వాజపేయి ప్రసంగం ఇప్పటికీ ఎందరినో వెంటాడుతోంది | Atal Bihari Vajpayee Speeches In Parliament | Sakshi
Sakshi News home page

Published Thu, Aug 16 2018 6:32 PM | Last Updated on Thu, Mar 21 2024 7:54 PM

1996లో కేవలం 13 రోజుల పాటు ప్రధాని పదవిలో కొనసాగిన వాజ్‌పేయి గద్దె దిగిపోతూ మంద్రస్వరంతో నీతి నిజాయితీ ఉట్టిపడేలా చేసిన ప్రసంగం భారత పార్లమెంటరీ చరిత్రలోనే ఒక కీలక ఘట్టం. నాటి ప్రసంగాన్ని  దూరదర్శన్‌ లైవ్‌ టెలికాస్ట్‌ చేయడంతో వాజపేయి ప్రసంగం ఇప్పటికీ ఎందరినో వెంటాడుతోంది. ఇలా చట్టసభల సమావేశాలను లైవ్‌ ఇవ్వడం కూడా అదే తొలిసారి. అప్పట్లో వాజపేయి సభ విశ్వాసాన్ని పొందలేకపోయినప్పటికీ తన ప్రసంగం ద్వారా  ప్రజల విశ్వాసాన్ని చూరగొన్నారు. ‘మీకు ఎంత శాతం ఓట్లు వచ్చాయని నన్ను అందరూ అడుగుతున్నారు. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓట్లు ముఖ్యమా ? సీట్లు ముఖ్యమా ? మన పార్లమెంటరీ వ్యవస్థలో నెగిటివ్‌ ఓట్లను ఎవరూ లెక్కపెట్టరు. అలాంటప్పుడు ప్రజలు మమ్మల్ని తిరస్కరించారని మీరెలా అంటారు‘ అంటూ వాజ్‌పేయి చేసిన ప్రసంగం ఈనాటి రాజకీయాలకు కూడా అద్దం పడుతోంది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement