
ఘనంగా హోలీ
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా హోలీ వేడుకలను శుక్రవారం ఆనందోత్సాహతో ఘనంగా జరుపుకున్నారు. ఆబాలగోపాలం రంగులు చల్లుకుంటూ, ఆటపాటలతో సందడి చేశారు. ఢిల్లీలో వీధులన్నీ రంగులతో నిండిపోయాయి. పలు హోటళ్లు, క్లబ్బులు వేడుకలను నిర్వహించాయి.
పాక్‌లో సంఘీభావం.
కరాచీ: పాకిస్తాన్‌లో హోలీ సంబరాలు జరుపుకుంటున్న హిందువులకు స్థానిక విద్యార్థులు రక్షణగా నిలిచారు. కరాచిలోని స్వామి నారాయణ్ ఆలయంలో వేడుకలకు నేషనల్ స్టూడెంట్స్ ఫెడరేషన్ సభ్యులు మానవ కవచంగా ఏర్పడి సంఘీభావం తెలిపారు. పరమత సహనం, సామ రస్యం కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.