విద్యాలయంలో చిన్నారులకు యోగా శిక్షణ ఇచ్చారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. -
‘సంపూర్ణ ఆరోగ్యం’పై దృష్టి పెట్టండి!
- పీజీఐఎంఈఆర్ స్నాతకోత్సవంలో వైద్యులకు మోదీ పిలుపు చండీగఢ్: సంపూర్ణ ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన పెరిగిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. అనారోగ్యం గురించి కాకుండా, వ్యాధి నివారణ, సంపూర్ణ ఆరోగ్యం గురించి ఆలోచించే ధోరణి ప్రారంభమైందన్నారు. ఆరోగ్య రంగ విధానాలు, వ్యూహాలూ ఈ దిశగానే సాగుతున్నాయన్నారు. వైద్యులు కూడా దీనిపై దృష్టి పెట్టాలన్నారు. ఔషధాలపై ఆధారపడని మంచి ఆరోగ్యం కావాలని ఇప్పడు ప్రజలు కోరుకుంటున్నారన్న మోదీ.. యోగా అందుకు సరైన సాధనమన్నారు. ప్రజలను అనారోగ్యం నుంచి సంపూర్ణ ఆరోగ్యం వైపు తీసుకెళ్లే సామర్థ్యం యోగాకుందని, అందుకే ప్రపంచం యోగా వైపు ఆకర్షితమైందని వివరించారు. ‘192 దేశాల మద్దతుతో,177 దేశాలు సహ స్పాన్సర్స్‌గా, కేవలం 100 రోజుల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవ తీర్మానం ఐక్యరాజ్య సమితి ఆమోదం పొందింది’ అని గుర్తు చేశారు. చండీగఢ్‌లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(పీజీఐఎంఈఆర్) 34వ స్నాతకోత్సవంలో శుక్రవారం మోదీ పాల్గొన్నారు. వైద్యులుగా సమాజంలో నిర్వర్తించాల్సిన బాధ్యతలపై వారికి దిశానిర్దేశం చేశారు. ప్రజలకు, ముఖ్యంగా పేదలకు సేవ చేసే గొప్ప బాధ్యత వైద్యులపై ఉందన్నారు. మోదీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు.. - ‘ఏ విషయంలోనైనా అనిశ్చితి ఏర్పడినప్పుడు, ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియని పరిస్థితి ఏర్పడినప్పుడు.. దేశంలోని అత్యంత పేదవాడి ముఖాన్ని గుర్తుకు తెచ్చుకోండి. మీరు తీసుకునే ఏ నిర్ణయం ఆ పేదవాడికి ఉపయోగపడ్తుందో ఆ నిర్ణయంతీసుకోండి’ అంటూ మహాత్మాగాంధీ బోధించారు. విధుల్లో భాగంగా మీకలాంటి పరిస్థితి వస్తే, మీరూ మహాత్ముడి ఆ సూచనను గుర్తు తెచ్చుకోండి. ఏ నిర్ణయం తీసుకోవాలో ఆటోమేటిక్‌గా మీకు తెలిసిపోతుంది. - మీరు తీసుకునే నిర్ణయాల్తో ఇతరులు, మొత్తం సమాజం ప్రభావితమవుతుంది. - వైద్యుడంటే సామాన్యుడికి దైవం తరువాత దైవం అంతటివాడు. ఆ గౌరవాన్ని డాక్టర్లు కాపాడుకోవాలి. - మీలో కొందరు విదేశాలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు కావచ్చు. కానీ ఇది మీ దేశం. మీరీ స్థాయికి రావడానికి పరోక్షంగా ఈ దేశంలోని ‘చాయ్‌వాలా’ సహా ఎందరో పేదల కృషి కూడా ఉంది. వారి రుణం తీర్చుకునే దిశగా కూడా మీరు ఆలోచించాలి. - సెప్టెంబర్ 11 అంటే ఏమీ గుర్తురాదు. కానీ 9/11 అనగానే అమెరికాలో ఉగ్రదాడి జరిగిన రోజు గుర్తొస్తుంది. మానవత్వం మంట గలిసిన రోజు, వేలాదిమంది చనిపోయిన రోజు అది. ఈ రోజు కూడా సెప్టెంబర్ 11నే. అయితే ఇది ప్రజల ప్రాణాలను కాపాడడానికి యువ వైద్యులు సమాయత్తమవుతున్న రోజు. అందుకే ఈ రోజు మీ జీవితాల్లో చాలా ముఖ్యమైంది. - సెప్టెంబర్ 11కు మరో చరిత్రాత్మక ప్రత్యేకత కూడా ఉంది. 1893లో ఇదే రోజు అమెరికాలోని షికాగోలో సర్వ మత సమ్మేళనంలో స్వామి వివేకానంద ప్రసంగించారు. అమెరికన్లకు మానవత్వంలోని ఔన్నత్యాన్ని చాటిచెప్పారు. ఫీజు ఇచ్చుకోలేని ఒక పేద రోగికి ఒక వైద్యుడు చికిత్స చేస్తే, 20 ఏళ్ల తరువాతైనా ఆ రోగి ఫీజు చెల్లించి, రుణం తీర్చుకుంటాడు. తన పేదరికాన్ని ఆమోదించిన వైద్యడిని అలా గుర్తు పెట్టుకుంటారు. -
పోషకాహారంతో సంపూర్ణ ఆరోగ్యం
సాక్షి ‘మైత్రి’కి మంచిస్పందన సాక్షి, సిటీబ్యూరో: మహిళ ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం మొత్తం ఆరోగ్యకరంగా ఉంటుందని ప్రముఖ పోషకాహార నిపుణులు డాక్టర్ సుజాత అన్నారు. ప్రతి మహిళ నిత్యం ప్రొటీన్లు, విటమిన్లు ఉన్న ఆహార పదార్థాలను అధికంగా తీసుకోవాలని సూచించారు. మహిళల హక్కులు, పౌష్టికాహారం, గర్భాశయ సంబంధిత సమస్యలు, యువతకు వ్యక్తిత్వ వికాసం తదితర అంశాలపై గురువారం ‘సాక్షి’ ఆధ్వర్యంలో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన మైత్రి మహిళ, యువ మైత్రి కార్యక్రమాలకు జంట నగరాలకు చెందిన మహిళలు, యువతీ యువకులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ ప్రీతిరెడ్డి మాట్లాడుతూ మహిళలు గర్భధారణసమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు, ప్రసవానంతరం తీసుకోవలసిన ఆహారం, జాగ్రత్తలను తెలియజేశారు. స్త్రీలలో వచ్చే సర్వైకల్, బ్రెస్ట్ క్యాన్సర్లను ఎలా గుర్తించాలి, ఎలాంటి వైద్య పరీక్షలు చేయించుకోవచ్చు, ఎటువంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలపై అవగాహన కల్పించారు. ఈ అంశాలపై పలువురు మహిళల సందేహాలను ఆమె నివృత్తి చేశారు. చక్కని భవితకు మార్గనిర్దేశం యువత భవిష్యత్తుకు చక్కటి బాట వేయడానికి ‘సాక్షి’ చేసిన ప్రయత్నమే ‘యువ మైత్రి’ కార్యక్రమం. కెరీర్‌కు సంబంధించిన మార్గదర్శకాలపై రెండోసెషన్‌లో కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్ర మహిళా సభ ప్రిన్సిపల్ డాక్టర్ దుర్గ మాట్లాడుతూ యువత ఒక నిర్దిష్ట లక్ష్యాన్ని ఏర్పరచుకొనిముందుకు సాగాలని సూచించారు. ప్రత్యేక ప్రణాళికను రచించుకొని, ఆసక్తి ఉన్న రంగంలో సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలన్నారు. యువత ఇంటర్వ్యూలకు హాజరైనపుడు ఎదురయ్యే సమస్యలు, వాటిపరిష్కారాలను సూచించారు. అనంతరం విద్యార్థులకు మాక్ ఇంటర్వ్యూలు నిర్వహించారు. మహిళల కోసం వినూత్న కార్యక్రమాలు, యువతకు కెరీర్ సంబంధించిన విషయాలపై ‘సాక్షి’ ప్రతి నెల ఉచితంగా కౌన్సెలింగ్ నిర్విహ స్తుందని నిర్వాహకులు తెలిపారు. వివరాలకు 95055 55020 నెంబర్లో సంప్రదించవచ్చు. అన్ని కార్యక్రమాలూ బాగున్నాయి ‘సాక్షి’ నిర్వహిస్తున్న అన్ని కార్యక్రమాలలో నేను పాల్గొంటున్నాను. ఈ రోజు మహిళల ఆరోగ్య సమస్యలపై నిర్వహించిన వర్క్‌షాప్ చాలా ఉపయోగపడింది. నిపుణుల సలహాలతో ఎన్నో సందేహాలు తీరాయి. స్త్రీల కోసం మరెన్నో కార్యక్రమాలు చేపట్టాలని కోరుతున్నా. - పరంజ్యోతి, కేపీహెచ్‌బీ స్ఫూర్తినిచ్చింది నేను ఈ సంవత్సరమే డిగ్రీ పూర్తి చేశాను. తర్వాత ఏ రంగాన్ని ఎంచుకోవాలి? ఎలాఅడుగు ముందుకు వేయాలో అర్థం కాని సమయంలో ఈ కార్యక్రమం గురించి తెలిసింది. ‘సాక్షి’ యువ మైత్రి పేరిట నిర్వహించిన కౌన్సెలింగ్ నాలో స్ఫూర్తిని, ఉత్తేజాన్ని నింపింది. నేటి యువతకు ఇలాంటి కార్యక్రమాలు చాలా అవసరం. ఏ రంగాన్ని ఎంచుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్న యువతకు ఈ కార్యక్రమం ఒక వేదిక లాంటిది. - మౌనిక, మల్కాజ్గిరి జాబ్ ఫెయిర్స్ నిర్వహించాలి యువత ఏ రంగంలో రాణించాలన్నా వ్యక్తిత్వ వికాసం, కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ముఖ్యం. వీటిపై ఉచితంగా వర్క్‌షాప్‌లు నిర్వహించడం బాగుంది. కె రీర్ అంశాలపై కౌన్సెలింగ్‌తో పాటు జాబ్ఫెయిర్స్ కూడా ఎక్కువగా నిర్వహిసే ్త బాగుంటుంది. యువతకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది. -ప్రేమచందర్, అమీర్‌పేట