తల నరికి...ఎత్తుకుపోయాడు | Man beheads hawker, flees with head in Kendrapara | Sakshi
Sakshi News home page

తల నరికి...ఎత్తుకుపోయాడు

Published Mon, Jun 8 2015 12:15 PM | Last Updated on Tue, Oct 9 2018 5:39 PM

తల నరికి...ఎత్తుకుపోయాడు - Sakshi

తల నరికి...ఎత్తుకుపోయాడు

కోలకతా: స్వల్పవివాదం  హత్యకు దారితీసిన ఘటన  పశ్చిమ  బెంగాల్లో కలకలం రేపింది.  వెస్ట్ మిడ్నాపూర్ జిల్లాలోని బెలపహారీలో  అందరూ చూస్తుండగానే  ఆదివారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది.  కూరగాయల వ్యాపారం చేసుకునే 30 ఏళ్ల వ్యక్తితో తగాదా పడ్డ  బుద్ధేశ్వర్ పాల్  ఈ దారుణానికి ఒడిగట్టాడు.  ఒక చిన్న వివాదం కాస్తా ఇద్దరి మధ్య తీవ్ర  వివాదానికి దారితీసింది. దీంతో కోపోద్రిక్తుడైన పాల్ పదునైన ఆయుధంతో కూరగాయల వ్యాపారిపై దాడిచేసి  తలనరికేశాడు.

 

తెగిపడిన తలను తీసుకుని సమీపంలోని అడవిలోకి పారిపోయాడు. దీంతో చుట్టుపక్కల వారంతా తీవ్ర భయభ్రాంతులకు  లోనయ్యారు.  థానికుల సమాచారంతో  సంఘటనా  స్థలానికి చేరుకున్న పోలీసులు  తలలేని  మృతదేహాన్ని (మొండాన్ని) స్వాధీనం చేసుకొని హత్యకేసు నమోదుచేశారు.  నిందితుడు పాల్ కోసం గాలిస్తున్నామని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement