సాక్షి, నిజామాబాద్: నిజామాబాద్‌లో ఏర్పాటు చేసిన బీజేపీ ఎన్నికల ప్రచారంలో అపశ్రుతి చోటుచేసుకుంది. ఈ బహిరంగ సభలో బీజేపీ సీనియర్ నేత, కేంద్రం హోంశాఖ మంత్రి రాజనాథ్ సింగ్ పాల్గొనగా.. పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యారు. భారీస్థాయిలో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణం వద్ద షార్ట్ సర్క్యూట్ జరగి ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే, స్వల్పంగా వ్యాపించిన మంటలను అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఆర్పివేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని అధికారులు తెలిపారు. కేంద్ర హోంశాఖ సిబ్బంది నగర కమిషనర్ కార్తికేయను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment