ఐక్యరాజ్యసమితి: డ్రాగన్ దేశం చైనా మరోసారి తన దుష్టబుద్ధిని చాటుకుంది. పాక్‌కు చెందిన లష్కరే తోయిబా సభ్యుడు, 26/11 ముంబై ఉగ్ర దాడుల్లో పాల్గొన్న సాజిద్ మీర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా పరిగణిస్తూ ఐరాస బ్లాక్‌లిస్టులో చేర్చాలంటూ భారత్, అమెరికా ప్రతిపాదించగా చైనా మంగళవారం అడ్డుకుంది.
అయితే, భద్రతా మండలికి సంబంధించిన ‘1267 అల్‌ఖైదా శాంక్షన్స్ కమిటీ’ ప్రకారం సాజిద్ మీర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని, అతడి ఆస్తులను స్తంభింపజేయాలని, ప్రయాణ నిషేధం విధించాలని భారత్, అమెరికా ప్రతిపాదించాయి. ఈ ప్రతిపాదన ఆమోదం పొందకుండా చైనా అడ్డుపడింది. సాజిద్ మీర్ భారత్‌లో మోస్ట్ వాంటెడ్ జాబితాలో కొనసాగుతున్నాడు. అతడి తలపై అమెరికా ప్రభుత్వం 5 మిలియన్ డాలర్ల బహుమానం ప్రకటించింది. సాజిద్ మీర్ గతంలోనే చనిపోయాడని పాకిస్తాన్ ప్రభుత్వం వాదిస్తోంది.
ఇది కూడా చదవండి: నేను మోదీ అభిమానిని.. భారత్‌కు ఆయన సరైందే చేస్తున్నారు: మస్క్
Comments
Please login to add a commentAdd a comment