ప్రసంగాలతో సరి..
మచిలీపట్నం(కోనేరుసెంటర్) : భూసమీకరణ నోటిఫికేషన్‌పై బాధిత రైతులకు అవగాహన కల్పించేందుకు టీడీపీ నాయకులు ఆదివారం నిర్వహించిన సదస్సు సర్వత్రా విమర్శలకు దారి తీసింది. సదస్సుకు రాజధాని నుంచి వచ్చిన రైతులు తమ ప్రసంగాల్లో పదేపదే చంద్రబాబునాయుడు పేరుతో పాటు తాడికొండ శాసనసభ్యుడు శ్రావణ్‌కుమార్‌తో పాటు ముఖ్యమంత్రి పేరును జపించటంతో రైతుల్లో తీవ్ర ఆగ్రహానికి గురి చేసింది.
సదస్సు రైతులకా – కమిటీలకా
భూసమీకరణపై అవగాహన కలిగించేందుకు నిర్వహించిన సదస్సుకు రైతుల నుంచి స్పందన కనిపించలేదు. సుమారు 500 మంది హాజరుకాగా అందులో భూములు ఇచ్చేందుకు రైతులను ఒప్పించేందుకు ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులే అధికంగా ఉన్నారు.
ఆగ్రహంతో వెనుదిరిగిన రైతులు..
ఈ సదస్సుకు బాధిత గ్రామాల నుంచి పదుల సంఖ్యలో హాజరైన రైతులకు చివరికి నిరాశే మిగిలింది. సదస్సులో ఒకరిద్దరు రైతులు మైకులో మాట్లాడేందుకు ప్రయత్నించగా నాయకులు మైకులు ఆపేసి దగ్గరకు పిలిపించుకుని సమా«ధానం చేప్పే ప్రయత్నం చేశారు.