rajanath singh
-
క్షిపణి మిస్ ఫైర్ పై రాజ్యసభలో రాజ్ నాథ్ సింగ్ ప్రకటన
-
రాజ్‌నాథ్‌సింగ్ సభలో అగ్నిప్రమాదం..!
సాక్షి, నిజామాబాద్: నిజామాబాద్‌లో ఏర్పాటు చేసిన బీజేపీ ఎన్నికల ప్రచారంలో అపశ్రుతి చోటుచేసుకుంది. ఈ బహిరంగ సభలో బీజేపీ సీనియర్ నేత, కేంద్రం హోంశాఖ మంత్రి రాజనాథ్ సింగ్ పాల్గొనగా.. పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యారు. భారీస్థాయిలో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణం వద్ద షార్ట్ సర్క్యూట్ జరగి ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే, స్వల్పంగా వ్యాపించిన మంటలను అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఆర్పివేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని అధికారులు తెలిపారు. కేంద్ర హోంశాఖ సిబ్బంది నగర కమిషనర్ కార్తికేయను వివరాలు అడిగి తెలుసుకున్నారు. -
వెలుగులోకి గవర్నర్ లేఖ..!
-
ఆ సీడీల్లో ఏముందో పరిశీలిస్తున్నాం..
న్యూఢిల్లీ: వివాదాస్పద ముస్లిం మత ప్రవక్త జాకీర్ నాయక్ ప్రసంగాలపై విచారణ చేపడుతున్నామని శుక్రవారం కేంద్ర హోంమంత్రి రాజనాథ్ సింగ్ స్పష్టం చేశారు. జకీర్ ప్రసంగాలతో కూడిన సీడీలను అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలిపిన ఆయన.. ఈ విషయంలో పూర్తిస్థాయిలో విచారణ జరుగుతుందని తెలిపారు. ఉగ్రవాదం విషయంలో ఏమాత్రం రాజీపడే ప్రసక్తే లేదని రాజనాథ్ సింగ్ తేల్చి చెప్పారు. జకీర్ తన ప్రసంగాలతో అమాయకులను ఉగ్రవాదం వైపు మళ్లించాడనే అరోపనలున్నాయి. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఇటీవల జరిగిన ఉగ్రదాడులకు డాక్టర్ జాకీర్ నాయక్ కారణమని తీవ్ర విమర్శలు వస్తున్నాయి. -
మీరే చూసుకోండి..!
-
జోక్యం చేసుకోం
* ‘ఓటుకు కోట్లు’పై గవర్నర్ నరసింహన్‌కు కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ స్పష్టీకరణ * సెక్షన్-8, ‘ఓటుకు కోట్లు’ రెండూ వేర్వేరు అంశాలు * కేసును దర్యాప్తు సంస్థలు, న్యాయస్థానాలు చూసుకుంటాయి * పూర్తి అధికారాలను స్వేచ్ఛగా వినియోగించుకోవాలని ఆదేశం సాక్షి, హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసు విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి జోక్యం చేసుకోబోదని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. తెలంగాణలో విచారణ సాగుతున్న ఓటుకు కోట్లు కేసు, తదనంతర పరిణామాల నేపథ్యంలో రెండు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్‌ను ఢిల్లీకి పిలిచిన కేంద్రం ఈ విషయంపై స్పష్టతనిచ్చినట్టు అత్యున్నతస్థాయి వర్గాలు తెలిపాయి. ‘‘ఓటుకు కోట్లు కేసులో కేంద్రం ఎటువంటి డెరైక్షన్ ఇవ్వబోదు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరచిన సెక్షన్-8 అంశం, ఓటుకు కోట్లు కేసు వ్యవహారం వేర్వేరు అంశాలు. రెండింటినీ కలిపి చూడటం సరికాదు’’ అని స్పష్టతనిచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటు వేయాలంటూ తెలంగాణ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు రూ. 5 కోట్లు ఆశ చూపిన ఉదంతంలో టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడటం, అందులో చంద్రబాబు నేరుగా ఫోన్లో మాట్లాడిన సంభాషణలు బాహ్యప్రపంచానికి వెల్లడైన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం విభజన చట్టంలోని సెక్షన్-8ను తెరమీదకు తెచ్చిన విషయం తెలిసిందే. ఆ మేరకు కేంద్రానికి ఫిర్యాదు కూడా చేసింది. అయితే ఈ పరిణామాలు రోజుకో మలుపు తిరుగుతున్న క్రమంలో కేంద్ర హోంమంత్రి గవర్నర్‌ను గత శుక్రవారం ఢిల్లీకి పిలిపించుకుని వివరాలను అడిగి తెలుసుకున్నారు. హోంమంత్రితో పాటు పలు దఫాలుగా హోం శాఖ కార్యదర్శి గోయల్‌తో కూడా గవర్నర్ సమావేశమయ్యారు. విభజన చట్టంలోని సెక్షన్-8 పరిమితిని దాటి ఉల్లంఘించిన సంఘటనలు ఏమైనా తలెత్తాయా అన్న వివరాలను తెలుసుకున్నారు. హైదరాబాద్‌లో శాంతి భద్రతకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి విఘాతం కలగలేదనీ, రెండు ప్రభుత్వాల నుంచిగానీ, సివిల్ సొసైటీస్ నుంచిగానీ ఎలాంటి ఫిర్యాదులు కూడా రాలేదని నరసింహన్ వివరించినట్టు తెలిసింది. ఇంటెలిజెన్స్ నుంచి కూడా ఎలాంటి నివేదికలు అందలేదన్నారు. విభజన చట్టంలోని సెక్షన్-8కి సంబంధించి ఉత్పన్నమైన సంఘటనలేవైనా ఉన్నాయా? అని ఆరా తీస్తూనే రాష్ట్రంలో సంచలనంగా మారిన ఓటుకు కోట్లు కేసుపైనా చర్చించినట్టు హోం శాఖకు చెందిన ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి. ఆ వర్గాలు అందించిన సమాచారం మేరకు... ఓటుకు కోట్లు కేసును విభజన చట్టంలోని సెక్షన్-8 కి ముడిపెట్టి మాట్లాడటం సరికాదని, ఆ రెంటికీ పొంతన లేదని ఈ సందర్భంగా రాజ్‌నాథ్ వ్యాఖ్యానించారు. ఈ కేసు వ్యవహారాన్ని మొత్తంగా దర్యాప్తు సంస్థలు, న్యాయస్థానాలు చూసుకుంటాయని చెప్పారు. దీనికి సంబంధించి మీ స్థాయిలోనే నిర్ణయాలు జరగాలని స్పష్టతనిచ్చారు. ఈ కేసు వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం ఎంతవరకు ముందుకు సాగుతుందనే దానిపైన కూడా చర్చ జరిగింది. హైదరాబాద్‌లో శాంతిభద్రతలకు సంబంధించిన సెక్షన్-8 అంశం ఇప్పుడెందుకు తెరమీదకు వచ్చిందని గవర్నర్‌ను ఆరా తీశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిన పక్షంలో విభజన చట్టంలో సెక్షన్-8 ద్వారా తెలంగాణ మంత్రివర్గంతో సంప్రదించి గవర్నర్ తగిన నిర్ణయం తీసుకోవాల్సి ఉందని, ఆ పరిస్థితి ఇప్పటివరకు రాలేదని నరసింహన్ పేర్కొన్నట్లు అత్యున్నతస్థాయి వర్గాలు పేర్కొన్నాయి. రూల్ పుస్తకం, రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం నడచుకోవాలని, పూర్తి అధికారాలను స్వేచ్ఛగా వినియోగించుకోవాలని గవర్నర్‌కు కేంద్ర హోంశాఖ స్పష్టం చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ విషయంలో వెనకా ముందు ఆలోచించాల్సిన అవసరం లేదని కూడా కేంద్ర హోంశాఖ స్పష్టం చేసినట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. రాష్ట్ర విభజన జరిగిన ఏడాదిలోగా చట్టంలోని షెడ్యూల్ 9, 10ల్లో పేర్కొన్న సంస్థలను ఇరు రాష్ట్రాలు విభజనను పూర్తి చేసుకోవాలని, ఏడాది దాటినా పూర్తి స్థాయిలో విభజన జరగలేదని గవర్నర్ వివరించారు. ఆ సంస్థల విషయంలో కేంద్రం నుంచి గడువు కావాలన్నా, లేదా తదుపరి ఎలాంటి ఆదేశాలు కావాలన్నా అందుకు ప్రతిపాదనలు పంపాల్సిందిగా గవర్నర్‌కు కేంద్ర హోంశాఖ సూచించింది. -
ఘనంగా హోలీ
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా హోలీ వేడుకలను శుక్రవారం ఆనందోత్సాహతో ఘనంగా జరుపుకున్నారు. ఆబాలగోపాలం రంగులు చల్లుకుంటూ, ఆటపాటలతో సందడి చేశారు. ఢిల్లీలో వీధులన్నీ రంగులతో నిండిపోయాయి. పలు హోటళ్లు, క్లబ్బులు వేడుకలను నిర్వహించాయి. పాక్‌లో సంఘీభావం. కరాచీ: పాకిస్తాన్లో హోలీ సంబరాలు జరుపుకుంటున్న హిందువులకు స్థానిక విద్యార్థులు రక్షణగా నిలిచారు. కరాచిలోని స్వామి నారాయణ్ ఆలయంలో వేడుకలకు నేషనల్ స్టూడెంట్స్ ఫెడరేషన్ సభ్యులు మానవ కవచంగా ఏర్పడి సంఘీభావం తెలిపారు. పరమత సహనం, సామ రస్యం కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. -
కాంగ్రెస్ స్వలాభానికే విభజన
సాక్షి, న్యూఢిల్లీ: యూపీఏ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ రాజకీయ లాభం కోసమే ఆంధ్రప్రదేశ్‌ను విభజిస్తున్నాయని బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్ విమర్శించారు. 2004 నుంచీ తెలంగాణ ఏర్పాటును పట్టించుకోకుండా ఇవాళ పెద్ద గందరగోళం సృష్టించాయంటూ ధ్వజమెత్తారు. విభజన నేపథ్యంలో సీమాంధ్రుల డిమాండ్లను పరిగణనలోకి తీసుకోలేదని మండిపడ్డారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక తెలంగాణను ఏర్పాటు చేస్తూనే, మరోవైపు సీమాంధ్రుల డిమాండ్లను కూడా పరిష్కరిస్తామని పునరుద్ఘాటించారు. వైఎస్సార్సీపీ, టీడీపీ, సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు లోక్‌సభలో ఇచ్చిన అవిశ్వాస తీర్మాన నోటీసుకు బీజేపీ మద్దతివ్వబోదని స్పష్టం చేశారు. బీజేపీ అధికార ప్రతినిధులు నిర్మలా సీతారామన్, సుధాంశు త్రివేదిలతో కలసి శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటు బీజేపీ దీర్ఘకాలిక ఆకాంక్ష అని చెప్పారు. తెలంగాణ, సీమాంధ్రల్లో సుపరిపాలన, అభివృద్ధి జరగాలనే దృష్టితోనే రాష్ట్ర విభజనను తాము కాంక్షించామన్నారు. తెలంగాణ దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న డిమాండన్నారు. భావోద్వేగాలతో ముడివడ్డ సున్నితమైన అంశం కాబట్టే తెలంగాణ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాం తప్ప రాజకీయ లబ్ధి కోసం కాదని వివరణ ఇచ్చారు. తమ హయాంలో మూడు రాష్ట్రాలు సామరస్యపూర్వకంగా ఏర్పాటయ్యాయన్నారు. యూపీఏ, కాంగ్రెస్ మాత్రం తెలంగాణ నిర్ణయం తీసుకున్నాయే తప్ప సీమాంధ్రుల డిమాండ్లను పరిష్కరించకపోవడం వల్ల ఆ ప్రాంతంలో అరాచక పరిస్థితులు నెలకొన్నాయని, ఆందోళనలు జరుగుతున్నాయని అన్నారు. ‘‘ఓవైపు తెలంగాణ బిల్లు తెస్తున్నారు. ఇంకో వైపు వారి పార్టీ సీఎం, కాంగ్రెస్‌లోని కేంద్ర, రాష్ట్ర, సీమాంధ్ర మంత్రులు, పార్టీ నేతలు దాన్ని వ్యతిరేకిస్తున్నారు. అలా కాంగ్రెస్‌లోనే విభజన జరిగింది. అంతర్గత రాజకీయాలు జరుగుతున్నాయి. తెలంగాణ, సీమాంధ్రుల డిమాండ్ల అంశాలను యూపీఏ, కాంగ్రెస్ తీవ్రంగా పరిగణించడం లేదు’’ అంటూ మండిపడ్డారు. తెలంగాణ ఏర్పాటును, సీమాంధ్రుల డిమాండ్లను పరిష్కరించడాన్ని సీరియస్ అంశంగా పరిగణించాలని డిమాండ్ చేశారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు వస్తే మద్దతు ఇస్తామని పునరుద్ఘాటించారు. అలాగే సీమాంధ్రుల డిమాండ్లపై తమకు పూర్తి అవగాహన ఉందని, వాటిని పరిష్కరించేలా కేంద్రంపై ఒత్తిడి తెస్తామని అన్నారు. రాయల తెలంగాణ, హైదరాబాదును యూటీ చేయాలనే ప్రతిపాదనలు, సీమాంధ్రుల డిమాండ్లకు సంబంధించిన ప్రశ్నలపై రాజ్‌నాథ్ బదులిస్తూ యూపీఏ, కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయం చేస్తున్నాయని, బిల్లు పార్లమెంటులో చర్చకు వచ్చినప్పుడు వీటిపై మాట్లాడుతామని అన్నారు. 10 జిల్లాలతో కూడిన తెలంగాణ ఇవ్వాలన్నారు.