
బీజింగ్: కరోనాతో భారత్ కొట్టుమిట్టాడుతున్న నేపథ్యంలో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ భారత ప్రధాని మోదీకి సానుభూతి సందేశం పంపించారు. భారత్‌లోని కోవిడ్ పరిస్థితులు తనను ఎంతగానో బాధకు గురిచేస్తున్నాయని అందులో పేర్కొన్నారు. కరోనాతో పోరాడుతున్న భారత్‌కు అన్ని విధాలా సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. మరోవైపు చైనా విదేశాంగ మంత్రి వాంగ్ భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌కు లేఖ రాశారు. కరోనాతో పోరాడుతున్న భారత్‌కు తమ వంతు సహకారం అందిస్తామని అందులో పేర్కొన్నారు. ఏప్రిల్‌లో ఇప్పటికే 26 వేల వెంటిలేటర్లు, ఆక్సిజన్ జనరేటర్లను పంపినట్లు చెప్పారు.
Chinese President #XiJinping sends a message of sympathy to Indian Prime Minister Narendra Modi @narendramodi today.
— Sun Weidong (@China_Amb_India) April 30, 2021