భాషతో సంబంధం లేదు. మన మనసులోని భావాల్ని, భావోద్వేగాల్ని ఇట్టే చెప్పేస్తాయి. చిన్న చిన్న బొమ్మలే విశ్వవ్యాప్త భాషగా అవతరించి డిజిటల్ కమ్యూనికేషన్ వ్యవస్థను విప్లవాత్మకం చేశాయి. అలిగినా, సిగ్గుపడినా, బుంగమూతి పెట్టినా, నవ్వొచ్చినా, వెక్కిరించినా కోపం వచ్చినా, మనం ఎక్కడ, ఎలా ఉన్నా అవతలివాళ్లకి చెప్పాలంటే పిల్లల్ని నుంచి పెద్దల దాకా ఒకే ఒక్క సింగిల్ క్లిక్ ఎమోజీ. రోజుకు కొన్ని వందల కోట్ లఎమోజీలు షేర్ అవుతాయి. అంత పాపులర్ ఎమోజీ. ఈ రోజు ప్రపంచ ఎమోజి దినోత్సవం సందర్బంగా కొన్ని ఆసక్తికర విషయాలు.
ప్రస్తుత టెక్ యుగంలో మెసేజ్‌లు, ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్ , ఫేస్‌బుక్ , ముఖ్యంగా వాట్సాప్ దాకా సోషల్ మీడియాలో ఎమోజీ లేనిదే రోజు గడవదు. సంతోషం, ప్రేమ, అసూయ, బాధ, కోపం, ఆఖరికి జలుబు, జ్వరం ఇలా ఏదైనా సరే ఒక్క ఎమోజీతో చెప్పేయొచ్చు.
ప్రతి ఏడాది జూలై 17న ప్రపంచ ఎమోజీడేని జరుపుకొంటాము. ప్రపంచ ఎమోజి దినోత్సవాన్ని 2014లో ఎమోజిపీడియా వ్యవస్థాపకుడు జెరెమీ బర్గ్ రూపొందించారు. 2002లో Apple Mac కోసం iCalను ప్రవేశపెట్టిన రోజును సూచిస్తూ iOSలోని క్యాలెండర్ ఎమోజి ఈ తేదీని ప్రదర్శిస్తున్నందున జూలై 17ని ఎంచుకున్నారట. అలాగే జపాన్ మొబైల్ ఆపరేటింగ్ సంస్థ ‘ఎన్‌టీటీ డొకామో’లో పనిచేసిన షిగెటకా కురిటా అనే ఇంజినీర్ వీటిని రూపొందించాడని చెబుతుంటారు.షిగెటకా కురిటా 1990లలో "ఎమోజి" అనే పదాన్ని ఉపయోగించారట. "ఎమోజి" అనేది జపనీస్ ఇడియమ్.
మరోవైపు ఎమోజీని అమెరికా 16వ అధ‍్యక్షుడు అబ్రహం లింకన్ ప్రసంగంతో వెలుగులోకి వచ్చిందనే మరో కథనం కూడా. 1862లో లింకన్ తన ప్రసంగంలో పెట్టిన వివిధ రకాల హావ భావాలు బాగా ఆకట్టు కున్నాయి. ముఖ్యంగా కన్నుగీటేది బాగా పాపులర్ అయ్యింది. అలా ఈ ఎమోజీలు వెలుగులోకి వచ్చాయని చరిత్రకారులు చెబుతున్న మాట.
Comments
Please login to add a commentAdd a comment