చితక్కొడుతున్న మహిళలు : హోలీ ఇలా కూడా | Lathmar Holi 2021:Hundreds Of Men Women Play  | Sakshi
Sakshi News home page

చితక్కొడుతున్న మహిళలు : హోలీ ఇలా కూడా

Published Wed, Mar 24 2021 11:38 AM | Last Updated on Wed, Mar 24 2021 2:03 PM

Lathmar Holi 2021:Hundreds Of Men Women Play  - Sakshi

సాక్షి,లక్నో : ఉత్తరప్రదేశ్‌లో రంగుల పండుగ హోలీ సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. ఒకవైపు దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి  పంజా విసురుతున్న తరుణంలో  యూపీ మథుర జిల్లాలో హోళీ సంబరాలు అట్టహాసంగా కొనసాగుతున్నాయి.  ఈ  క్రమంలో లడ్డూమార్‌ హోలీ సంబరాలకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేసింది. కరోనా మార్గనిర్దేశనాలను పాటించకుండా వేలాదిమంది ఈ సంబరాల్లో సందడి చేయడం వివాదం  రేపింది. అయితే తాజాగా లాఠ్‌మార్‌ హోలీ సంబరాలు వార్తల్లో నిలిచాయి.. రంగులు జల్లుకుంటూ ఆడుకోవడంతోపాటు ఆడవారు మగవారిని కర్రలతో కొట్టడం ఈ లాఠీమార్‌ హోలీ ప్రత్యేకత. ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించిన వీడియో  నెట్టింట చక్కర్లుకొడుతోంది.  

దేశవ్యాప్తంగా మార్చి 29న హోలీ వేడుక జరుపుకోనుండగా యూపీలో మధుర-బృందావన్-బర్సానాలో వారం ముందుగానే ఈ సంబరం ప్రారంభమవుతుంది. ప్రపంచ ప్రఖ్యాత లాఠీమార్‌ హోలీ మంగళవారం నిర్వహించారు. రెండు రోజులపాటు ఈ వేడుకను నిర్వహిస్తారు. మంగళవారం బర్సానాలో నిర్వహించగా, బుధవారం బర్సానా, నందగావ్‌లో హోలీ ఆడనున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఈ సంప్రదాయం శతాబ్దాలుగా కొనసాగుతోంది. శ్రీకృష్ణుడు గోపికలతో హోలీ ఆడుతుండగా, ప్రతిగా రాధ తదితరులు కృష్ణుడ్ని లాఠీలతోనూ, కర్రలతోనూ కొడతారట. ఈ లాఠీమార్‌  దాడినుంచి తప్పించుకునేందుకు  పురుషులు కవచాలను కూడా ధరిస్తారట. 

మరోవైపు ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీ కమెంట్లతో సందడి చేస్తున్నారు. కరోనా విస్తరిస్తోంటే...కనీస  జాగ్రత్తలు పాటించడంలేదుని, మాస్క్‌లు పెట్టుకోకుండా, భౌతిక దూరం పాటించడం లేదంటూ మరికొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement