Texas Woman Being Attacked By Snake And Hawk At The Same Time - Sakshi
Sakshi News home page

గడ్డి కోస్తుండగా ఆకాశం నుంచి పాము..దాన్ని అటాక్‌ చేస్తూ గద్ద..రెండూ..

Published Thu, Aug 10 2023 3:57 PM | Last Updated on Thu, Aug 10 2023 4:22 PM

Texas Woman Attacked By Snake And Hawk At The Same Time  - Sakshi

ఇలాంటి సంకట స్థితి ఎవ్వరకి రాకూడదూ. తలచుకుంటేనే అమ్మ బాబోయే అనిపిస్తుంది. ఆ క్షణంలో ఎవ్వరున్నా.. గుండె ఆగిపోవడం ఖాయం. అలాటి దారుణమైన ఘటన టెక్సాస్‌లో చోట చేసుకుంది.

వివరాల్లోకెళ్తే...టెక్సాస​్‌లో ఓ మహిళ ఎంత దారుణమైన ఆపదలో చిక్కుకుందంటే.. పగవాడికి కూడా వద్దురా బాబు ఇలాంటి ఆపద అనిపిస్తుంది. టెక్సాస్‌లోని బ్యూమాంట్‌ సమీపంలో సిల్స్‌బీకి చెందిన పెగ్గీ జోన్స్‌ అనే మహిళ తోటపని చేస్తోంది. ఇంతలో హఠాత్తుగా ఓ పాము ఆకాశం నుంచి పెగ్గీ జోన్స్‌పై పడింది. ఆ పాము ఒక్కసారిగా పెగ్గీ చేతిని గట్టిగా చుట్టుకుంది. ఆ తర్వాత దాన్ని తరుముకుంటూ ఓ గద్ద కూడా అదే టైంలో...భయంతో విలవిల్లాడుతున్న ఆ మహిళ వద్దకు వచ్చింది. దీంతో ఆ రెండు ఒకేసారి ఆమెపై దారుణంగా దాడి చేస్తున్నాయి.

పాము కోసం గద్ద..గద్ద నుంచి తప్పించకునే క్రమంలో పాము..ఇలా రెండు ఒకేసారి పెగ్గి చేతిపై దాడి చేస్తున్నాయి. భయంతో ఒక్కసారిగా పెగ్గీ కేకలు వేస్తూ ఉంది. ఇంతలో భర్త పరిగెత్తుకుంటూ వచ్చి కాపాడి ఆమెను హుటాహుటినా ఆస్పత్రికి తరలించాడు. పెగ్గీ చేతికి దారుణంగా గాయలవ్వడంతో వైద్యులు సత్వరమే చికిత్స అందించారు. దీంతో నెమ్మదిగా కోలుకోవడం ప్రారంభించింది.

పాము కాటేసిందనుకున్నా..
ఆ రెండింటి దాడిలో పెగ్గి చేతి గాయమవ్వడమే గాక పాము విషం  ఆమె కంటి అద్దాలపై పడటంతో.. కొద్దిపాటులో సేఫ్‌గా బయటపడింది. అయితే పెగ్గీ మాత్రం పాము తనని కాటువేసిందనుకుంది గానీ నిజానికి ఆమె పాము కాటుకి గురికాలేదు. కాకపోతే గద్ద, పాము పొట్లాటలో ఆమెకు గాయాలయ్యాయి. సమయానికి ఆమె భర్త రావడంతో త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడగలిగింది. ఈ క్రమంలో పెగ్గీ మాట్లాడుతూ..ఇంతకుమునుపు కూడా పాము కాటుకి గురయ్యి.. బయటపడ్డ. మరోసారి ఈ భయానక ఆపద నుంచి సేఫ్‌గా బయటపడటంతో తాను చాలా లక్కీ అని మురిసిపోతోంది పెగ్గీ. 

(చదవండి: ఆ దేశం పీతలను నిర్మూలించడానికి ఏకంగా రూ. 26 కోట్లు..!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement