ఆ సీడీల్లో ఏముందో పరిశీలిస్తున్నాం.. | Zakir speeches being examined | Sakshi
Sakshi News home page

ఆ సీడీల్లో ఏముందో పరిశీలిస్తున్నాం..

Published Fri, Jul 8 2016 12:35 PM | Last Updated on Mon, Sep 4 2017 4:25 AM

ఆ సీడీల్లో ఏముందో పరిశీలిస్తున్నాం..

ఆ సీడీల్లో ఏముందో పరిశీలిస్తున్నాం..

న్యూఢిల్లీ: వివాదాస్పద ముస్లిం మత ప్రవక్త జాకీర్ నాయక్ ప్రసంగాలపై విచారణ చేపడుతున్నామని శుక్రవారం కేంద్ర హోంమంత్రి రాజనాథ్ సింగ్ స్పష్టం చేశారు. జకీర్ ప్రసంగాలతో కూడిన సీడీలను అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలిపిన ఆయన.. ఈ విషయంలో పూర్తిస్థాయిలో విచారణ జరుగుతుందని తెలిపారు. ఉగ్రవాదం విషయంలో ఏమాత్రం రాజీపడే ప్రసక్తే లేదని రాజనాథ్ సింగ్ తేల్చి చెప్పారు.

జకీర్ తన ప్రసంగాలతో అమాయకులను ఉగ్రవాదం వైపు మళ్లించాడనే అరోపనలున్నాయి. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఇటీవల జరిగిన ఉగ్రదాడులకు డాక్టర్ జాకీర్ నాయక్ కారణమని తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement