క్లాస్‌రూమ్‌లో బరితెగించిన విద్యార్థులు.. మహిళా టీచర్‌తో అసభ్యకర ప్రవర్తన | Students Harass Teacher In Uttar Pradesh Meerut School Video Viral | Sakshi
Sakshi News home page

వీడియో: క్లాస్‌రూమ్‌లో బరితెగించిన విద్యార్థులు.. మహిళా టీచర్‌తో అసభ్యకర ప్రవర్తన

Published Sun, Nov 27 2022 4:11 PM | Last Updated on Sun, Nov 27 2022 4:13 PM

Students Harass Teacher In Uttar Pradesh Meerut School Video Viral - Sakshi

క్లాస్‌రూమ్‌లోనే విద్యార్థులు బరితెగించి ప్రవర్తించారు. విద్యాబుద్ధులు నేర్పుతున్న మహిళా టీచర్‌నే లైంగిక వేధింపులకు గురిచేశారు. అంతటితో ఆగకుండా టీచర్‌ను అసభ్యకర వ్యాఖ్యలతో వేధిస్తూ రాక్షసానందం పొందుతూ ఈ ఘటనను వీడియో తీశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ షాకింగ్‌ ఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. 

వివరాల ప్రకారం.. మీటర్‌లోని ఓ పాఠశాలలో ముగ్గురు మైనర్‌ విద్యార్థులు అనుచితంగా ‍ప్రవర్తించారు. అయితే, అమన్, కైఫ్, అతాష్ అనే ముగ్గురు విద్యార్థులు తనను వేధిస్తున్నారని టీచర్‌ తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ చర్యలో పాల్గొన్న అమన్ సోదరి పేరును కూడా ఆమె ప్రస్తావించింది. కాగా, మొదట టీచర్‌ వారి చేష్టలను, వ్యాఖ్యలను పట్టించుకోలేదు. ఇది తప్పు, చట్టవిరుద్ధమని చెబుతూ విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పే ప్రయత్నం చేసింది. అయినప్పటికీ వారు టీచర్‌ వ్యాఖ్యలను పట్టించుకోకుండానే క్లాస్‌ రూమ్‌లో ఆమెకు ఐ లవ్‌ యూ చెబుతూ, అసభ్యకర కామెంట్స్‌ చేశారు. 

ఈ క్రమంలో సహనం కోల్పోయిన టీచర్‌.. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో, రంగంలోకి దిగిన పోలీసులు.. మైనర్‌ విద్యార్ధులపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై మీరట్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ కేశవ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. విద్యార్థులు మైనర్లు కావడంతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు వెల్లడించారు. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, వీడియోలో విద్యార్థుల వెకిలిచేష్టల కారణంగా టీచర్‌ వారి నుండి దూరంగా వెళ్తున్నట్టు కనిపించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement