hawker
-
గడ్డి కోస్తుండగా ఆకాశం నుంచి పాము..దాన్ని అటాక్ చేస్తూ గద్ద..రెండూ..
ఇలాంటి సంకట స్థితి ఎవ్వరకి రాకూడదూ. తలచుకుంటేనే అమ్మ బాబోయే అనిపిస్తుంది. ఆ క్షణంలో ఎవ్వరున్నా.. గుండె ఆగిపోవడం ఖాయం. అలాటి దారుణమైన ఘటన టెక్సాస్‌లో చోట చేసుకుంది. వివరాల్లోకెళ్తే...టెక్సాస్‌లో ఓ మహిళ ఎంత దారుణమైన ఆపదలో చిక్కుకుందంటే.. పగవాడికి కూడా వద్దురా బాబు ఇలాంటి ఆపద అనిపిస్తుంది. టెక్సాస్‌లోని బ్యూమాంట్ సమీపంలో సిల్స్బీకి చెందిన పెగ్గీ జోన్స్ అనే మహిళ తోటపని చేస్తోంది. ఇంతలో హఠాత్తుగా ఓ పాము ఆకాశం నుంచి పెగ్గీ జోన్స్‌పై పడింది. ఆ పాము ఒక్కసారిగా పెగ్గీ చేతిని గట్టిగా చుట్టుకుంది. ఆ తర్వాత దాన్ని తరుముకుంటూ ఓ గద్ద కూడా అదే టైంలో...భయంతో విలవిల్లాడుతున్న ఆ మహిళ వద్దకు వచ్చింది. దీంతో ఆ రెండు ఒకేసారి ఆమెపై దారుణంగా దాడి చేస్తున్నాయి. పాము కోసం గద్ద..గద్ద నుంచి తప్పించకునే క్రమంలో పాము..ఇలా రెండు ఒకేసారి పెగ్గి చేతిపై దాడి చేస్తున్నాయి. భయంతో ఒక్కసారిగా పెగ్గీ కేకలు వేస్తూ ఉంది. ఇంతలో భర్త పరిగెత్తుకుంటూ వచ్చి కాపాడి ఆమెను హుటాహుటినా ఆస్పత్రికి తరలించాడు. పెగ్గీ చేతికి దారుణంగా గాయలవ్వడంతో వైద్యులు సత్వరమే చికిత్స అందించారు. దీంతో నెమ్మదిగా కోలుకోవడం ప్రారంభించింది. పాము కాటేసిందనుకున్నా.. ఆ రెండింటి దాడిలో పెగ్గి చేతి గాయమవ్వడమే గాక పాము విషం ఆమె కంటి అద్దాలపై పడటంతో.. కొద్దిపాటులో సేఫ్‌గా బయటపడింది. అయితే పెగ్గీ మాత్రం పాము తనని కాటువేసిందనుకుంది గానీ నిజానికి ఆమె పాము కాటుకి గురికాలేదు. కాకపోతే గద్ద, పాము పొట్లాటలో ఆమెకు గాయాలయ్యాయి. సమయానికి ఆమె భర్త రావడంతో త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడగలిగింది. ఈ క్రమంలో పెగ్గీ మాట్లాడుతూ..ఇంతకుమునుపు కూడా పాము కాటుకి గురయ్యి.. బయటపడ్డ. మరోసారి ఈ భయానక ఆపద నుంచి సేఫ్‌గా బయటపడటంతో తాను చాలా లక్కీ అని మురిసిపోతోంది పెగ్గీ. (చదవండి: ఆ దేశం పీతలను నిర్మూలించడానికి ఏకంగా రూ. 26 కోట్లు..!) -
జర్నలిస్టుపై దాడి, నోట్లో మూత్రం పోసి : వీడియో వైరల్
ఉత్తరప్రదేశ్‌లో జర్నలిస్టులపై ఆగడాలకు సంబంధించిన మరో దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ అధికారి ఓ పాత్రికేయుడిపై అమానుషంగా దాడి చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రైలులో అనధికారిక వ్యాపారుల (హాకర్స్) పై కథనాన్ని ప్రచురించినందుకు గాను రైల్వే పోలీసు ఇన్స్పెక్టర్ రాకేష్ కుమార్ జర్నలిస్టు అమిత్‌శర్మపై దాడి చేసి తీవ్రంగా కొడుతున్న దృశ్యాలు ఈ వీడియోలో రికార్డయ్యాయి. దీంతో పలు విమర్శలు వెల్లువెత్తాయి. తనను దారుణంగా కొట్టి, కెమెరాను ధ్వంసం చేశారని జర్నలిస్టు వాపోయారు. అంతేకాదు లాకప్‌లో వేసి బట్టూడదీసి, నోటిలో మూత్రం పోసారని ఆరోపించారు. మరోవైపు ఈ ఘటనకు సంబంధించిన వీడియో విరివిగా షేర్ అవుతూ వైరల్ కావడంతో రైల్వే అధికారులు స్పందించారు. ఈ ఘటనకు బాధ్యుడైన అధికారి రాకేష్‌కుమార్‌తోపాటు మరో రైల్వే కానిస్టేబుల్ సునీల్ కుమార్‌ను అధికారులు సస్పెండ్ చేశారు. Journalist thrashed by GRP personnel in Shamli case: Rakesh Kumar, Station House Officer (SHO), Government Railway Police (GRP) & constable Sunil Kumar, have been suspended https://t.co/i8OO17FKyl — ANI UP (@ANINewsUP) June 12, 2019 -
ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర హీరోయిన్ను చూసి..!
అతను మామూలు హాకర్. పుస్తకాలు చేతిలో పట్టుకొని.. ముంబై ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగిన వాహనాలు చుట్టూ తిరుగుతూ అమ్ముతాడు. ఇది అతడు నిత్యం చేసే పని. కానీ, ఇటీవల అతనికి ఓ అరుదైన అనుభవం ఎదురైంది. ఆగిన ఓ కారు వద్దకు పరిగెత్తి.. శిల్పాశెట్టి రాసిన ‘ద గ్రేట్ ఇండియన్ డైట్’ పుస్తకాన్ని ఆ కారులోని వ్యక్తులకు అమ్మాలని ప్రయత్నించాడు. కానీ అతన్ని విస్మయంలో ముంచెత్తుతూ ఆ కారులో ఏకంగా శిల్పాశెట్టి కనిపించింది. ఆ జలతారు వీణను చూసి అతను ఆనందంతో పొంగిపోయాడు. ఈ ఘటన గురించి తాజాగా యోగా సుందరి శిల్పాశెట్టీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో వివరించింది. ముంబై ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఈ వ్యక్తి తన పుస్తకాన్ని తనకే అమ్మేందుకు ప్రయత్నించాడని, కారులోని తనను అతన్ని చూడగానే.. అమూల్యమైన ఆనందం అతనిలో వ్యక్తమైందని శిల్పా వివరించింది. ఆనందంతో ఉప్పొంగిన ఆ హాకర్ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. అభిమానుల హృదయాలను తాకిన ఈ పోస్టుకు అప్పుడే 31వేలకుపైగా లైకులు వచ్చాయి. తెలుగులో ‘సాహస వీరుడు.. సాగర కన్య’ వంటి సినిమాలతో ఈ జలతారు వీణ అలరించిన సంగతి తెలిసిందే. -
రైల్వే స్టేషన్లో హాకర్ ఆర్తనాదం
రైలుకింద పడడంతో తెగిపడిన కుడి కాలు ఆ కాలితోనే ప్లాట్‌ఫాంపై అరగంట నరకయాతన కరీమాబాద్ : రైళ్లలో చాయ్, బిస్కట్లు, వాటర్‌బాటిళ్లు అమ్ముకునే హాకర్ అదే రైలు కింద ప్రమాదవశాత్తు పడి కాలు పోగొట్టుకున్న సంఘటన మంగళవారం ఉదయం వరంగల్ రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ఫామ్ -2లో జరిగింది. స్టేషన్‌లోని ప్రయాణికులు, వరంగల్ జీఆర్పీ ఎస్సై ఎస్. శ్రీనివాస్ కథనం ప్రకారం.. మెదక్ జిల్లా సిద్ధిపేట మండలం రావురూపుల గ్రామానికి చెందిన బాగి కనకరాజు(30) రైలులోని మొబైల్ ప్యాంట్రీ కార్లో హాకర్‌గా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం వరంగల్ నగరంలోని శివనగర్‌లో కిరాయి ఇంట్లో ఉంటున్నాడు. ఈ క్రమంలో అతడు మంగళవారం ఉదయం స్టేషన్‌లోని రెండో నంబర్ ప్లాట్ఫామ్లో తెల్లవారుజామున 6 గంటలకు విశాఖపట్నం నుంచి సికంద్రాబాద్‌కు వెళ్లే గరీబ్‌రథ్ ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు ప్లాట్‌ఫామ్‌కు రైలు పట్టాలకు మధ్య పడిపోయాడు. దీంతో అతడి కుడికాలు తెగిపడిపోయింది. గమనించిన ప్రయాణికులు, రైల్వే సిబ్బంది వెంటనే కనకరాజును పట్టాల మీది నుంచి తీసుకొచ్చి ప్లాట్‌ఫామ్ మీద గద్దెపై కూర్చోబెట్టారు. అంతేగాక తెగిపడిన కాలిని కూడా అతడి వద్ద ఉంచడంతో ఆ కాలునే అరగంట పాటు చూసుకుంటూ కారుతున్న రక్తాన్ని తన వద్ద ఉన్న గుడ్డతో తుడుచుకుంటూ దీనంగా అలాగే ఉండిపోయాడు కనకరాజు. ఈ సంఘటన ప్రయాణికుల మనసును కలచివేసింది. కేసు నమోదు చేసి, 108లో అతడిని ఎంజీఎం ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై శ్రీనివాస్ వెల్లడించారు. -
తల నరికి...ఎత్తుకుపోయాడు
కోలకతా: స్వల్పవివాదం హత్యకు దారితీసిన ఘటన పశ్చిమ బెంగాల్లో కలకలం రేపింది. వెస్ట్ మిడ్నాపూర్ జిల్లాలోని బెలపహారీలో అందరూ చూస్తుండగానే ఆదివారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. కూరగాయల వ్యాపారం చేసుకునే 30 ఏళ్ల వ్యక్తితో తగాదా పడ్డ బుద్ధేశ్వర్ పాల్ ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఒక చిన్న వివాదం కాస్తా ఇద్దరి మధ్య తీవ్ర వివాదానికి దారితీసింది. దీంతో కోపోద్రిక్తుడైన పాల్ పదునైన ఆయుధంతో కూరగాయల వ్యాపారిపై దాడిచేసి తలనరికేశాడు. తెగిపడిన తలను తీసుకుని సమీపంలోని అడవిలోకి పారిపోయాడు. దీంతో చుట్టుపక్కల వారంతా తీవ్ర భయభ్రాంతులకు లోనయ్యారు. థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తలలేని మృతదేహాన్ని (మొండాన్ని) స్వాధీనం చేసుకొని హత్యకేసు నమోదుచేశారు. నిందితుడు పాల్ కోసం గాలిస్తున్నామని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.