భారత మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి మృతితో యావత్ దేశం శోకసంద్రంలో మునిగిపోయింది. వాజ్‌పేయి మృతి పట్ల రాజకీయ నేతలు, ప్రముఖులు, విదేశీ నేతలు సంతాపం ప్రకటిస్తున్నారు. వాజ్‌పేయిని చివరి చూపు చూసేందుకు ఇప్పటికే దేశ నలుమూలల నుంచి రాజకీయ ప్రముఖుల, అభిమానులు ఢిల్లీకి తరలివస్తున్నారు. వాజ్‌పేయి అకాల మరణంతో ఆగస్టు22 వరకు సంతాపదినాలుగా పాటించనున్నట్లు కేంద్రప్రభుత్వం ప్రకటించింది.