అతను మామూలు హాకర్. పుస్తకాలు చేతిలో పట్టుకొని.. ముంబై ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగిన వాహనాలు చుట్టూ తిరుగుతూ అమ్ముతాడు. ఇది అతడు నిత్యం చేసే పని. కానీ, ఇటీవల అతనికి ఓ అరుదైన అనుభవం ఎదురైంది. ఆగిన ఓ కారు వద్దకు పరిగెత్తి.. శిల్పాశెట్టి రాసిన ‘ద గ్రేట్ ఇండియన్ డైట్’ పుస్తకాన్ని ఆ కారులోని వ్యక్తులకు అమ్మాలని ప్రయత్నించాడు. కానీ అతన్ని విస్మయంలో ముంచెత్తుతూ ఆ కారులో ఏకంగా శిల్పాశెట్టి కనిపించింది.
ఆ జలతారు వీణను చూసి అతను ఆనందంతో పొంగిపోయాడు. ఈ ఘటన గురించి తాజాగా యోగా సుందరి శిల్పాశెట్టీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో వివరించింది. ముంబై ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఈ వ్యక్తి తన పుస్తకాన్ని తనకే అమ్మేందుకు ప్రయత్నించాడని, కారులోని తనను అతన్ని చూడగానే.. అమూల్యమైన ఆనందం అతనిలో వ్యక్తమైందని శిల్పా వివరించింది. ఆనందంతో ఉప్పొంగిన ఆ హాకర్ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. అభిమానుల హృదయాలను తాకిన ఈ పోస్టుకు అప్పుడే 31వేలకుపైగా లైకులు వచ్చాయి. తెలుగులో ‘సాహస వీరుడు.. సాగర కన్య’ వంటి సినిమాలతో ఈ జలతారు వీణ అలరించిన సంగతి తెలిసిందే.
ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర హీరోయిన్‌ను చూసి..!
Published Sat, Oct 8 2016 3:50 PM | Last Updated on Mon, Sep 4 2017 4:40 PM
Advertisement
Advertisement