ఉత్తరప్రదేశ్‌లో జర్నలిస్టులపై ఆగడాలకు సంబంధించిన మరో దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ అధికారి ఓ పాత్రికేయుడిపై అమానుషంగా దాడి చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రైలులో అనధికారిక వ్యాపారుల (హాకర్స్) పై కథనాన్ని ప్రచురించినందుకు గాను రైల్వే పోలీసు ఇన్‌స్పెక్టర్ రాకేష్ కుమార్ జర్నలిస్టు అమిత్‌శర్మపై దాడి చేసి తీవ్రంగా కొడుతున్న దృశ్యాలు ఈ వీడియోలో రికార్డయ్యాయి. దీంతో పలు విమర‍్శలు వెల్లువెత్తాయి.
తనను దారుణంగా కొట్టి, కెమెరాను ధ్వంసం చేశారని జర్నలిస్టు వాపోయారు. అంతేకాదు లాకప్‌లో వేసి బట్టూడదీసి, నోటిలో మూత్రం పోసారని ఆరోపించారు. మరోవైపు ఈ ఘటనకు సంబంధించిన వీడియో విరివిగా షేర్ అవుతూ వైరల్ కావడంతో రైల్వే అధికారులు స్పందించారు. ఈ ఘటనకు బాధ్యుడైన అధికారి రాకేష్‌కుమార్‌తోపాటు మరో రైల్వే కానిస్టేబుల్ సునీల్ కుమార్‌ను అధికారులు సస్పెండ్ చేశారు.
Journalist thrashed by GRP personnel in Shamli case: Rakesh Kumar, Station House Officer (SHO), Government Railway Police (GRP) & constable Sunil Kumar, have been suspended https://t.co/i8OO17FKyl
— ANI UP (@ANINewsUP) June 12, 2019
Comments
Please login to add a commentAdd a comment