
హోలీ వేడుకల్లో సోనియా, రాహుల్
న్యూ ఢిల్లీ: ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రజలు గురువారం హోలీ పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. ఢిల్లీలో పలువురు రాజకీయ ప్రముఖులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ.. ఏఐసీసీ కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తల నడుమ ఉత్సాహంగా హోలీ వేడుకల్లో పాల్గొన్నారు.
కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, సాదుగురు జగ్గీ వాసుదేవ్ హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. మరో కేంద్రమంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ ఆయన నివాసంతో హోలీ వేడుకలను ఘనంగా నిర్వహించారు.