general assembly sessions
-
తొలుత ఉత్సాహం.. తర్వాత పరస్పర ఆరోపణలు
ఐక్యరాజ్యసమితి : ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాలు అంతర్జాతీయ సహకారం, కోవిడ్ మహమ్మారిపై ఐక్యపోరాటం లాంటి విషయాలతో ఉత్సాహంగా ప్రారంభమై, చివరకు ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలతో ముగిశాయి. ప్రస్తుతం ప్రపంచంలో ఆరోగ్య సంక్షోభం, ఆర్థిక సంక్షోభం, మానవహక్కుల ఉల్లంఘన, తాజాగా అమెరికా చైనాల మధ్య రగులుతోన్న ప్రచ్ఛన్న యుద్ధం ఆందోళన కలిగిస్తున్నాయని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటేరస్, సమితి సమాశాల ప్రారంభోపన్యాసంలో అన్నారు. కరోనా మహమ్మారిపై ఐక్యంగా పోరాడాల్సిన ఆవశ్యకతను వివిధ దేశాధినేతలు నొక్కివక్కాణించారు. ఐక్యరాజ్య సమితి సభ్యదేశాల్లో అధిక భాగం బహుళ సహకారం గురించి, దాని ఆవశ్యకతను, సవాళ్ళను ప్రస్తావించాయి. ఆర్మేనియా, అజర్బైజాన్ దేశాల మధ్య తాజాగా తలెత్తిన యుద్ధంపై ఇరుదేశాల దౌత్య వేత్తలు పరస్పరం కత్తులు దూసుకున్నారు. (మోదీపై డబ్ల్యూహెచ్‌వో చీఫ్ ప్రశంసలు) బాంగ్లాదేశ్‌కి వచ్చిన ఏడు లక్షల మంది రోహింగ్యా ముస్లింల సమస్యపై మయన్మార్‌ని, బాంగ్లాదేశ్ నిలదీసింది. రెండు అణుబాంబులకు సరిపోయిన యురేనియం నిల్వలను ఇటీవలి మాసాల్లో ఇరాన్ పోగేసుకుందని ఇజ్రాయిల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహో చేసిన ఉపన్యాసంపై ఇరాన్ మండిపడింది. మధ్య ప్రాచ్యంలో ఇజ్రాయిల్, దుందుడుకుగా వ్యవహరిస్తోందని, పాలస్తీనా విషయంలో ఐక్యరాజ్యసమితి తీర్మానాలను ధిక్కరిస్తున్నదని ఇరాన్ దౌత్యాధికారి మండిపడ్డారు. ఎమెన్ దేశంలో, హౌతీ షిౖయెట్ తిరుగుబాటుదారులకు ఇరాన్ సహకరిస్తోందని, అస్థిర పరిస్థితులు సృష్టిస్తోందని యూఏఈ మండిపడింది. కరోనా మహమ్మారి విషయంపై రష్యా, చైనాని సమర్థించింది. అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. చైనా సార్వభౌమాధికారం, సమగ్రత విషయాల్లో, తైవాన్‌ని వెనకేసుకొస్తూ అమెరికా జోక్యం చేసుకుంటోందని, చైనా ఆరోపించింది. (సోనూసూద్‌కి ఐరాస అవార్డ్) -
ఐక్యరాజ్యసమితిలో సెప్టెంబర్‌లో మోదీ ప్రసంగం
ఐక్యరాజ్యసమితి: ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ సమావేశాల్లో భారత ప్రధాని మోదీ మరోసారి ప్రసంగిం చనున్నారు. ఐక్యరాజ్యసమితి 74వ వార్షిక జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సెప్టెంబర్ 28వ తేదీ ఉదయం ప్రధాని మోదీ ప్రసంగం ఉండనుంది. ఈ సమావేశాల్లో పాల్గొని ప్రసంగించే ప్రపంచ దేశాధినేతల షెడ్యూల్‌ను యూఎన్ గురు వారం ప్రకటించింది. దీని ప్రకారం సెప్టెం బర్ 24 నుంచి 30 వరకు సాధారణ అసెం బ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమా వేశాల కోసం 112 దేశాల అధ్యక్షులు, 48 మంది ప్రభుత్వాధినేతలు, 30 మంది విదేశాంగ శాఖ మంత్రులు న్యూయార్క్ చేరుకోనున్నారు. ఈ పర్యటన లోనే మోదీ మరికొన్ని ఉన్నత స్థాయి సదస్సులకు హాజరు కానున్నారు. మోదీ మొదటిసారి 2014లో ఐరాసలో ప్రసంగించారు. -
బగ్గింగ్ భయంతో ఒబామా.. యాదృచ్ఛికంగా మోదీ!
లొకేషన్: ది వాల్డార్ఫ్ అస్టోరియా ఫైవ్ స్టార్ లగ్జరీ హోటల్, 301 పార్క్ అవెన్యూ, మాన్‌హట్టన్, న్యూయార్క్ సిటీ అకేషన్: ఐక్యరాజ్యసమితి 70వ వార్షిక సమావేశానికి హాజరుకానున్న దేశాధినేతలకు విడిది ఏర్పాటయింది ఆ హోటల్ లోనే. గడిచిన కొన్ని దశాబ్దాలుగా అది సంప్రదాయంగా కొనసాగుతుంది. అడ్మిరేషన్: చాన్నాళ్లు కాల్పులతో, అప్పుడప్పుడూ నోటితో మాట్లాడుకునే భారత్- పాకిస్థాన్ దేశాధినేతలు నరేంద్ర మోదీ, నవాజ్ షరీఫ్ ఒకే చోట బసచేస్తున్నారు. ద్వైపాక్షిక చర్చలు లేనప్పటికీ రెండు కార్యక్రమాల్లో కలిసి పాల్గొంటారు. ఇటీవలే ఎన్ఎస్ఏ స్థాయి చర్చలు రద్దయిన నేపథ్యంలో ఈ ఇద్దరూ ఎదురుపడితే.. సహజంగానే పలకరించుకుని ఆలింగనాలు చేసుకుంటారా? లేదా.. సెన్సేషన్: తరతరాల సాంప్రదాయానికి బరాక్ ఒబామా మంగళం పాడారు. ఏటా సెప్టెంబర్ లో జరిగే ఐరాస సాధారణ సమావేశాల్లో పాల్గొనేందుకు భార్యాపిల్లలు, అధికారగణంతో పాటు వాల్డార్ఫ్ అస్టోరియాలో దిగిపోవటం అమెరికా అధ్యక్షుల ఆనవాయితీ. ఇప్పుడు మాత్రం ఆ హోటల్ లో బస చేసేందుకు ససేమిరా అంటున్నారు ఒబామా! అప్రెహెన్షన్: ఇంటర్నేషనల్ బిడ్డింగ్ ద్వారా 2014లో వాల్డర్ఫ్ అస్టోరియా హోటల్ ను చైనాకు చెందిన ఓ కంపెనీ కొనుగోలు చేసింది. గతంలో ఒకసారి అమెరికా అధ్యక్ష భవనమైన వైట్ హౌస్ నుంచి దేశ రక్షణ విభాగానికి సంబంధించిన సమాచారాన్ని చైనా సైబర్ నేరగాళ్లు తస్కరించారు. ఈ రెండు చర్యల్నీ బేరీజు వేసుకుంటే.. తమ ఆధీనంలోలేని హోటల్ లో ఏ మూలలో ఏ నిఘా ఉంటుందో.. అక్కడ మాట్లాడేవి ఎక్కడెక్కడి వినిపిస్తాయోనన్న సందేహంతో ఏకంగా ఆ హోటల్ లో ఉండొద్దనే నిర్ణయానికి వచ్చారు ఒబామా. కంటిన్యూషన్: ఇలా అనూహ్య పరిణామాల నడుమ సెప్టెంబర్ 25 నుంచి ఐరాస సర్వసభ్య సమావేశం ప్రారంభం కానుంది. తొలిసారి అమెరికాకు వచ్చిన పోప్ ఫ్రాన్సిస్ జనరల్ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగిస్తారు. అదేరోజు అడాప్షన్ ఆఫ్ ది పోస్ట్- 2015 డెవలప్ మెంట్ సమ్మిట్ జరగనుంది. సెప్టెంబర్ 6 వరకు సమావేశాలు కొనసాగుతాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ 23 ఉదయం ఐర్లాండ్ చేరుకుంటారు. చర్చల అనంతరం అదేరోజు రాత్రి అమెరికాకు బయలుదేరుతారు. మొత్తానికి నరేంద్ర మోదీ న్యూయార్క్ నగరంలోని వాల్డార్ఫ్ అస్టోరియా హోటల్ కు బుధవారమే చేరుకుంటారని విదేశాంగ శాఖ పేర్కొంది. రెండు రోజుల తర్వాత అంటే శుక్రవారం (25న) ఇస్లామాబాద్ నుంచి వచ్చే పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్.. అదే హోటల్ లో దిగుతారు. డెవలప్మెంట్ సమిట్ (శుక్రవారం 25)లో ఒకసారి, శాంతి పరిరక్షణపై ఏర్పాటయిన సమావేశం (సోమవారం, 28)లో మరోసారి మోదీ, షరీఫ్ లు కలిసి పాల్గొంటారు. అధికారికంగా కలుసుకునే అవకాశాలేవీ లేవు. ఒకే హోటల్లో ఉంటున్నారు కాబట్టి ఏదోఒక సందర్భంలోనైనా వీరిద్దరూ ఎదురు పడకపోరా.. అప్పుడు ఎలా స్పందిస్తారు.. పలకరించుకుంటారా.. చిర్రుబుర్రులాడతారా.. అనే సందేహాలు అమెరికా మీడియాలొ చక్కర్లు కొడుతున్నాయి. పాక్ జాతీయ భద్రతా సలహాదారు సర్తార్ అజీజ్ మాత్రం 'భారత్ చర్చలకు సిద్ధమైతే మేమూ సిద్ధమే' అని ప్రకటించేశారు. ఏం జరుగుతుందో చూడాలి..