Sympathy
-
'చంద్రబాబుపై సానుభూతి కోసం టీడీపీ ప్రయత్నాలు'
ఢిల్లీ: చంద్రబాబు , లోకేష్ నిజమైన సైకోలని ఎంపీ నందిగామ సురేష్ అన్నారు. చంద్రబాబుపై సానుభూతి కోసం టీడీపీ ప్రయత్నాలు చేస్తోందని చెప్పారు. ఎవరికీ భయపడనని చెప్పే చంద్రబాబు, జైళ్లో దోమలకు భయపడతారా ? అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ప్రాణాలకు ప్రమాదం టీడీపీ నేతల నుంచే ఉందని ఎంపీ సురేష్ చురకలు అంటించారు. చంద్రబాబు లాగే వెన్నుపోటు విద్య లోకేష్ కు అబ్బినట్టుందని ఎంపీ సురేష్ దుయ్యబట్టారు. చంద్రబాబు పదవి కోసం లోకేష్ ఇలా వ్యవహరించే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. చంద్రబాబుపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్న వారి ఫోన్లు చెక్ చేయాలని సూచించారు. అసెంబ్లీలో బాలకృష్ణ చేష్టలు దారుణమన్న ఎంపీ సురేష్.. వీళ్ళు ప్రజా నాయకులా ? అని ప్రశ్నించారు. 'బాలకృష్ణ మెంటల్ అని సర్టిఫికెట్ తెచ్చుకున్నాడు. పిచ్చోళ్లకు ఎన్నికల్లో పోటీచేసే అర్హత లేదు. మెంటల్ బాలకృష్ణ పై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తాం. వారం రోజుల నుంచి ఢిల్లీలో ఉన్న లోకేష్ ఏపీకి ఎందుకు పోవడం లేదు. దొడ్డిదారిన ఎమ్మెల్సీగా గెలిచి మంత్రి పదవులు అనుభవించిన లోకేష్ దోపిడీకి పాల్పడ్డారు' అని ఎంపీ సురేష్ అన్నారు. ఇదీ చదవండి: టీడీపీ మూడు ప్రయత్నాలు.. చంద్రబాబు లూటీకి పాన్ ఇండియా ప్రచారం -
సమంత సింపతీ డ్రామా....?
-
బిగ్ క్వశ్చన్: చంద్రబాబు చావు తెలివితేటలు..!
-
సానుభూతి కోసమే చంద్రబాబు, పవన్ తాపత్రయం : వెల్లంపల్లి
-
కుప్పంలో కొత్త నాటకం.. టీడీపీ సానుభూతి డ్రామా
సాక్షి, తిరుపతి/చిత్తూరు అర్బన్: కుప్పంలో టీడీపీ కొత్త నాటకానికి తెరలేపింది. మున్సిపల్ కార్యాలయంపై ఆ పార్టీ శ్రేణులతో దాడి చేయించి వైఎస్సార్ సీపీపై బురదజల్లే ప్రయత్నం చేస్తోంది. తద్వారా సానుభూతి పొంది మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు దండుకోవాలని పన్నాగం పన్నింది. ఎంతచేసినా ఓటర్ల నుంచి స్పందన కనిపించలేదు. దీనికితోడు పార్టీలో 30 ఏళ్లుగా కీలకంగా ఉన్న ముగ్గురు నాయకులు చేసిన అవినీతి, అక్రమాలు శాపంగా మారడంతో టీడీపీ కేడర్ డీలాపడిపోయింది. చదవండి: తిరుపతిలో కుండపోత వర్షం ఆ రోజు ఏం జరిగిందంటే నామినేషన్ల ఉపసంహరణ రోజు సోమవారం రాత్రి 14వ వార్డు టీడీపీ అభ్యర్థులు ప్రకాష్, తిరుమగన్ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో వైఎస్సార్సీపీ అభ్యర్థి మునుస్వామి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఆర్వో ప్రకటించారు. ఈ క్రమంలో టీడీపీ నేతలు రంగంలోకి దిగారు. తమ అభ్యర్థి ఎవ్వరూ నామినేషన్లు ఉపసంహరించుకోలేదంటూ పథకం ప్రకారం సుమారు 150 మంది మున్సిపల్ కార్యాలయం గేట్లను తోసుకుని లోనికి వచ్చారు. అద్దాలు ధ్వంసం చేశారు. కమిషనర్‌ను నోటికి వచ్చినట్టు దూషించడంతోపాటు బెదిరింపులకు దిగారు. ‘వచ్చేది మా ప్రభుత్వం. మేం చెప్పినట్టు వినకపోతే నడిరోడ్డుపైనే నిలబెట్టి నరుకుతాం. రాష్ట్రంలో ఎక్కడ పనిచేస్తున్నా కుప్పానికి తీసుకొచ్చి రోడ్డుపై తన్నుకుంటూ పోతాం’ అంటూ హెచ్చరించారు. క్రిమినల్ కేసులు నమోదు తనపై దాడికి యత్నించిన టీడీపీ నాయకులపై కుప్పం మున్సిపల్ కమిషనర్ చిట్టిబాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కమిషనర్ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో పోలీసులు తీవ్రంగా పరిగణించారు. ఐపీసీ సెక్షన్ కింద 143, 147, 353, 427 రెడ్ విత్ 149, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించినందుకు కేసులు నమోదు చేశారు. తమకు అన్యాయం జరిగితే శాంతియుతంగా నిరసన తెలపాలని, దౌర్జన్యాలు, దాడులకు తెగపడడం తగదని హితవుపలికారు. ఎన్నికలు సజావుగా సాగాలంటే ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన టీడీపీ నేతలు కుప్పం వదలి వెళ్లాలని హెచ్చరించారు. అయినా టీడీపీ నేతలు లెక్కచేయకుండా కుప్పం హోటల్లో బసచేశారు. వారిని మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకున్న పోలీసులు చిత్తూరు, పలమనేరులో వారి నివాసాల వద్ద విడిచిపెట్టారు. వెంటాడుతున్న ఓటమి భయం మున్సిపల్ ఎన్నికలు దగ్గరపడుతుండడంతో టీడీపీకి ఓటమి భయం పట్టుకుంది. 30 ఏళ్లుగా పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, చంద్రబాబు పీఏ మనోహర్, పీఎస్ మునిరత్నం అనేక అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారు. ఈ విషయం తెలిసినా చంద్రబాబు ఏ రోజూ పట్టించుకోలేదని కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికితోడు ఓటర్లు వైఎస్సార్ సీపీ వైపు ఉన్నారని గుర్తించి తటస్తంగా ఉండిపోయారు. ప్రచారంలో పాల్గొనకుండా నివాసానికే పరిమితమయ్యారు. ఆ ఫలితాలొస్తే కుప్పంలో టీడీపీ ఖాళీ మూడు నెలల క్రితం వెలువడిన స్థానిక సంస్థల ఫలితాల్లో టీడీపీకి కంచుకోటగా చెప్పుకునే కుప్పం నియోజకవర్గాన్ని వైఎస్సార్ సీపీ బద్ధలు కొట్టింది. శాంతిపురం, గుడుపల్లె, కుప్పం, రామకుప్పం జెడ్పీటీసీలతో పాటు ఎంపీపీ స్థానాలను క్లీన్ స్వీప్ చేసింది. 68 ఎంపీటీసీ స్థానాల్లోనూ 62 కైవసం చేసుకుంది. 89 సర్పంచ్ స్థానాల్లో 74 చోట్ల విజయకేతనం ఎగురవేసింది. ఈ ఫలితాలు కుప్పంలోని టీడీపీని అథఃపాతాళానికి నెట్టేశాయి. ఈ నేపథ్యంలో తాజాగా విడులైన మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ టీడీపీ నాయకుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది. 25 వార్డుల్లో ఒక వార్డును ఏకగ్రీవం చేసుకున్న వైఎస్సార్ సీపీ మిగిలిన స్థానాల్లోనూ ఆ పార్టీ జెండాను ఎగురవేసేందుకు ప్రణాళికతో ముందుకు వెళుతోంది. మున్సిపల్ ఫలితాల్లో కుప్పం స్థానాన్ని పోగొట్టుకుంటే వచ్చే ఎన్నికల్లో చంద్రబాబునాయుడు మరో నియోజకవర్గం నుంచి పోటీ చేయాల్సిందేనని అధికార పార్టీ నాయకులు ధీమాగా చెబుతుండడం టీడీపీ నాయకులకు నిద్రపట్టనివ్వడంలేదు. డ్రామాను రక్తికట్టించే యత్నం కుప్పం ఓటర్ల నుంచి సానుభూతి పొందేందుకు టీడీపీ నానా తంటాలు పడుతోంది. ఇప్పటికే టీడీపీ శ్రేణులు కొందరు గ్రూపుగా ఏర్పడి వైఎస్సార్ సీపీపై దుష్ప్రచారం చేయడం ప్రారంభించారు. టీడీపీ అనుకూల పత్రికలు, మీడియా ద్వారా బూతద్దంలో చూపిస్తున్నా ఓటర్ల నుంచి సానుభూతి లభించలేదు. ‘‘30 ఏళ్లుగా చంద్రబాబు ఏమీ చేయలేదు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చిన రెండున్నరేళ్లలో ప్రతి కుటుంబానికీ లబ్ధికలిగించడంతో ఓటర్లు సీఎం వైఎస్ జగన్‌వైపే ఉన్నారు’’ అని గుర్తించిన టీడీపీ నాయకులు చీప్‌ట్రిక్స్ ప్లే చేయడానికి ప్రయత్నం ముమ్మరం చేశారు. టీడీపీ నేతలపై క్రిమినల్ కేసులు ఉన్నా పోలీసులు అరెస్టు చేయకుండా గౌరవంగా వారి ఇళ్ల వద్ద విడిచిపెట్టి రావడాన్ని కూడా తప్పుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. చలో కుప్పం పేరుతో మరికొంత మంది టీడీపీ గూండాలను రంగంలోకి దింపేందుకు రంగం సిద్ధం చేయడం గమనార్హం. -
మోదీకి జిన్ పింగ్ సానుభూతి సందేశం
బీజింగ్: కరోనాతో భారత్ కొట్టుమిట్టాడుతున్న నేపథ్యంలో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ భారత ప్రధాని మోదీకి సానుభూతి సందేశం పంపించారు. భారత్‌లోని కోవిడ్ పరిస్థితులు తనను ఎంతగానో బాధకు గురిచేస్తున్నాయని అందులో పేర్కొన్నారు. కరోనాతో పోరాడుతున్న భారత్‌కు అన్ని విధాలా సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. మరోవైపు చైనా విదేశాంగ మంత్రి వాంగ్ భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌కు లేఖ రాశారు. కరోనాతో పోరాడుతున్న భారత్‌కు తమ వంతు సహకారం అందిస్తామని అందులో పేర్కొన్నారు. ఏప్రిల్‌లో ఇప్పటికే 26 వేల వెంటిలేటర్లు, ఆక్సిజన్ జనరేటర్లను పంపినట్లు చెప్పారు. Chinese President #XiJinping sends a message of sympathy to Indian Prime Minister Narendra Modi @narendramodi today. — Sun Weidong (@China_Amb_India) April 30, 2021 -
రాహుల్ పాదయాత్ర.. ప్రధాని అభ్యర్థిగా ప్రియాంక
135 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ గత రెండు ఎన్నికల్లోనూ ఘోర పరాజయం పాలవడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో పడిపోయింది. గత నెలరోజులుగా నిస్తేజంగా మారిన పార్టీ శ్రేణుల్లో పార్టీ భవితవ్యంపై తీవ్రమైన ఆందోళన నెలకొంది. రాహుల్ గాంధీ అధ్యక్షుడిగా కొనసాగనని తేల్చి చెప్పేయడం, ఆయన స్థానంలో ఎవరు వస్తారోనన్న గందరగోళం, వివిధ రాష్ట్రాల్లో పార్టీ పదవులకు సీనియర్ నేతల మూకుమ్మడి రాజీనామాలు ఇవన్నీ ఓ రకమైన సంక్షోభానికి దారి తీస్తున్నాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్తలు దశలవారీగా పరిస్థితిని చక్కదిద్దడానికి రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. వీరి ముందు ఇప్పుడు మూడు ఎజెండాలే ఉన్నాయి. అవే కాంగ్రెస్ జెండాని తిరిగి ఎగురవేస్తాయన్న నమ్మకంతో కాంగ్రెస్ పెద్దలు ఉన్నారు. రాహుల్ పాదయాత్ర ఏసీ గదుల్లో పార్టీ నేతలు, కార్యకర్తలతో ఎన్నాళ్లు మేధోమథనం జరిపినా ప్రయోజనం శూన్యమని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారు. జనంలోకి వెళ్లిన వాడే నాయకుడిగా అవతరిస్తాడని, ప్రజా సమస్యలు కళ్లారా చూసినప్పుడే రాజకీయ వ్యూహాలు సరిగ్గా అమలు చేయగలరని చరిత్ర నిరూపిస్తున్న సత్యం. అందుకే రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా పాదయాత్ర చేస్తే బాగుంటుందని ప్రతిపాదనలు ఉన్నట్టు కాంగ్రెస్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అయితే రాహుల్ ఎంతవరకు జయప్రకాశ్ నారాయణ, వీపీ సింగ్, చంద్రశేఖర్ మాదిరిగా అనుకున్న లక్ష్యాలకు చేరుకోగలరా అన్న అనుమానాలూ ఉన్నాయి. కొత్త అధ్యక్షుడి ఎన్నిక ఇక రాహుల్ గాంధీ స్థానంలో అధ్యక్షుడిగా ఎవరిని ఎన్నిక చేయాలన్నది అతి పెద్ద సమస్య. ఇప్పుడు అందరి కళ్లు రాజస్థాన్పైనే ఉన్నాయి. ఇన్నాళూ అశోక్ గహ్లోత్æ కాంగ్రెస్ పార్టీ కాబోయే అధ్యక్షుడని ప్రచారం సాగింది. ఇప్పుడు హఠాత్తుగా సచిన్ పైలెట్ పేరు తెరపైకి వచ్చింది. వీరిద్దరిలో ఎవరికీ అప్పగించినా పార్టీ భవిష్యత్ ఎలా ఉండబోతుంది? ఎన్ని అసమ్మతి జ్వాలలు రేగుతాయన్న ఆందోళనలు ఉన్నాయి. పార్టీ పగ్గాలను అనుభవజ్ఞుడికి అప్పగించాలా, యువతరం చేతుల్లో పెట్టాలా అనే అంశంపై పార్టీలో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అధ్యక్షుడి తగాదాను రాహుల్ ఎంతవరకు సమర్థవంతగా ఎదుర్కోగలరో చెప్పలేని స్థితి. తమిళ కాంగ్రెస్ నాయకుడు కామరాజ్ ఫార్ములా తరహాలో రాహుల్ గాంధీ మూకుమ్మడి రాజీనామాలు చేయించాలని తలపోసినా అది కూడా సరిగ్గా నడిచేటట్టుగా అనిపించడం లేదు. మే 25న రాహుల్ తన పదవికి రాజీనామా చేసినా అయిదు రాష్ట్రాల కాంగ్రెస్ ముఖ్యమంత్రులు అందుకు సిద్ధంగాలేరు. అందుకే అధ్యక్షుడి విషయంలో పార్టీ ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంది. 2024 ప్రధాని ఫేస్‌గా ప్రియాంక ఇక ఆఖరి అంకం అంటే కాంగ్రెస్‌లో ఎప్పుడూ ప్రియాంకమే. 2024 ఎన్నికల్ని రాహుల్ పెద్ద దిక్కుగా ఉండి నడిపించి, ప్రియాంకను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలనే అభిప్రాయం ఉంది. ఈ అంశంలో ఏకాభిప్రాయమే వ్యక్తమవుతోంది. అయితే పెద్ద దిక్కుగా రాహుల్, కొత్త అధ్యక్షుడి పనితీరు, ప్రియాంక ఎలా జనాన్ని మెప్పించగలరు అన్న అంశాలపైనే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ ఆధారపడి ఉంది. ఈ ప్రతిపాదనలను సోనియాగాంధీ, రాహుల్ గాంధీ ఇంకా క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉందని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఘోర వైఫల్యానికి బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ చీఫ్ బాధ్యతల నుంచి తప్పుకున్న రాహుల్ గాంధీపై సానుభూతి, విశ్వాసం పెరుగుతున్నాయి. ఎన్నికల్లో పరాజయం కంటే ఈ నిస్తేజ పరిస్థితులే పార్టీకి ఎక్కువ చేటు కలిగిస్తాయని సీనియర్లతోపాటు అన్ని స్థాయిల నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితికి సోనియా, రాహుల్లదే బాధ్యతని, వారి అంగీకారం లేకుండా ప్రత్యామ్నాయ నాయకత్వ ఏర్పాటు సాధ్యం కాదని అంటున్నారు. లోలోపల ఏదో కుట్ర, డ్రామా నడుస్తోందని నేతల అనుమానం. సిసలైన నాయకుడెవరూ కూడా సంక్షోభ సమయంలో బాధ్యతల నుంచి తప్పుకోరని తెలుగు రాజ్యసభ సభ్యుడొకరు వ్యాఖ్యానించారు. రాహుల్ ముందుగా సీడబ్ల్యూసీతోపాటు రాష్ట్ర శాఖలు, ఏఐసీసీ విభాగాలను రద్దు చేసి పునర్వ్యవస్థీకరణ చేపట్టాలన్నారు. భవిష్యత్తుపై చర్చించేందుకు ముందుగా ఏఐసీసీ సమావేవం ఏర్పాటు చేసి రానున్న రాష్ట్రాల శాసనసభల ఎన్నికలపై రోడ్‌మ్యాప్ రూపొందించాలని అన్నారు. ఇలా ఉండగా, రాహుల్ గాంధీయే చీఫ్‌గా కొనసాగాలని పార్టీ కోరుకుంటోందని కాంగ్రెస్ ప్రతినిధి పవన్ ఖేరా అన్నారు. రాహుల్ వైదొలుగుతున్నట్లు ప్రకటించినందుకు నిరసనగానే పార్టీ నేతలంతా రాజీనామాలు చేస్తున్నారన్నారు. రాహుల్ పార్టీ చీఫ్‌గా కొనసాగాలని ఇప్పటికే సీడబ్ల్యూసీ తీర్మానించిందని గుర్తు చేశారు. -
విశాఖ ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, అమరావతి: విశాఖ జిల్లా చింతపల్లి మండలం బలపం పంచాయతీలోని చెరువూరు గ్రామంలో ఆదివారం జరిగిన ఆటో ప్రమాదంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విద్యుత్ స్తంభాన్ని ఆటో ఢీకొన్న ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. విశాఖ జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి సంఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు నిబంధనల ప్రకారం ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాల్సిందిగా అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. చెరువూరులో విద్యుత్ స్తంభాన్ని ఆటో ఢీకొన్న దుర్ఘటనలో ఐదుగురు సజీవ దహనమయ్యారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు చింతపల్లి ప్రమాద బాధితుల్ని జిల్లా కలెక్టర్ కాటమనేని భాస్కర్ పరామర్శించారు. లోతుగడ్డ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం ఏర్పాట్లు పర్యవేక్షించారు. -
శ్రీలంకలో 13.8 కోట్ల మంది చనిపోయారు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తప్పులో కాలేశారు. ఈస్టర్ పండుగ సందర్భంగా ఆదివారం శ్రీలంకలో చోటుచేసుకున్న మారణకాండలో ఏకంగా 138 మిలియన్ల మంది(13.80 కోట్లు) చనిపోయారని, 600కుపైగా జనం గాయపడ్డారని ట్వీట్ చేశారు. అమెరికా ప్రజల తరపున శ్రీలంక ప్రజలకు సంఘీభావం ప్రకటిస్తున్నానన్నారు. మృతులకు సానుభూతి తెలిపారు. ఈ విషాద సమయంలో లంక పౌరులకు అండగా నిలిచేందుకు, ఎలాంటి సాయం కావాలన్నా అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. శ్రీలంకలో 13.80 కోట్ల మంది మృతి చెందారంటూ డొనాల్డ్ ట్రంప్ చేసిన ట్వీట్‌ను సోషల్ మీడియాలో పలువురు నెటిజన్లు తీవ్రంగా తప్పుపట్టారు. అన్నింటినీ మిలియన్లలో లెక్కించలేమని, సానుభూతి సందేశంపై కూడా శ్రద్ధ చూపకపోతే అది నిజమైన సానుభూతి ఎలా అవుతుందని జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ప్రశ్నించారు. ‘‘మా దేశ జనాభా 2.17 కోట్లే, అలాంటప్పుడు 13.80 కోట్ల మంది మరణించడం అసాధ్యం, మీ సానుభూతి మాకేం అక్కర్లేదు’’అని శ్రీలంకకు చెందిన ఓ నెటిజన్ సోషల్ మీడియాలో తిప్పికొట్టారు. ట్రంప్ లెక్క ప్రకారం ఇప్పుడు మా దేశం ప్రజలెవరూ లేకుండా ఖాళీగా మారింది అని మరో నెటిజన్ పేర్కొన్నారు. డొనాల్డ్ ట్రంప్ గతంలోనూ పలుమార్లు తప్పుడు ట్వీట్లు చేసి నవ్వుల పాలయ్యారు. -
అమ్మ... ఆయా... ఓ కథ
సినిమాల్లో హీరోయిన్ ఎప్పుడూ హీరోకి చెవిలో తల్లవుతున్న సంగతి చెబుతుంది. పాటలో ఆమెకు నవమాసాలు నిండటం, మొదటి చరణంలో పిల్లాడు పుట్టడం, రెండవ చరణంలో ఎనిమిదేళ్ల వాడయ్యి బెలూన్లు పట్టుకుని పరుగుతీయడం... అంతా హ్యాపీగా జరిగిపోయినట్టు చూపిస్తారు. నిజంగా అంత హ్యాపీనా? మాతృత్వం చుట్టూ మధుర భావనలే సృష్టించింది ఈ ప్రపంచం. ఏ ప్రపంచం? మగ ప్రపంచం. తల్లి కావడం స్త్రీ జీవితానికి ధన్యత అన్నారు. తల్లి వల్లే సమాజం అన్నారు. తల్లి పూజ్యనీయురాలు అన్నారు. తల్లి పాదాల వద్దే స్వర్గం ఉందన్నారు. స్త్రీ వేరు. తల్లి వేరు. తల్లి అయిన స్త్రీకే ఈ సమాజంలో సమ్మతి. లేదంటే ఈసడింపులు. అందుకే స్త్రీలు తల్లులు కావడానికి తహతహలాడతారు. తల్లి కావాలనే సహజాతం వారిలో ఉంటుంది. తల్లి కావాల్సిన భౌతిక అవసరం ఉంటుంది. ఈ రెంటికీ పురుషుడి ప్రోత్సాహం ఉంటుంది. కాని తల్లి అయ్యే సమయంలో, తల్లి అయ్యాక, బిడ్డను, పెంపకాన్ని నిర్వహించాల్సిన సమయంలో తల్లికి పురుషుడి తోడ్పాటు ఎంత? సహకారం ఎంత? సహానుభూతి ఎంత? సినిమాల్లో హీరోయిన్ ఎప్పుడూ హీరోకి చెవిలో తల్లవుతున్న సంగతి చెబుతుంది. పాటలో ఆమెకు నవమాసాలు నిండటం, మొదటి చరణంలో పిల్లాడు పుట్టడం, రెండవ చరణంలో ఎనిమిదేళ్ల వాడయ్యి బెలూన్లు పట్టుకుని పరుగుతీయడం... అంతా హ్యాపీగా జరిగిపోయినట్టు చూపిస్తారు. నిజంగా అంత హ్యాపీనా?హాలీవుడ్లో కూడా సినిమాలు ఇలాగే ఉండేవి.కాని ఆ పరంపరను బ్రేక్ చేస్తూ అక్కడ తాజాగా రాబోతున్న సినిమా ‘టాల్లీ’.ఈ టాల్లీ అనేది ఆయా పేరు. ఈమె ఎవరికి ఆయా? ఈ సినిమాలోని ‘మార్లో’ అనే గృహిణి పిల్లలకు ఆయా. మార్లో న్యూయార్క్ శివార్లలో ఉండే గృహిణి. భర్త ఇద్దరు పిల్లలు ఉన్నారు. మూడో బిడ్డకు జన్మనివ్వనుంది. నిండు గర్భిణి. మాతృత్వం గొప్పదే కావచ్చు. పిల్లలకు జన్మనివ్వడం స్త్రీ జన్మకు సార్థకత కావచ్చు. కాని ఏమేమి కోల్పోతే ఒక స్త్రీ ఈ మాతృత్వ దశకు చేరుకుంటుంది? ఈ సినిమాలో ఇద్దరు పిల్లలతో, కడుపులో ఉన్న బిడ్డతో మార్లో సతమతమవుతుంటుంది. గర్భం వల్ల బరువు పెరిగి ఉంటుంది. అందం చందం పట్ల ఆసక్తి ఉండదు. ఏదో ఆందోళన. భర్త మంచివాడే కాని అతడు తన కెరీర్లో తాను బిజీగా ఉంటాడు. మహా అయితే పిల్లల హోమ్ వర్క్‌లో సాయం చేస్తుంటాడు. కాని ఇంట్లో ఇరవై నాలుగ్గంటలు ఉండే భార్య ఇరవై నాలుగ్గంటల పాటు చిన్నా పెద్ద పనులను చక్కబెట్టుకుంటూ తనను తాను ఎలా మిగుల్చుకోగలదు? ఇండియా నుంచి అమ్మలో అత్తలో ఫ్లయిట్ ఎక్కి అమెరికా చేరుకుంటారు కాన్పు సమయంలో సహాయానికి. అమెరికా వాళ్లకు అలా కుదరదు. పైగా న్యూయార్క్‌లో అది చాలా ఖర్చు. మార్లో కష్టాన్ని గమనించిన ఆమె తమ్ముడు తన సొంత ఖర్చుతో ఆమెకు ఒక ఆయాను ఏర్పాటు చేస్తాడు. దీనిని ముందు మార్లో నిరాకరిస్తుంది. కాని తర్వాత ఆ ఆయాను అంగీకరిస్తుంది. పిల్లల బాగోగులు చూడటానికి రోజు రాత్రి వచ్చి నైట్ డ్యూటీ చేసే ఆ ఆయా మార్లో జీవితంలో ఒక పెద్ద సమీరంలా వీస్తుంది. నిద్ర లేచే పిల్లలతో, డైపర్లు మార్చాల్సిన పసి బిడ్డతో, నిద్రే కరువైన మార్లో ఆయా రావడంతో కంటి నిండా నిద్ర పోగలుగుతుంది. కాన్పయ్యాక కూడా ఆమె డెలివరీ తాలూకు బరువైన శరీరంతో కష్టపడుతుంటుంది. పాలు పొంగి వక్షోజాలు సలపరించినప్పుడల్లా బిడ్డ వక్షాన్ని నోటికి అందుకోకపోతే ఏం చేయాలి? ఆ పాలను బాటిళ్లలో పడుతుంటుంది. ఈ సందర్భాలన్నింటిలో ఆయా ఆమె మానసికంగా గట్టి సమర్థింపు ఇస్తుంది. ఒక స్త్రీ కష్టం ఇంకో స్త్రీకే తెలుస్తుందంటారు. అసలు స్త్రీ కష్టం మగ ప్రపంచానికి ఎప్పటికి తెలియాలి?ఈ సినిమా గొప్పతనం ఏమంటే ఇందులో మార్లోగా నటించిన చార్లెజ్ థెరాన్ నిజ జీవితంలో ఎప్పుడూ తల్లి కాలేదు. కాని ఆమె నటన చూసినవారు అవన్నీ అనుభవించి చేస్తున్నట్టుగా భావిస్తారు. ఇక ఆయాగా నటించిన మెకంజీ డేవిస్‌కు ఒక గర్భిణీ స్త్రీ భావోద్వేగాలను గమనించే వీలు గతంలో లేదు. అయినప్పటికీ వీళ్లిద్దరూ అద్భుతంగా ఆ సన్నివేశాలను రక్తి కట్టించి విమర్శకుల ప్రశంసలు పొందుతున్నారు. ఇవాళ నగరాల్లో, పట్టణాల్లో, పల్లెల్లో కూడా మైక్రో ఫ్యామిలీలను ఇష్టపడుతున్నారు. పెళ్లయ్యి విడి కాపురం ఆ తర్వాత గర్భం...గర్భ సమయంలో స్త్రీ గురించి ఆమె మానసిక ప్రపంచం గురించి ఆకాంక్షలు అభిరుచులు గురించి ఆలోచించే అవసరాన్ని ఆమెకు ఎలా ఇష్టమైతే అలా మారాల్సిన మగ ప్రపంచం గురించి మరింత చర్చ జరగాల్సి ఉంది. లైట్ పడాల్సి ఉంది.ఇలాంటి సినిమాలు అందుకు సహకరిస్తాయని ఆశిద్దాం.టాలీ మే 4న అమెరికాలో రిలీజవుతుంది. ఇండియాకు వస్తే తప్పక చూడండి. -
ఏడాది శిక్ష... చాలా ఎక్కువ!
బాల్ ట్యాంపరింగ్‌లో స్మిత్, వార్నర్, బాన్‌క్రాఫ్ట్ అడ్డంగా దొరకడంతో క్రీడాలోకం ఒక్కసారిగా భగ్గుమంది. క్షమించరాని నేరమంది. వారు చేసింది ఘోరమంది. శిక్షలు పడ్డాక... పశ్చాత్తాపంతో విలపిస్తుంటే అదే ‘లోకం’ అయ్యో పాపమంటోంది. సానుభూతి కురిపిస్తోంది. న్యూఢిల్లీ: బాల్ ట్యాంపరింగ్‌లో తీవ్రమైన శిక్ష ఎదుర్కొంటున్న స్మిత్ విలాపం బహుశా అందర్ని కదిలిస్తోంది. దీంతో అప్పుడు ఛీ అన్నోళ్లే ఇప్పుడు కనికరించాలంటున్నారు. ఐదు రోజుల క్రితం కెప్టెన్ స్మిత్‌పై ఐసీసీ కేవలం ఒక మ్యాచ్ సస్పెన్షన్ విధించడంతో భారత స్పిన్నర్ హర్భజన్ ఐసీసీది ద్వంద్వ నీతంటూ ధ్వజమెత్తాడు. అతనే ఇప్పుడు యూ టర్న్ తీసుకున్నాడు. ఆస్ట్రేలియా క్రికెటర్లు స్మిత్, వార్నర్ చేసిన నేరానికి విధించిన ఏడాది శిక్ష చాలా ఎక్కువని... ఏదో ఒక టెస్టు సిరీస్‌కో లేదంటే రెండు సిరీస్‌లకో వేటు వేయాల్సిందని భజ్జీ అన్నాడు. మరో భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా ఆస్ట్రేలియన్లపై సానుభూతి చూపాడు. ‘ప్రపంచం మీ కన్నీళ్లు చూడాలనుకుంది... చూసింది. ఇప్పుడు చూశాక సంతోషించినట్లుంది. కానీ సానుభూతి అనేది పదంలా మాత్రమే కాకుండా నిజంగా చూపిస్తే బాగుంటుంది. దీనినుంచి బయటపడే ధైర్యాన్ని దేవుడు వారికివ్వాలి’ అని అశ్విన్ ట్వీట్ చేశాడు. మోసగాళ్లు, దోషులు అని పతాక శీర్షికల్లో నిందించిన దిన పత్రికలు కూడా ఇవేం శిక్షలంటూ రాశాయి. ‘దిస్ ఈజ్ బాల్ ట్యాంపరింగ్. నాట్ మర్డర్’ (ఇది బాల్ ట్యాంపరింగే... హత్య కాదు), అని, ‘డియర్ ఆస్ట్రేలియా దట్స్ ఎనఫ్ నౌ’ (ఆస్ట్రేలియా... ఇక చాలు) అని పత్రికలు ఆసీస్ ఆటగాళ్లపై నిందలు చాలించాలని కోరాయి. పాక్ కోచ్‌గా వ్యవహరిస్తున్న ఆస్ట్రేలియన్ మైకీ అర్థర్ మాట్లాడుతూ స్మిత్‌కు క్రికెటే లోకమని, ఆటకోసమే పరితపిస్తాడని... అతని కెరీర్లో ఇలాంటి ఘటన దురదృష్టకరమని అన్నారు. మళ్లీ పునరాగమనంలో మరింత కష్టపడతాడని... సుదీర్ఘకాలం జట్టుకు సేవలందిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశారు. -
సానుభూతి!
స్టీవ్ స్మిత్ మీడియా సమావేశంలో కళ్ళనీళ్లు పెట్టుకొని భావోద్వేగంగా మాట్లాడిన తర్వాత అతనిపై క్రికెట్ ప్రపంచం నుంచి సానుభూతి కురుస్తోంది. శిక్షల తీవ్రత కూడా చాలా ఎక్కువగా ఉందని వారు అభిప్రాయ పడుతున్నారు. వీరిలో స్మిత్‌తో తలపడిన ప్రత్యర్థులు కూడా ఉండటం విశేషం. విమానాశ్రయంలో స్మిత్‌ను తీసుకొస్తున్న దృశ్యం, అతని మీడియా సమావేశం నన్ను వెంటాడుతున్నాయి. వారు తప్పు చేశారనేది వాస్తవం. కానీ దానిని అంగీకరించారు. వారిద్దరు గొప్ప ఆటగాళ్లు. ఈ ఘటనను బట్టి వారి వ్యక్తిత్వాన్ని అంచనా వేయడం తప్పు. –రోహిత్ శర్మ క్రికెట్‌ను అవినీతి రహితంగా ఉంచాల్సిందే. కానీ స్మిత్, వార్నర్‌లకు వేసిన శిక్ష చాలా పెద్దది. గతంలో జీతాల పెంపు కోసం వీరిద్దరు పోరాడటం వల్లే ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నారేమో! ఆటగాళ్ల తరఫున నిలబడిన వారిని పరిపాలకులు అణచివేసిన చరిత్ర ఉంది. నాకు స్మిత్‌లో మోసగాడు కనిపించడం లేదు. తన దేశం కోసం గెలిచేందుకు ప్రయత్నించి నాయకుడే కనిపిస్తున్నాడు. అతను ఎంచుకున్న పద్ధతి తప్పు కావచ్చు కానీ అతడిని అవినీతిపరుడిగా ముద్ర వేయకండి. – గంభీర్ సీఏ విచారణ లోపభూయిష్టంగా జరిగింది. శిక్షలు తీవ్రంగా ఉన్నాయి. ఐసీసీ విధించిన శిక్షలతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. గతంలో ఇదే నేరానికి విధించిన శిక్షకు, ఇప్పటిదానికి చాలా చాలా వ్యత్యాసం ఉంది. ముందూ వెనక ఆలోచించకుండా ఆటగాళ్లను ఘటన జరిగిన రోజు మీడియా ముందు ప్రవేశపెట్టడమే పెద్ద తప్పు. క్రికెటర్లకు మేం నైతిక మద్దతుతో పాటు న్యాయపరంగా కూడా సహకరిస్తాం. – ఆస్ట్రేలియన్ క్రికెటర్స్ అసోసియేషన్ వారు తాము చేసిన పనికి బాధపడటంతో పాటు పశ్చాత్తాపం చెందుతున్నారు. తమ చర్య ద్వారా జరగబోయే తదనంతర పరిణామాలను ఎదుర్కోక తప్పదు. ఇలాంటి సమయంలో వారి కుటుంబ సభ్యులు అండగా నిలవడం ఎంతో ముఖ్యం. ఇక మనం దాని గురించి చర్చించడం మాని పక్కకు తప్పుకొని వారికి కాస్త ఏకాంతం కల్పిస్తే బాగుంటుంది. – సచిన్ టెండూల్కర్ స్మిత్‌ను చూస్తే చాలా బాధగా ఉంది. అతడిని ఇలాంటి స్థితిలో చూడలేం. రాబోయే రోజులు చాలా కఠినంగా గడుస్తాయి. మానసికంగా దృఢంగా ఉండమని నేను మెసేజ్ పంపించాను కూడా. మా ఇద్దరికీ పరస్పర గౌరవం ఉంది. ఆస్ట్రేలియాకు అతను అత్యుత్తమ కెప్టెన్. – ఫాఫ్ డు ప్లెసిస్ వార్నర్ చెడ్డవాడు కాదు. నేను అతనికి ప్రత్యర్థిగా, ఐపీఎల్లో అతనితో కలిసి ఆడాను. ఘటన జరిగిన తర్వాత కూడా మేం టచ్‌లోనే ఉన్నాం. ప్రజల భావోద్వేగాల వల్లే భారీ శిక్ష పడింది తప్ప అతను తప్పుడు మనిషి మాత్రం కాదు. – కేన్ విలియమ్సన్ మంచివాళ్లు కూడా తప్పులు చేస్తారు – నాకు తెలిసి స్మిత్, బాన్‌క్రాఫ్ట్ కొద్ది క్షణాలు మతి తప్పారంతే. వారికి రెండో అవకాశం ఇవ్వాలి. చుట్టుపక్కల ఉన్నవారు అండగా నిలవాలి. – మైకేల్ వాన్ స్మిత్ ఒక మగాడిలా తాను చేసిన తప్పును ఒప్పుకున్నాడు. కానీ అతని ఏడుపు, కొందరు అతనితో వ్యవహరిస్తున్న తీరు చూస్తే చాలా బాధేస్తోంది. – షోయబ్ అక్తర్ ఇప్పుడు జనం కళ్లు చల్లబడ్డాయా... స్మిత్ మాట్లాడుతుంటే చూడలేకపోతున్నాను. – ఆండ్రూ ఫ్లింటాఫ్ -
రూమ్ టు రీడ్
పుస్తక నేస్తం సానుభూతి చూపడానికి పెద్దగా రిస్క్ అక్కర్లేదు. అయితే పదిమందికి సహాయం చేయడానికి ‘మంచి మనసు’తో పాటు రిస్క్ తీసుకునే ధైర్యం కూడా ఉండాలి. ఆ ధైర్యమే జాన్ వుడ్‌ను ప్రపంచానికి కొత్తగా పరిచయం చేసింది. జాన్ వుడ్ అనే పేరు వినబడగానే... ‘రూమ్ టు రీడ్’ గుర్తుకు వస్తుంది. ‘రూమ్ టు రీడ్’ అనేది ఒక గ్లోబల్ ఎన్జీవో. ‘అక్షరాస్యత’, ‘లింగ వివక్ష’ ప్రధాన అంశాలుగా శాన్ ఫ్రాన్సిస్కో (అమెరికా) కేంద్రంగా మన దేశంతో సహా ఆసియా, ఆఫ్రికాలలో పది దేశాల్లో పని చేస్తోంది. విద్యావ్యాప్తికి కృషి చేయడం, పుస్తకపఠనంపై విద్యార్థుల్లో అభిరుచిని ప్రేరేపించడంతో పాటు... సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం, సమస్యలను పరిష్కరించుకునే నైపుణ్యాన్ని పెంపొందించడం, కొత్తగా ఆలోచించడం, ఆకట్టుకునేలా మాట్లాడడం... మొదలైన ‘లైఫ్ స్కిల్క్’ను విద్యార్థులకు నేర్పుతోంది. అమెరికాలోని హార్ట్‌ఫోర్డ్‌లో జన్మించిన జాన్ వుడ్ యూనివర్సిటీ ఆఫ్ కొలొరోడో నుంచి బ్యాచిలర్ డిగ్రీ, నార్త్‌వెస్ట్రన్ యూనివర్సిటీ నుంచి ‘బిజినెస్ అడ్మినిస్ట్రేషన్’లో మాస్టర్స్ డిగ్రీ తీసుకున్నారు... మైక్రోసాఫ్ట్ ఎగ్జిక్యూటివ్‌గా పని చేశారు. పని నుంచి విరామం కోసం ఒకసారి నేపాల్‌కు వెళ్లారు జాన్. అనుకోకుండా... అక్కడ ఒక ప్రైమరీ స్కూలుకు వెళ్లారు. ఆ స్కూల్లో 450 మంది పిల్లలు ఉన్నారు... అయితే చదువుకోవడానికి పది పుస్తకాలకు మించి లేవు. పుస్తకాలు కొనే ఆర్థిక స్థోమత తల్లిదండ్రులకు లేకపోవడమే దీనికి కారణం అనే విషయం జాన్ వుడ్‌కు అర్థమైంది. ‘‘మీరు మరోసారి ఇక్కడికి వచ్చినప్పుడు పుస్తకాలతోనే వస్తారేమో... ఎవరు చెప్పొచ్చారు!’’ అన్నాడు అక్కడి హెడ్ మాస్టర్. ఆయన సరదాగా అన్నాడో, సీరియస్‌గా అన్నాడో తెలియదుగానీ... జాన్ వుడ్ మాత్రం సీరియస్‌గా తీసుకున్నారు. పిల్లల కోసం తన వంతుగా ఏదో ఒకటి చేయాలనుకున్నారు. ఒక సంవత్సరం తరువాత...మూడు వేల పుస్తకాలతో నేపాల్‌కు వెళ్లారు. పిల్లల కళ్లలో కనిపించిన కాంతిని స్వయంగా చూశారు. ఇంకా ఏదైనా చేయాలనిపించింది. తన ఉద్యోగానికి రాజీనామా చేసి ‘రూమ్ టు రీడ్’ ను స్థాపించారు. మరి ‘రూమ్ టు రీడ్’ ఏం చేసింది? ఎన్నో సూళ్లను నిర్మించింది. వేలాది గ్రంథాలయాలను ఏర్పాటు చేసింది. కోటికి పైగా పుస్తకాలను పంపిణీ చేసింది. విద్యార్థినులకు ఉపకార వేతనాలు ఇస్తుంది. మన తెలుగు రాష్ట్రాలతో సహా దేశంలో తొమ్మిది రాష్ట్రాల్లో ‘రూమ్ టు రీడ్’ సేవలందిస్తోంది. రంగుల కార్టూన్ల పుస్తకాల నుంచి, పజిల్స్ పుస్తకాల వరకు... విద్యార్థులు తమ అభిరుచికి తగిన పుస్తకాలు చదువుకోవచ్చు. ఈ పుస్తకాల రంగులకు కూడా ప్రత్యేకత ఉంది. ఆకుపచ్చ, ఎరుపు రంగు పుస్తకాలలో పెద్ద పెద్ద బొమ్మలు ఉంటాయి. ఇవి 1-2 తరగతుల పిల్లలకు ఇస్తారు. తెలుపు, పసుపు, నీలం, నారింజ రంగుల పుస్తకాలు పెద్ద పిల్లలకు ఇస్తారు. అక్కడెక్కడో అమెరికాలో మైక్రోసాఫ్ట్‌లో పని చేసిన జాన్ వుడ్‌కు... నేపాల్‌లో... ‘రూమ్ టు రీడ్’ ఆలోచన వచ్చింది. మంచి ఆలోచనకు దూరంతో పని లేదు. అందుకే ‘రూమ్ టు రీడ్’ అంత దూరం నుంచి మన దగ్గర రెక్కలు కట్టుకొని వాలింది!‘లీవింగ్ మైక్రోసాఫ్ట్ టు ఛేంజ్ ది వరల్డ్’ పుస్తకం జాన్ వుడ్‌కు మంచి పేరు తీసుకువచ్చింది. ఇది పుస్తకం అనడం కంటే... జాన్ మానసిక ప్రపంచంలోని వివిధ కోణాలను స్పష్టంగా పరిచయం చేయడం అంటే బాగుంటుంది. ‘మైక్రోసాఫ్ట్’లాంటి పెద్ద సంస్థలో సక్సెస్ఫుల్ సాఫ్ట్ ఎగ్జిక్యూటివ్‌గా రాణించిన జాన్ వుడ్... బంగారంలాంటి తన ఉద్యోగాన్ని ఎందుకు వదులుకున్నాడు? హిమాలయాల ఏకాంతం ఏ పాఠాలు నేర్పింది?... ఇలా తెలుసుకోదగ్గ విషయాలెన్నో ఈ పుస్తకంలో కనిపిస్తాయి. ‘మీరు కూడా ఏదో ఒకటి చేయండి’ అని మనల్ని ప్రేరేపిస్తాయి. నేర్చుకున్న విద్య, పాఠం ఎప్పుడూ వృథా పోదు. చదువులో నేర్చుకున్న పాఠాలను, ఉద్యోగంలో నేర్చుకున్న మెలకువలను ‘రూమ్టు రీడ్’లో విజయవంతంగా అమలుపరిచారు జాన్ వుడ్. -
ఉడీ బాధిత కుటుంబాలకు కోహ్లి సానుభూతి
కాన్పూర్: ఇటీవల ఉడీ సెక్టార్లో ఉగ్రవాదుల దాడిలో అమరులైన జవాన్ల కుటుంబాలకు టెస్టుకెప్టెన్ విరాట్ కోహ్లి తన ప్రగాఢ సానుభూతిని తెలిపాడు. ఇలాంటి పిరికి చర్యలు దేశంలోని ప్రతి ఒక్కరి మనసును గాయపరుస్తాయని అన్నాడు. ‘నిరంతరం ఇలాంటి సంఘటనలు జరగడం దురదృష్టకరం. సైనికుల కుటుంబాల గురించి ఆలోచిస్తే ఆవేదనగా ఉంది. ఓ భారతీయుడిగా ఈ దుర్ఘటనలో నష్టపోరుున కుటుంబాలకు సానుభూతి తెలుపుతు న్నాను’ అని కోహ్లి తెలిపాడు. -
జాలి చూపడం కాదు.. చర్యలు తీసుకోండి!
న్యూఢిల్లీ: దేశంలో దళితులపై జరుగుతున్న అకృత్యాలపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ పార్లమెంటులో ఓ ప్రకటన చేయాలని బీఎస్పీ అధినేత్రి మాయావతి డిమాండ్ చేశారు. దళితులపై దాడుల విషయమై ప్రధాని మోదీ వ్యాఖ్యలు కంటితుడుపు చర్యలేనని, రాజకీయంగా నష్టనివారణ చర్యల్లో భాగంగానే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని ఆమె తప్పుబట్టారు. గురువారం పార్లమెంటు వెలుపల మాయావతి విలేకరులతో మాట్లాడారు. వేముల రోహిత్ ఆత్మహత్య, ఉనాలో దళితులపై దాడి, ఇతర దాడుల నేపథ్యంలో బీజేపీపై రాజకీయంగా ప్రభావం పడే అవకాశం ఉండటంతోనే ప్రధాని మోదీ స్పందించారని మాయావతి అన్నారు. 'దళితుల విషయంలో జాలి చూపించడం కాదు. వారిపై అరాచకాలకు పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవడంపై ప్రధాని దృష్టి సారించాలని బీఎస్పీ కోరుకుంటోంది' అని ఆమె పేర్కొన్నారు. -
ఇక్కడకు మీరొచ్చి చేసేదేమిటి...!
టీపీసీసీ నాయకులకు కొత్త ప్రశ్నలు ఎదురవుతున్నాయట. సానుభూతి పవనాలతో పాలేరు ఉప ఎన్నికల్లో గెలవాలని అనుకుంటున్నపుడు, అందుకు తగ్గ ఏర్పాట్లు చేశారా అని కిందిస్థాయి నుంచి ప్రశ్నలు వస్తున్నాయట. సీనియర్ ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డిపై ఉన్న సానుభూతిని సెంటిమెంట్రూపంలో ఉపయోగించుకోవడానికి ఎలాంటి వ్యూహాలు చేపట్టారంటూ కార్యకర్తలు ఆరాతీస్తున్నారట. ఎన్నికల తేదీ సమీపిస్తుండగా పార్టీ ముఖ్యనాయకుల జాడే కనిపించకపోవడం, ప్రచారం హోరెత్తికంచకపోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారట. అధికారపార్టీ వ్యూహాలను, ప్రచారాన్ని తిప్పికొట్టేలా కార్యాచరణను చేపట్టకుండా ఇంకా ఏవో వ్యూహాలను రచిస్తున్నట్లుగా కనిపించడం వెనక ఆంతర్యమేమిటనే ప్రశ్నలు ముందుకు వస్తున్నాయట. పెద్ద ఎత్తున వనరులను అందుబాటులోకి తెచ్చి ఒక వాతావరణాన్ని సృష్టించేందుకు ఉపకరించాల్సి ఉండగా అటువంటి ప్రయత్నాలు జరగడం లేదని స్థానికనాయకులు వాపోతున్నారట. ఇవేమి చేయకుండా ఏదో మొక్కుబడి ప్రచారానికి వచ్చి ఒరగబెట్టేది ఏమిటీ ? ఈ మాత్రం దానికి పెద్ద పెద్దనాయకులు రావాలా అని పెదవి విరుస్తున్నారట. -
ప్లీజ్.. నాపై సానుభూతి వద్దు..
తనపై ఎవరు జాలి పడాల్సిన అవసరం లేదని టాలీవుడ్ హీరోయిన్ శ్వేతబసు ప్రసాద్ స్పష్టం చేసింది. రెస్య్యూ హోమ్ నుంచి విడుదలైన తర్వాత తాను మానసికంగా మరింత బలపడ్డానని తెలిపింది. కాగా వివాదాల్లో చిక్కుకున్న శ్వేత... ఇప్పుడిప్పుడే తన కెరీర్‌పై దృష్టి సారించింది. ప్రస్తుతం ఆమె 'రూట్స్' అనే ఓ క్లాసికల్ మ్యూజిక్కు సంబంధించిన డాక్యుమెంటరిపై పని చేస్తున్నానని చెబుతున్న శ్వేతబసును ఓ ప్రయివేట్ చానల్ ఇంటర్వ్యూ చేసింది. *నేను చాలా బాగున్నాను. బలహీనపడాల్సిన పనేముంది. ఏం జరిగింది ... ఏ జరగలేదు. జీవితంలో కష్టాలు వస్తుంటాయి పోతుంటాయి. మనం వాటిని దాటేయాలి. కాలం ఎలాంటి గాయాన్ని అయినా మరిపిస్తుంది. మీరు నమ్మండి జీవితంలో ఏదీ శాశ్వతం కాదు. *ఎప్పుడైతే మీరు కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందో ... అప్పుడే మీకు నిజమైన పరీక్ష. అప్పుడే మీకు అర్ధమవుతుంది జీవితం ఎంత కష్టమైందో. ఒక్కసారి ఆ పరిస్థితి నుంచి మీరు గట్టెక్కితే... ఇక మీరు ఎలాంటి స్థితినైనా ఎదుర్కోగలరు. నేను అలాంటి కష్టాలను దాటి వచ్చానని గర్వంగా చెబుతున్నాను. ఇప్పుడు నేను ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోగలను. *ప్రతీ ఒక్కరు నాపై విపరీతమైన సానుభూతిని ఒలకబోస్తున్నారు. నాపై అత్యాచారం జరగలేదు. నేను రేప్ విక్టిమ్‌ను కాదు. ప్లీజ్ నాపై ఇంతగా సానుభూతిని చూపకండి. నాకు తెలుసు జరిగిన సంఘటన మంచిది కాదని... అది సాధారణమైన విషయం కాదని కూడా తెలుసు. కాని నాకు అదో ఎక్స్పీరియన్స్... నేను జీవితంలో నేర్చుకున్న అతిపెద్ద గుణపాఠం. ఈ సంఘటనకు సంబంధించి ఎవరిపైనా నేను కోపం పెంచుకోలేదు. *సినిమా ఇండస్ట్రీ చెడ్డదేం కాదు. ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు సంతోషంగా పలకరిస్తారు. నాతో స్నేహంగా ఉంటారు. *ఇప్పుడు హన్సిల్ మెహతా ప్రాజెక్టు గురించి నేనేం మాట్లాడను. ఎందుకంటే ఆయన నాకు ఇచ్చిన సినిమా ఆఫర్‌కు సంబంధించి ఇంకా ఏదీ అఫిషియల్ కాలేదు. హన్సిల్ మెహతా ప్రాజెక్టు కావచ్చు లేక మరేదైనా... నేను ఆడిషన్స్‌కు హాజరవుతాను. నా సొంత టాలెంట్‌పైనే సినిమా అవకాశాలు సాధించుకుంటాను. *నసీరుద్దిన్ షా నాకు ఓ సారి మెసేజ్ చేశారు. కోల్‌కతాలో ఆయన చేస్తున్న ఐన్‌స్టీన్ అనే షో చూడటానికి రమ్మన్నారు. ఆయన దగ్గర నా ఫ్రెండ్ పని చేస్తుంది. నేను సాధారణంగా అందరితో మరోసారి కలుపుగోలుగా ఉండాలని ఆయన సూచించారట. నేను కూడా ఇప్పుడిప్పుడే అందరితో కలుస్తున్నాను. *రూట్స్ అనే డాక్యుమెంటరీపై పని చేస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రాజెక్టు కోసం చాలామంది పెద్ద వ్యక్తులు ఒకే వేదికపైకి వచ్చారు. *స్వేచ్ఛగా ఎగిరిపోతాను. నాకు రెక్కలున్న సంగతి వారికి తెలియదు. అందుకే నాలో నేను సంతోషపడుతుంటాను. నాపై ఏడిచే వారిపై జాలిపడతాను. -
దిగ్భ్రాంతి... విషాదం...
హ్యూస్ మృతికి సంతాపాల వెల్లువ అడిలైడ్ / న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా ఆటగాడు ఫిలిప్ హ్యూస్ మృతితో ప్రపంచ క్రీడా ప్రేమికులతో పాటు క్రికెట్ ప్రపంచం ఒక్కసారిగా షాక్‌కు గురైంది. ఎంతో భవిష్యత్ ఉన్న ఆటగాడిగా పేరు తెచ్చుకుంటున్న క్రమంలో పాతికేళ్ల వయస్సులోనే అనూహ్య పరిస్థితిలో ప్రాణాలు వదిలిన హ్యూస్‌పై విశ్వవ్యాప్తంగా సానుభూతి వ్యక్తమైంది. ఇది క్రికెట్‌కే దారుణమైన రోజుగా పలువురు అభివర్ణించారు. కొందరు తమ ఆవేదనను ట్విట్టర్, ఫేస్‌బుక్‌లలో పంచుకున్నారు. ఆస్ట్రేలియా ప్రధాని టోనీ ఎబాట్, ఐసీసీ, క్రికెట్ ఆస్ట్రేలియా, బీసీసీఐలతో పాటు ఇతర బోర్డులు, బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లి, భారత్, ఆసీస్ ఆటగాళ్లు, ఇతర జట్ల ఆటగాళ్లు, మాజీ ఆటగాళ్లు, బాలీవుడ్ నటులు ఇలా ప్రతీ ఒక్కరు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు తమ ఆటగాడి మృతికి నివాళి ఘటిస్తూ ప్రఖ్యాత సిడ్నీ క్రికెట్ మైదానంలో ఆసీస్ జాతీయ పతాకాన్ని అవనతం చేశారు. ‘ఫిలిప్ మరణంతో మేమంతా షాక్‌కు గురయ్యాం. మొత్తం క్రికెట్ ప్రపంచం తరఫున అతడి కుటుంబం, స్నేహితులకు నా ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాను’ - ఐసీసీ చైర్మన్ ఎన్.శ్రీనివాసన్ ‘మరో రెండు రోజుల్లో పుట్టిన రోజును జరుపుకోవాల్సిన హ్యూస్ మృతి ఆవేదన కలిగించింది. క్రికెట్ సమాజంలో చెరగని ముద్ర వేస్తూ వెళ్లిపోయిన అతడి కుటుంబానికి మా సానుభూతి’ - బీసీసీఐ కార్యదర్శి సంజయ్ పటేల్ ‘ఫిలిప్ మరణ వార్త విని షాకయ్యాను. క్రికెట్‌కు ఇది విచారకరమైన రోజు. అతడి కుటుంబం, స్నేహితులు, శ్రేయోభిలాషులకు నా సంతాపం తెలుపుతున్నాను’ - సచిన్ టెండూల్కర్ ‘తొలి టెస్టును రద్దు చేస్తే బావుంటుంది’ ‘హ్యూస్ మరణంతో భారత్, ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఆటపై వంద శాతం మనస్సును పెట్టలేరనేది నా అభిప్రాయం. ఇది నిజంగా చాలా కష్టకాలం. ఇరు జట్ల మధ్య తొలి టెస్టుకు కేవలం వారం రోజుల సమయం ఉంది. అయితే ఎవరూ కూడా ఇప్పుడు ఆడే స్థితిలో లేరనిపిస్తోంది. అందుకే ఈ మ్యాచ్‌ను రద్దు చేయాలా? లేదా? అనే విషయాన్ని ఇరు బోర్డులు ఓసారి పరిశీలించాల్సి ఉంది’ - సునీల్ గవాస్కర్ ‘క్రీడలో విషాదం అనే మాట తరచుగా వాడుతున్నా ఇది మాత్రం నిజ జీవిత విషాదం. క్రికెట్ ఆస్ట్రేలియాకు ఇది ఊహించని దెబ్బ. అతడి తల్లిదండ్రులు, తోబుట్టువులకు మా మద్దతు ఎల్లవేళలా ఉంటుంది’ - సీఏ సీఈవో జేమ్స్ సదర్లాండ్ -
దేశ రాజధాని ‘హస్త’గతం..!
సాక్షి, న్యూఢిల్లీ: ఎనిమిదవ లోక్‌సభ ఎన్నికలు ఇందిరాగాంధీ మరణానంతరం 1984లో జరిగాయి. దేశమంతటా వెల్లువెత్తిన సానుభూతి పవనాలతో కాంగ్రెస్ భారీ మెజారిటీతో నెగ్గింది. ఇందిరాగాంధీ కుటుంబం దేశానికి అందించిన సేవలను చాటిచెబుతూ , రాజీవ్ గాంధీని సంస్కరణాభిలాషిగా సాగించిన ప్రచారం ప్రభావం ఢిల్లీలో కూడా కనిపించింది. దాంతో ఏడు స్థానాలూ కాంగ్రెస్ కైవశం చేసుకుంది. కేసీ పంత్ న్యూఢిల్లీలో కన్వర్లాల్ గుప్తాను ఓడించారు. చాందినీచౌక్‌లో జైప్రకాశ్ అగర్వాల్ జనతా పార్టీ నేత సికిందర్ భఖ్త్పై గెలిచారు. హెచ్‌కెఎల్ భగత్ ఈస్ట్ ఢిల్లీలో కిషోరీలాల్ను పరాజయం పాలుచేశారు. కరోల్‌భాగ్‌లో సుందర్ వతి నావల్ ప్రభాకర్, ఔటర్ ఢిల్లీలో భరత్ సింగ్ గెలిచారు. జగదీశ్ టైట్లర్ సదర్‌లో మదన్‌లాల్ ఖురానాను, లలిత్ మాకెన్ సౌత్ ఢిల్లీలో విజయ్‌కుమార్ మల్హోత్రాను ఓడించారు. ఇందిరాగాంధీ మరణానంతరం రాజధానిలో సిక్కులపై జరిగిన అకృత్యాల ప్రభావం వెంటనే జరిగిన లోక్‌సభ ఎన్నికలపై కనిపించనప్పటికీ ఆ తర్వాత కాలం నుంచి ఢిల్లీ రాజకీయాలపై కనిపించసాగింది. సిక్కు అల్లర్లలో హస్తముందని ఆరోపణలు ఎదుర్కొన్న సౌత్ ఢిల్లీ ఎంపీ లలిత్ మాకెన్ ఉగ్రవాదుల చేతిలో హతమయ్యారు. కీర్తినగర్‌లోని తన నివాసం ముందున్న రోడ్డుకు అవలివైపున పార్క్ చే సిన కారు వైపునకు నడిచివెళ్తుండగా ఉగ్రవాదులు లలిత్ మాకెన్‌ను , ఆయన భార్య గీతాంజలిపై హత్యచేశారు. లలిత్ మాకెన్ మాజీ రాష్ట్రపతి శంకర్‌దయాళ్ శర్మ అల్లుడు. ప్రస్తుత న్యూఢిల్లీ ఎంపీ అజయ్ మాకెన్ ఆయన సోదరుని కుమారుడు. లలిత్ మాకెన్ మరణంతో సౌత్ ఢిల్లీ నియోజకవర్గానికి 1985లో ఉప ఎన్నిక జరిగింది. దానిలో కాంగ్రెస్ నేత అర్జున్ సింగ్ బీజేపీకి చెందిన విజయ్ కుమార్ మల్హోత్రాను ఓడించారు. 1984 ఎన్నికల నాటికి ఢిల్లీలో ఓటర్ల సంఖ్య 35 లక్షలయ్యింది.వారిలో 20 లక్షల మంది పురుషులు కాగా 15 లక్షల మంది మహిళలు. ఈ ఎన్నికల్లో 189 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించకున్నారు. వారిలో 9 మంది మహిళలు. ఈ 9 మందిలో కరోల్ బాగ్ నుంచి పోటీచేసిన సుందరవతి నావల్ ప్రభాకర్ మాత్రమే విజయం సాధించారు.