సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ప్రకృతి వ్యవసాయ విధానం ఆదర్శనీయమని ప్రపంచ ప్రసిద్ధి చెందిన గ్లోబల్ ఇన్ఫర్మేషన్ షేరింగ్ టూల్‌కిట్ (జిస్ట్) ఇంపాక్ట్ సంస్థ ప్రకటించింది. వైఎస్ జగన్ ప్రభుత్వ ప్రోత్సాహంతో రాష్ట్రంలో పెద్ద ఎత్తున అమలవుతున్న ప్రకృతి వ్యవసాయం ప్రపంచంలోనే వ్యవసాయ పర్యావరణానికి (అగ్రో ఎకాలజీకి) అతి పెద్ద పరివర్తన (మార్పు) అని తెలిపింది. ప్రకృతి వ్యవసాయం ప్రస్తుత వ్యవసాయ విధానాలకు సరియైన లాభసాటి ప్రత్యామ్నాయ విధానమని వెల్లడించింది. అధిక దిగుబడి, అత్యున్నత జీవనోపాధి, సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రకృతి వ్యవసాయం ఎంతగానో దోహదపడుతుందని తెలిపింది.
ప్రపంచ స్థాయి సంస్థల కూటమి (గ్లోబల్ అలయన్స్ ఫర్ ది ఫ్యూచర్ ఆఫ్ ఫుడ్ ) మద్దతుతో జిస్ట్ ఇంపాక్ట్ సంస్థ ఆంధ్రఫ్రదేశ్‌లో నిర్వహించిన అధ్యయన ఫలితాలను బుధవారం వెల్లడించింది. భావితరాలను దృష్టిలో ఉంచుకొని ప్రపంచ స్థాయిలో ఆహార వ్యవస్థల్లో పరివర్తన తేవడానికి ఈ సంస్థలు కలిసి పనిచేస్తున్నాయి. ఇందులో భాగంగా రాష్ట్రంలోని మూడు విభిన్న ప్రాంతాల్లో ప్రకృతి వ్యవసాయ ఫలితాలను నిశితంగా పరిశీలించారు. కోస్తా, రాయలసీమ, డెల్టా ప్రాంతాల్లో అధ్యయనం చేశారు. 2020 – 2022 మధ్య ఎంపిక చేసిన 12 గ్రామాల్లో ఇంటింటా సమగ్ర ప్రాథమిక సర్వే చేశారు. విస్తృత ప్రయోజనాలతో నిర్వహించిన ఈ అధ్యయనంలో పలు అంశాలు వెలుగు చూశాయి.
వ్యవసాయ పర్యావరణ మార్పునకు దోహదం
ఇతర విధానాలతో పోల్చితే సంప్రదాయ జీవ ఎరువులతో చేస్తున్న ప్రకృతి వ్యవసాయంలో అధిక దిగుబడి వస్తోంది. ఈ విధానంలో పంట వైవిధ్యత చూపితే 11% అధిక దిగుబడి వ స్తుంది. ఇది పెరుగుతున్న జనా భాకు సరిపడే ఆహారాన్ని ఉత్పత్తి చేస్తుంది. తద్వారా 49% అధిక లాభం చేకూరడంతో ప్రకృతి వ్యవసాయ కుటుంబాల్లో ఆనందం వెల్లి విరుస్తోంది. ఆ రైతుల కుటుంబాల జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయి. రైతు వ్యవస్థ బలంగా తయారవుతోందని వెల్లడించింది.
ప్రకృతి సాగులో మహిళా శ్రామిక శక్తి అధికం
మహిళా సంఘాల సభ్యులు భాగస్వామ్యం పెరుగు తుండడంతో ప్రకృతి సాగులో మహిళా శ్రామిక శక్తి అధికంగా కనిపిస్తోందని జిస్ట్ ఇంపాక్ట్ పేర్కొంది. మహిళలు క్రియాశీలక పాత్ర పోషిస్తుండడంతో కు టుంబాల మధ్య ఐక్యత, అన్యోన్యత పెరుగు తు న్నాయి. తద్వారా సామాజిక పెట్టుబడిలో పెరుగు దల స్పష్టంగా కన్పిస్తోంది. ఇతర పద్ధతుల్లో వ్యవ సాయం చేసే రైతులతో పోలిస్తే ప్రకృతి సాగు చేసే రైతుల్లో 33%తక్కువ పని దినాలతోనే అనుకున్న లక్ష్యాలను సాధిస్తున్నారు.
సంప్రదాయ పద్ధతుల్లో వ్యవసాయం చేసే రైతులు మితిమీరి వినియోగి స్తున్న రసాయనిక ఎరువులు, పురుగు మందుల వాడకం వల్ల ఉత్పాదకత నష్టాలతోపాటు అనారో గ్యానికి గురవుతున్నారు. ప్రకృతి సాగులో ఆ పరిస్థితి కన్పించడంలేదు. గ్రామీణ జీవనోపాధి, పౌష్టికాహా రం, జీవ వైవిధ్య నష్టం, వాతావరణ మార్పు, నీటి కొరత, కాలుష్యం వంటి బహుళ అభివృద్ధి సవాళ్లను ప్రకృతి సాగు చేస్తున్న రైతులు అధిగమిస్తున్నారని అధ్యయనంలో గుర్తించినట్టు ఆ సంస్థ తెలిపింది.
భవిష్యత్ ప్రణాళికకు ఇదొక బ్లూ ప్రింట్
మా పరిశోధన వాతావరణ పర్యావరణ అనుకూల వ్యవసాయ అభివృద్ధికి ఒక నమూనా (బ్లూప్రింట్)గా ఉపయోగపడుతుంది. ఏపీని స్ఫూర్తిగా తీసు కొని ప్రకృతి వ్యవసాయంలో ముందుకె ళ్లాలని భాగస్వామ్య దేశాలకు సిఫార్సు చేస్తాం.
– పవన్ సుఖ్‌దేవ్, జిస్ట్ ఇంపాక్ట్, సీఈవో
ప్రభుత్వ కృషి ప్రశంసనీయం
ప్రకృతి వ్యవసాయం ద్వారా రైతుల జీవితాలు, సమాజంలో మార్పుకు కృషి జరుగు తున్నట్టు గుర్తించాం. సంప్రదాయ వ్యవ సాయం నుంచి రైతులను ప్రకృతి వ్యవ సాయం దిశగా తీసుకు వె ళ్లేందుకు ప్రభుత్వం చే స్తున్న కృషి ప్రశంసనీయం.
– లారెన్ బేకర్, డిప్యూటీ డైరెక్టర్,
గ్లోబల్ అలయన్స్ ఫర్ ది ఫ్యూచర్
అంతర్జాతీయంగా గుర్తింపు
భవిష్యత్‌లో ఎదురయ్యే ఆహార సంక్షోభ పరి స్థితులకు ప్రకృతి వ్యవసాయం ఒక్కటే చక్క టి పరిష్కారమని జిస్ట్ ఇంపాక్ట్ సర్వే స్పష్టం చేస్తోంది. రెండేళ్లపాటు శాస్త్రీయ పద్ధతిలో చేసిన ఈ అధ్యయనం ఫ లితాలు రాష్ట్రంలో ప్రకృతి సాగుకు అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చేందుకు దోహదపడతాయి.
– టి.విజయ్ కుమార్, ఎగ్జిక్యూటివ్ వైస్‌చైర్మన్, రైతు సాధికార సంస్థ
Comments
Please login to add a commentAdd a comment