China President
-
చైనా అధ్యక్షుడిగా ముచ్చటగా మూడోసారి ఆయనే!
బీజింగ్: చైనా కమ్యూనిస్టు పార్టీ 20వ జాతీయ కాంగ్రెస్ అక్టోబర్ 16 నుంచి 22 వరకు జరగనుంది. మరో ఐదేళ్లకు అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు 2,296 మందికిపైగా ప్రతినిధులు ఆదివారం ప్రారంభమయ్యే ఈ సదస్సులో పాల్గొంటున్నారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ వరుసగా మూడోసారి అధ్యక్ష పదవి చేపట్టి చరిత్ర సృష్టించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఐదేళ్లకోసారి జరిగే సీపీసీ సదస్సు ఆదివారం ప్రారంభమవుతుంది. ప్రారంభోత్సవం అనంతరం అధ్యక్షుడు జిన్పింప్ ప్రసంగించనున్నారు. గత ఐదేళ్లలో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, రానున్న ఐదేళ్లకు రోడ్‌మ్యాప్‌ను వివరించనున్నారు. అన్నీ ప్లాన్ ప్రకారం జరిగితే జిన్‌పింగ్ వరుసగా మూడోసారి చైనా కమ్యూనిస్టు పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపడతారని, పార్టీ వ్యవస్థాపకుడు మావో జెడాంగ్ తర్వాత అత్యంత శక్తిమంతమైన నేతగా అరుదైన ఘనత సాధిస్తారని సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ సదస్సును కఠినమైన కోవిడ్ నిబంధనల మధ్య నిర్వహిస్తున్నారు. కార్యక్రమానికి హాజరయ్యేవారు కచ్చితంగా కరోనా పరీక్షలు చేయించుకోవాలి. జర్నలిస్టులు, మీడియా ప్రతినిధులు రెండు రోజుల పాటు కోవిడ్ బబుల్‌లో ఉండాలి. చదవండి: బొగ్గ గనిలో పేలుడు ఘటన.. 40కి చేరిన మృతుల సంఖ్య -
జిన్‌పింగ్‌కు మూడోసారి పట్టం!
జన చైనా అధినేతగా షీ జిన్‌పింగ్(69)ను వరుసగా మూడోసారి ఎన్నుకొనేందుకు రంగం సిద్ధమయ్యింది. మరో ఐదేళ్లపాటు ఆయన పదవిలో కొనసాగడం ఖాయమే. అన్నీ అనుకున్నట్లు జరిగితే జీవితకాలం పదవిలో ఉండేలా అధికార చైనా కమ్యూనిస్ట్ పార్టీ(సీపీసీ) తీర్మానాన్ని ఆమోదించినా ఆశ్చర్యం లేదు. పార్టీ దివంగత నేత మావో జెడాంగ్ తర్వాత మూడుసార్లు చైనా అధ్యక్షుడిగా గద్దెనెక్కిన నాయకుడిగా జిన్‌పింగ్ రికార్డు సృష్టించబోతున్నారు. కమ్యూనిస్టు పార్టీ 20వ జాతీయ సదస్సు ఈ నెల 16న జరుగనుంది. ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిన్‌పింగ్ జాగ్రత్తగా ‘ఎన్నిక చేసిన’ 2,296 మంది ప్రతినిధులు పాల్గొంటారు. వీరంతా జిన్‌పింగ్‌కు మరోసారి పట్టంకడతారు. ప్రపంచ శక్తిగా ఎదగాలని తహతహలాడుతున్న డ్రాగన్ దేశంపై అమెరికాతోపాటు పశ్చిమ దేశాలు గుర్రుగా ఉన్నాయి. చైనా దూకుడును అడ్డుకొనేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో జిన్‌పింగ్ వరుసగా మూడోసారి అధ్యక్షుడిగా ఎన్నికవుతుండడం ఆసక్తికరంగా మారింది. ’పదేళ్ల పదవీ కాలం’ విధానానికి మంగళం చైనాలో ’పదేళ్ల పదవీ కాలం’ అనే నిబంధనకు కాలం చెల్లబోతోంది. ఇన్నాళ్లూ ’రెండు పర్యాయాలు.. ఒక్కోటి ఐదేళ్లు’ అనే విధానం కఠినంగా అమలయ్యింది. అంటే ఒక అధ్యక్షుడు పదేళ్లకు మించి అధికారంలో కొనసాగడానికి వీల్లేదు. ఏకైక రాజకీయ పార్టీ ఉన్న చైనాలో ఏక వ్యక్తి ఆధిపత్యం అరాచకానికి దారితీస్తుందన్న అంచనాతో ఈ విధానం ప్రవేశపెట్టారు. మావో జెడాంగ్ మినహా జిన్‌పింగ్ కంటే ముందు అధికారంలో ఉన్న అధ్యక్షులంతా దీనికి కట్టుబడి ఉన్నారు. మావో జెడాంగ్ 1976 దాకా అధికారంలో కొనసాగారు. పాలనలో తన బ్రాండ్ అయిన ’జెడాంగ్ ఆలోచన’ను అమలు చేశారు. పెట్టుబడిదారులపై కఠిన ఆంక్షలు విధించారు. సాంస్కృతిక విప్లవం వంటి ప్రయోగాలు చేశారు. జెడాంగ్ పాలనలో చైనా దాదాపు దివాలా దశకు చేరుకుంది. అనంతరం సర్వోన్నత నాయకుడిగా పేరుగాంచిన డెంగ్ జియావోపింగ్ అధికారంలోకి వచ్చారు. మావో విధానాలకు మంగళం పాడుతూ తనదైన ఆర్థిక విధానాలకు తెరతీశారు. ఆర్థికాభివృద్ధికి బాటలు వేశారు. ఒకే వ్యక్తి సుదీర్ఘ కాలంలో అధికారంలో ఉంటే దేశానికి ముప్పేనన్న అంచనాతో ’పదేళ్ల పదవీ కాలాన్ని, 68 ఏళ్ల వయోపరిమితిని’ ప్రవేశపెట్టారు. 1982లో జరిగిన సీపీసీ 12వ జాతీయ సదస్సులో వీటికి ఆమోదం లభించింది. ఆ తర్వాత జియాంగ్ జెమిన్, హూ జింటావో అధికారంలోకి వచ్చారు. వారి హయాంలోనే చైనా ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. ‘నూతన మావో’ జిన్‌పింగ్ 31953 జూన్ 15న జన్మించిన షీ జిన్‌పింగ్ 2008 నుంచి 2013 వరకూ హూ జింటావో హయాంలో చైనా ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. 2012లో చైనా కమ్యూనిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. అటు పిమ్మట సెంట్రల్ మిలటరీ కమిషన్(సీఎంసీ) చైర్మన్‌గా మారారు. 2013 మార్చి 14న ‘పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా’ 7వ అధినేతగా బాధ్యతలు చేపట్టారు. అప్పటినుంచి నిరాటంకంగా కుర్చీని అధిరోహిస్తున్నారు. సైన్యం, న్యాయ వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ పూర్తిగా జిన్‌పింగ్ నియంత్రణలోకి వచ్చాయి. మూడున్నర దశాబ్దాల తర్వాత ‘వన్ లీడర్’ పాలన మొదలయ్యింది. పదేళ్ల పదవీ కాలం నిబంధన ప్రకారం 2023లో ఆయన పాలన ముగిసిపోవాలి. కానీ, ‘నూతన మావో’ కావాలన్నది జిన్‌పింగ్ లక్ష్యం. ఈ లక్ష్యాన్ని ఆయన సాధించినట్లేనని చెప్పుకోవచ్చు. ► జిన్‌పింగ్ మరింత శక్తివంతమైన నాయకుడిగా అవతరించబోతున్నారని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. పదేళ్లలో అధికారాన్ని జిన్‌పింగ్ కేంద్రీకృతం చేశారు. పార్టీపై, ప్రభుత్వంపై పట్టు సాధించారు. మాజీ అధినేతలతో పోలిస్తే ఎక్కువ అధికారాలను అనుభవిస్తున్నారు. ► జిన్‌పింగ్‌కు 15 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఆయన తండ్రి జోంగ్‌షున్ జైలుపాలయ్యారు. నగరాలు, పట్టణాల్లో ఉన్న యువత గ్రామాల్లో రైతులతో కలిసి జీవించాలని మావో ఆదేశించడంతో 1969లో జిన్‌పింగ్ షాన్షీ ప్రావిన్స్‌లోని ఓ మారుమూల పల్లెకు చేరుకున్నారు. అక్కడ ఓ గుడిసెలోనే ఆరేళ్లపాటు జీవనం సాగింది. ► పల్లె జీవితం తర్వాత జిన్‌పింగ్ బీజింగ్‌లోని తిసింగ్‌హువా యూనివర్సిటీలో చేరారు. స్కాలర్‌షిప్‌తో చదువుకున్నారు. తర్వాత చైనా రక్షణశాఖలో మూడేళ్లపాటు పనిచేశారు. 1985లో ఫుజియాన్ ప్రావిన్స్‌లోని షియామెన్ నగర ఉపమేయర్‌గా ఎన్నికయ్యారు. 2000 సంవత్సరం నాటికి ఆదే పావిన్స్ గవర్నర్‌గా ఎదిగారు. ఆ తర్వాత సౌత్ ఆఫ్ బీజింగ్ కౌంటీ కమ్యూనిస్ట్ పార్టీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ► 2002లో జెజీయాంగ్ ప్రావిన్స్‌లో పార్టీ చీఫ్‌గా, 2007లో షాంఘైలో పార్టీ కార్యదర్శిగా వ్యవహరించారు. పార్టీ పొలిట్‌బ్యూరోలో శక్తివంతమైన స్టాడింగ్ కమిటీలో సభ్యుడిగా చేరారు. ► చైనా అధ్యక్షుడిగా జిన్‌పింగ్ పేరును ప్రతిపాదిస్తూ 2012లో జరిగిన పార్టీ జాతీయ సదస్సులో తీర్మానాన్ని ఆమోదించారు. ► తైవాన్ విషయంలో అంతర్జాతీయంగా విమర్శలను ఎదుర్కొంటున్నారు. తైవాన్ను ఎట్టిపరిస్థితుల్లోనూ చైనాలో కలిపేసుకుంటామని జిన్‌పింగ్ చెబుతున్నారు. ► చైనాలో ప్రశ్నించే గొంతుకలను అణచివేయడం, మీడియాపై ఆంక్షలు సర్వసాధారణంగా మారాయి. ► హాంకాంగ్‌లో శాంతియుత నిరసనలను కఠినంగా అణచివేశారు. ► జిన్‌పింగ్ అమల్లోకి తీసుకొచ్చిన ‘జీరో–కోవిడ్’ పాలసీపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. లాక్డౌన్లు కాదు, స్వేచ్ఛ కావాలంటూ జనం నినదిస్తున్నారు. – నేషనల్ డెస్క్, సాక్షి -
Xi Jinping: పుకార్లకు చెక్ పెట్టేలా.. మళ్లీ పదేళ్లపాటు?
సైనిక తిరుగుబాటు.. గృహ నిర్భంధం.. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ గురించి భారత మీడియాలో జరిగిన ప్రచారాలతో యావత్ ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఉజ్బెకిస్తాన్ సమర్ఖండ్ ఎస్సీవో సదస్సుకు హాజరై.. తిరిగి చైనాకు చేరుకున్న జిన్‌పింగ్ మీడియా కంట కనబడకపోవడంతో ఈ చర్చ మొదలైంది. దీనికితోడు బీజింగ్‌లో మిలిటరీ కదలికలు, భారీగా విమానాలు రద్దు కావడంతో ఆ అనుమానాలు మరింత బలపడ్డాయి. అయితే.. అవి కేవలం పుకార్లుగా తేలుస్తూ.. త్వరలో ఒక బలమైన ప్రకటనను జింగ్‌పిన్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. మరో దఫా చైనాకు అధ్యక్షుడిగా కొనసాగాలనే నిర్ణయానికి ఆయన వచ్చినట్లు సమాచారం. ఈ మేరకు 20వ చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ(సీపీసీ) కాంగ్రెస్ వేదికగా ఆయన ప్రకటన చేయనున్నట్లు అక్కడి బ్లాగులు కొన్ని కథనాలు ప్రచురిస్తున్నాయి. అక్టోబర్ 16వ తేదీ నుంచి వారంపాటు సీపీసీ సమావేశం సాగనుంది. కీలకమైన ఈ సమావేశం నుంచి సీపీసీ బలాన్ని, జిన్‌పింగ్ కీర్తిని ప్రదర్శించడానికి అత్యంత ప్రణాళికాబద్ధమైన వేదికగా ఉపయోగించబోతున్నారు. సుమారుగా రెండు వేలకు పైగా పార్టీ ప్రతినిధుల్ని ఈసారి సీపీసీ వేదికగా నియమించబోతున్నారు. ఇందులో 200 మంది శాశ్వత సభ్యులు, 170 మంది ప్రత్యామ్నాయ సభ్యులు ఉంటారని తెలుస్తోంది. ఇక ఈ దఫా కూడా సీపీసీలో 69 ఏళ్ల జిన్‌పింగ్ ఆధిపత్యమే కొనసాగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరో దఫా అంటే ఐదేళ్లు లేదంటే.. మరో పదేళ్లపాటు అధ్యక్ష పదవిలో కొనసాగే విధంగా సీపీసీలో ఆయన తీర్మానం ప్రకటిస్తారనే ఊహాగానాలు బయలుదేరాయి. ఈ గ్యాప్‌లో తన వారసుడిని ఎంచుకునేందుకు తనకు వీలు ఉంటుందని ఆయన భావిస్తున్నట్లు ఆ కథనాల సారాంశం. గతంలో మావో జెడాంగ్ కూడా ఇదే తరహాలో వ్యవహరించాడని, ఒకవేళ జిన్‌పింగ్ గనుక తన వారసుడిని ఎన్నుకున్నప్పటికీ.. ఆ వ్యక్తికి రాజకీయ పలుకబడి ఉంటుందనే గ్యారెంటీ లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. కరోనా నుంచి జిన్‌పింగ్ పట్ల చైనాలో విపరీతమైన ప్రజా వ్యతిరేకత వెల్లువెత్తుతోంది. కఠిన లాక్డౌన్ నిబంధనలతో పరోక్షంగా మరణాలకు కారణం అయ్యాడంటూ ఆయనపై ఆగ్రహంతో ఊగిపోతున్నారు అక్కడి జనాలు. మరోవైపు పాలనాపరంగానూ జిన్‌పింగ్ తీరుపట్ల సీపీసీలోనూ అసంతృప్తి నెలకొందనే ప్రచారం వినిపిస్తోంది. అందుకే మిలిటరీ చీఫ్ చైనాకు అధ్యక్షుడు కాబోతున్నాడంటూ ఇప్పటి నుంచే ఊహాగానాలు మొదలయ్యాయి. -
బైడెన్–జిన్‌పింగ్ వర్చువల్ సమావేశం
బీజింగ్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మధ్య మంగళవారం వర్చువల్ సమావేశం జరగనుంది. రెండు అగ్ర రాజ్యాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో ఈ భేటీ జరుగుతోంది. డొనాల్డ్ ట్రంప్ హయాం నుంచి అమెరికాతో దెబ్బతిన్న వాణిజ్య సంబంధాలు, తైవాన్ అంశం, హాంకాంగ్‌లో ప్రజాస్వామ్య హక్కులు, ఉయ్గుర్లపై అణచివేత తదితర అంశాలు వీరిద్దరి మధ్య చర్చకు వచ్చే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. -
ఎదురులేని నేతగా జిన్‌పింగ్
బీజింగ్: డ్రాగన్ దేశంపై అధ్యక్షుడు జీ జిన్‌పింగ్(68) మరింత పట్టు బిగించారు. చైనా చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఆయన వరుసగా మూడోసారి అధ్యక్షుడిగా కొనసాగేందుకు మార్గం సుగమమైనట్లేనని పరిశీలకులు భావిస్తున్నారు. వందేళ్లలో కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా(సీపీసీ) సాధించిన విజయాలను, జిన్‌పింగ్ నాయకత్వంలో చైనా సాధించిన ఘనతలను, అభివృద్ధిని ప్రస్తుతిస్తూ అధికార సీపీసీ 19వ కేంద్ర కమిటీ ఆరో ప్లీనరీలో చరిత్రాత్మక తీర్మానాన్ని ఆమోదించారు. పార్టీ చరిత్రలో ఇలాంటి తీర్మానం చేయడం ఇది మూడోసారి మాత్రమే కావడం గమనార్హం. రాజధాని బీజింగ్‌లో ఈ నెల 8వ తేదీన ప్రారంభమైన సీపీసీ ప్లీనరీ గురువారం ముగిసింది. నాలుగు రోజులపాటు జరిగిన ఈ కార్యక్రమంలో కీలకమైన అంశాలపై చర్చించారు. కమ్యూనిస్టు పార్టీ శుక్రవారం మీడియా సమావేశంలో పూర్తి వివరాలు వెల్లడించనుంది. ప్లీనరీలో జిన్‌పింగ్ సీపీసీ కేంద్ర కమిటీ పొలిటికల్ బ్యూరో తరపున వర్క్ రిపోర్టు సమర్పించారు. తీర్మానం ముసాయిదాపై మాట్లాడారు. సీపీసీ 20వ జాతీయ సదస్సును(ఐదేళ్లకోసారి జరుగుతుంది) 2022లో జూలై తర్వాత నిర్వహించనున్నారు. మూడోసారి అధ్యక్షుడిగా జిన్‌పింగ్ ఎంపికను ఆ సదస్సులో అధికారికంగా ఆమోదించనున్నారు. ఆయన ప్రస్తుతం కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా ప్రధాన కార్యదర్శిగా, చైనా త్రివిధ దళాల సుప్రీం కమాండర్‌గా(సెంట్రల్ మిలటరీ కమిషన్ చైర్మన్), దేశాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. మూడు అత్యంత శక్తివంతమైన పదవుల్లో ఏకకాలంలో కొనసాగుతున్నారు. రెండోసారి అధ్యక్షుడిగా జిన్‌పింగ్ పదవీ కాలం వచ్చే ఏడాది ముగియనుంది. ఆ వెంటనే మరోసారి అదే పదవిని చేపట్టేందుకు రంగం సిద్ధమైనట్లే. చైనాలో మూడుసార్లు అధ్యక్ష పదవిని అధిష్టించే అవకాశం ఇప్పటిదాకా ఎవరికీ దక్కలేదు. 2018లో చేసిన రాజ్యాంగ సవరణ ప్రకారం జిన్‌పింగ్ జీవితకాలం అధ్యక్ష పదవిలో కొనసాగే వెసులుబాటు కూడా ఉంది. -
మోదీకి జిన్ పింగ్ సానుభూతి సందేశం
బీజింగ్: కరోనాతో భారత్ కొట్టుమిట్టాడుతున్న నేపథ్యంలో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ భారత ప్రధాని మోదీకి సానుభూతి సందేశం పంపించారు. భారత్‌లోని కోవిడ్ పరిస్థితులు తనను ఎంతగానో బాధకు గురిచేస్తున్నాయని అందులో పేర్కొన్నారు. కరోనాతో పోరాడుతున్న భారత్‌కు అన్ని విధాలా సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. మరోవైపు చైనా విదేశాంగ మంత్రి వాంగ్ భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌కు లేఖ రాశారు. కరోనాతో పోరాడుతున్న భారత్‌కు తమ వంతు సహకారం అందిస్తామని అందులో పేర్కొన్నారు. ఏప్రిల్‌లో ఇప్పటికే 26 వేల వెంటిలేటర్లు, ఆక్సిజన్ జనరేటర్లను పంపినట్లు చెప్పారు. Chinese President #XiJinping sends a message of sympathy to Indian Prime Minister Narendra Modi @narendramodi today. — Sun Weidong (@China_Amb_India) April 30, 2021 -
నవశకం
-
డ్రాగన్ దారికొచ్చేనా..!
-
చైనా-పాక్ బంధాన్ని విడదీయలేరు
బీజింగ్: జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370, 35ఏ రద్దు తర్వాత నెలకొన్న ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తున్నామని చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌తో వ్యాఖ్యానించారు. బుధవారం ఆయన ఇక్కడ ఇమ్రాన్‌తో భేటీ అయ్యారు. శాంతియుత చర్చల ద్వారా కశ్మీర్ సమస్యను పరిష్కరించగలమని జిన్‌పింగ్ అభిప్రాయపడ్డారు. చైనా, పాకిస్తాన్ మధ్య స్నేహం ధృడమైనదని.. అంతర్జాతీయ, జాతీయ పరిస్థితులు దీనిని విడదీయలేవని స్పష్టం చేశారు. చైనా, పాక్‌ల మధ్య సహకారం బలంగానే ఉంటుందని పేర్కొన్నారు. కాగా, జిన్‌పింగ్ ఈనెల 11, 12 తేదీల్లో భారత్‌లో పర్యటించనున్నారు. 12న చెన్నైలో జరిగే భారత్–చైనా శిఖరాగ్ర సమావేశంలో ఆయన పాల్గొంటారు. తమిళనాడులోని సుప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలను భారత ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి ఆయన సందర్శిస్తారు. జిన్‌పింగ్ పర్యటన నేపథ్యంలో తమిళనాడులో భద్రతను కట్టుదిట్టం చేశారు. -
చైనా శాశ్వత అధ్యక్షుడిగా జిన్‌పింగ్
బీజింగ్: చైనా అధ్యక్షుడిగా షి జిన్‌పింగ్ రెండోసారి మళ్లీ ఎన్నికయ్యారు. ఆ దేశ రాజ్యాంగంలో అధ్యక్షుడు రెండు సార్లు మాత్రమే పదవిలో ఉండే నిబంధనను ఎత్తివేస్తూ ఇటీవల చైనా పార్లమెంటు సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో రెండో పర్యాయం అధ్యక్షుడిగా ఎన్నికైన జిన్‌పింగ్ (64) అయిదేళ్ల పదవీకాలం ముగిసిన తర్వాత కూడా జీవితకాలం అధ్యక్షుడిగా కొనసాగేందుకు అవకాశం లభించింది. చైనా సెంట్రల్ మిలిటరీ కమిషన్ (సీఎంసీ) అధినేతగా కూడా జిన్‌పింగ్ ఎంపికయ్యారు. ఇప్పటికే ఆయన అధికార చైనా కమ్యూనిస్టు పార్టీ (సీపీసీ) ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. జిన్‌పింగ్ విధేయుడు, సన్నిహితుడు వాంగ్ క్విషాన్ (69) చైనా ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. వాంగ్ ఎన్నికపై పలు విమర్శలు వస్తున్నాయి. 68 ఏళ్లు నిండిన వారు పదవీ విరమణ చేయడం సంప్రదాయం. 69 ఏళ్ల వాంగ్ పదవిలో కొనసాగడాన్ని పలువురు ప్రశ్నిస్తున్నారు. -
జిన్‌పింగ్ కోసం రాజ్యాంగ సవరణ
బీజింగ్: చైనాలో శక్తిమంతమైన నేతగా గుర్తింపు పొందిన జిన్‌పింగ్ చైనా అధ్యక్షుడిగా మరోసారి ఎన్నికయ్యేందుకు పావులు కదుపుతున్నారు. అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవుల్ని ఏ వ్యక్తులైనా రెండుసార్లకు మించి చేపట్టకూడదనే రాజ్యాంగ నిబంధనను తొలగించేందుకు చైనా కమ్యూనిస్ట్ పార్టీ(సీపీసీ) సిద్ధమైంది. సీపీసీకి చెందిన సెంట్రల్ కమిటీ ఈ నిబంధనను రాజ్యాంగం నుంచి తొలగించాలని ప్రతిపాదించింది. ప్రస్తుతం చైనా అధ్యక్షుడిగా ఉన్న జిన్‌పింగ్ పదవీకాలం 2022తో ముగియనుంది. తాజా నిర్ణయం వల్ల జిన్‌పింగ్ చైనా అధ్యక్షుడిగా ఎన్నిసార్లయినా పోటీ చేయవచ్చు. గతేడాది జరిగిన సీపీసీ కాంగ్రెస్ సమావేశాల్లో జిన్‌పింగ్ సిద్ధాంతాల్ని, ఆలోచనా విధానాన్ని రాజ్యాంగంలో చేర్చాలని నిర్ణయం తీసుకుంది. -
చైనా-పాకిస్తాన్ కారి‘డర్’!
పీఓకేలో ఆర్థిక కారిడార్‌పై భారత్ అభ్యంతరం - జీ20లో జిన్‌పింగ్‌తో భేటీలో ప్రధాని మోదీ స్పష్టీకరణ - సత్ససంబంధాల కొనసాగింపుపై ఆసక్తిగా ఉన్నాం: జిన్‌పింగ్ హాంగ్జౌ: పాక్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే) గుండా చైనా, పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్(సీపెక్) నిర్మాణంపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. జీ20 దేశాల సదస్సు సందర్భంగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో భేటీలో ప్రధాని మోదీ ఈ విషయాన్ని లేవనెత్తారు. ఒకరి వ్యూహాత్మక వ్యవహారాల పట్ల మరొకరు జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరముందని మోదీ సూచించారు. రాజకీయ కారణాలతో ఉగ్రవాద వ్యతిరేక పోరు ప్రభావితం కాకూడదని చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌కు మోదీ స్పష్టం చేశారు. దీర్ఘకాల ద్వైపాక్షిక సంబంధాల కోసం ఒకరి ఆకాంక్షలు, ఆందోళనలు, వ్యూహాత్మక అవసరాల్ని మరొకరు గౌరవించడం అత్యంత ముఖ్యమని చర్చల్లో వెల్లడించారు. ఇరు దేశాధినేతల భేటీలో సీపెక్‌పై భారత్ అభ్యంతరం ప్రస్తావనకు వచ్చిందని విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి వికాస్ స్వరూప్ చెప్పారు. దాదాపు రూ. 3,12,800 కోట్లతో అరేబియా సముద్రం గ్వదర్ పోర్టు నుంచి చైనా గ్జిన్జియాంగ్ ప్రావిన్స్‌కు సీపెక్‌ను నిర్మిస్తున్నారు. చమురు, సహజవాయువుల రవాణా కోసం రైలు, రోడ్డు మార్గాల నిర్మాణంతో పాటు ఇంధన ఆధారిత ప్రాజెక్టుల్ని నిర్మిస్తారు. ‘ఇరు దేశాల మధ్య వ్యతిరేక దృక్పథం పెరుగుదల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని మోదీ పిలుపునిచ్చారు. సరిహద్దు వివాదంలో శాంతి, సంయమనం పాటించడంలో ఇరు దేశాలు విజయవంతమైన విషయాన్ని కూడా గుర్తుచేశారు. ఇటీవల కిర్గిస్తాన్ రాజధాని బిష్కెక్లోని చైనా రాయబార కార్యాలయంలో బాంబు దాడిని ప్రధాని ఖండించారు. ఉగ్రవాద ముప్పు కొనసాగుతుందనడానికి ఆ సంఘటన ఉదాహరణగా ఆయన పేర్కొన్నారు’ అని స్వరూప్ విలేకరులకు చర్చల సారాంశాన్ని వెల్లడించారు. ఎన్ఎస్జీలో భారత్ సభ్యత్వంపై చైనా అభ్యంతరాన్ని మోదీ లేవనెత్తారా? అన్న ప్రశ్నకు సమాధానమిచ్చేందుకు నిరాకరించారు. ‘భేటీలో జరిగిన ప్రతి అంశంపై మాట్లాడలేను. మోదీ-జిన్‌పింగ్ చర్చలు రెండు దేశాల మధ్య జరిగిన ఉన్నతస్థాయి సమావేశం. అన్ని సంబంధాలపై సలహాలు, దిశానిర్దేశం కోసం వీటిని నిర్వహిస్తారు. భారత్- చైనా సంబంధాలపై వ్యూహాత్మక వైఖరిని అవలంభిస్తామని మోదీ ఎప్పుడూ చెపుతుండేవారు. భారత్, చైనాల భాగస్వామ్యం రెండు దేశాలకే కాకుండా ఈ ప్రాంతానికి, ప్రపంచానికి కీలకం. ఆ దేశంతో సన్నిహత సంబంధాలు, అభివృద్ధి భాగస్వామ్యం కోసం భారత్ కృషిచేసింది. సాంస్కృతిక, ప్రజా సంబంధాలు కూడా పెరిగాయి’ అని స్వరూప్ పేర్కొన్నారు. ఉన్నతస్థాయి చర్చలు కొనసాగాలి: జిన్‌పింగ్ సత్ససంబంధాల్ని కొనసాగించేందుకు, ద్వైపాక్షిక సహకారంలో మరింత ప్రోత్సాహానికి చైనా ఆసక్తిగా ఉందన్న విషయాన్ని మోదీకి జిన్‌పింగ్ వెల్లడించారని ఆ దేశ వార్తా సంస్థ జిన్హువా పేర్కొంది. ముఖ్య విషయాల్లో చైనా, భారత్‌లు ఒకరినొకరు గౌరవించుకోవాలని, జాగ్రత్తగా మెలగాలని చైనా అధినేత స్పష్టం చేశారని, అభివృద్ధి చెందుతున్న ఇరుగు పొరుగు దేశాలు కావడంతో ఉన్నత స్థాయి దౌత్య చర్చలు కొనసాగించాలన్నారని జీ ఆకాంక్షించారంటూ ఆ పత్రిక వెల్లడించింది. వివిధ స్థాయిలో, వివిధ ప్రాంతాల్లో చైనా-భారత్‌లు చర్చలు కొనసాగించాలని, అవగాహన, నమ్మకం నెలకొనేలా ప్రధాన అంశాల్లో ఉమ్మడి ఆసక్తులపై తరచుగా అభిప్రాయాలు పంచుకోవాలని జిన్‌పింగ్ అభిలషించారని తెలిపింది. అభివృద్ధి వ్యూహాల అమలుకు ఉమ్మడిగా పనిచేయాలని, మౌలిక సదుపాయాల కల్పన, ఉత్పత్తి అంశాల్లో కార్యసాధక సహకారం కోసం చర్చలు కొనసాగాలని చైనా అధ్యక్షుడు ఆకాక్షించారు. ఈ సందర్భంగా చైనా కంపెనీలు భారత్‌లో పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహిస్తామని మోదీకి హామీనిచ్చారు. మోదీకి కానుకగా చైనీస్ అనువాదాలు చైనా చిత్రకారుడు షెన్ షూ వేసిన మోదీ ఆయిల్ పెయింటింగ్‌ను ప్రధాని నరేంద్ర మోదీకి కానుకగా ఇచ్చారు. అలాగే భగవద్గీత, స్వామి వివేకానంద వ్యాసాలు సహా 10 ప్రముఖ భారతీయ రచన చైనీస్ అనువాద ప్రతుల్ని కూడా అందచేశారు. వీటిని పెకింగ్ యూనివర్సిటీలో హిందీ బోధించే ప్రొఫెసర్ వాంగ్ జీచెంగ్ చైనీస్‌లోకి అనువ దించారు. అనువాదాల్లో పతంజలి యోగా సూత్రాలు, నారద భక్తి సూత్రాలు, యోగా వశిష్ఠలు కూడా ఉన్నాయి. చర్చలు సరిపోవు.. కార్యాచరణ అవసరం ఆర్థిక మందగమనంపై జీ 20 సదస్సులో మోదీ హాంగ్జౌ: ప్రపంచ ఆర్థిక మందగమనంపై పోరులో తీవ్ర స్థాయి చర్చలు సరిపోవని జీ20 సదస్సులో ప్రధాని మోదీ అన్నారు. కలిసికట్టుగా, సమన్వయంతో సాగుతూ... లక్ష్య శుద్ధితో కూడిన కార్యచరణతో ప్రపంచ ఆర్థిక వృద్ధిని పునరుద్ధరించేలా జీ 20 దేశాలు ప్రయత్నించాలని కోరారు. ‘ ప్రపంచం సంక్లిష్ట రాజకీయ, ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటోన్న వేళ మనం సమావేశమయ్యాం. ఈ సమస్యల పరిష్కారానికి మేధోమథన చర్చలు కూడా సరిపోవు. ప్రపంచ ఆర్థిక వృద్ధి పట్టాలెక్కేలా నిర్మాణాత్మక సంస్కరణలపై నేను ఒక అజెండా రూపొందించా. ఆర్థిక వ్యవస్థల్ని మెరుగుపర్చడం, దేశీయ ఉత్పత్తికి ఊతం, మౌలిక రంగంలో పెట్టుబడులు పెంచడం, నైపుణ్య శిక్షణ ఇవ్వాల్సిన అవసరముంది. మన సవాళ్లు ఎప్పుడూ ఉంటాయి. అలాగే అవకాశాలు కూడా... తర్వాతి తరం ప్రపంచ అభివృద్ధికి సాంకేతిక అనుసంధానం, డిజిటల్ విప్లవం, నూతన ఆవిష్కరణలు పునాది వేస్తాయి. అందరి ప్రయోజనం కోసం జీ 20 నిర్ణయాత్మకంగా పనిచేయాలి’ అని మోదీ పిలుపునిచ్చారు. ప్రపంచ జీడీపీలో 85 శాతంజీ 20 దేశాలదే... అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, భారత్, ఇండోనేసియా, జపాన్, ఇటలీ, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, దక్షిణ కొరియా, టర్కీ, బ్రిటన్, యూరోపియన్ యూనియన్లు సభ్యులుగా ఉన్నాయి. అధిక ఉక్కు ఉత్పత్తిపై చర్యలు: ఈయూ ఉక్కు అధికోత్పత్తిపై చైనా చర్యలు తీసుకోవాలంటూ యూరోపియన్ యూనియన్ నేతలు జీ 20 సదస్సులో కోరారు. యాపిల్ సంస్థ నుంచి ఐర్లాండ్ పన్నులు వసూలు చేయాలన్న తీర్పును కూడా ఈయూ సమర్ధించింది. అధిక ఉక్కు ఉత్పత్తిపై అమెరికా, చైనా, జర్మనీ సహా ఇతర ముఖ్య ఆర్థిక వ్యవస్థలు తక్షణం పరిష్కారం కనుగొనాలని ఈయూ అధ్యక్షుడు జీన్ క్లౌడ్ జంకెర్ కోరారు. యాపిల్ నుంచి పన్ను వసూలు తీర్పును అమెరికా విమర్శించడాన్ని జంకర్ తోసిపుచ్చారు. పాక్-చైనా రక్షణ బంధం ఇస్లామాబాద్: చైనాతో దీర్ఘకాల రక్షణ సంబంధాలకోసం కుదుర్చుకునే ఒప్పందానికి పాకిస్తాన్ కేబినెట్ ఆదివారం ఆమోదముద్ర వేసింది. భారత్-అమెరికా సంబంధాలు బలోపేతమవుతున్న నేపథ్యంలోనే పాక్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వివిధ రంగాల్లో పరస్పర సహకారంతోపాటు రక్షణ, భద్రత రంగాల్లో చైనాతో దీర్ఘకాల ఒప్పందాలు చేసుకోవటంపైనే సమావేశంలో చర్చ జరిగినట్లు తెలిసింది. -
ప్రపంచ అగ్రనేతగా జీ జిన్‌పింగ్
బీజింగ్: చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ప్రపంచంలో అగ్రనేతగా అవతరించారని ఆ దేశ అధికార మీడియా పేర్కొంది. వేల కోట్ల విలువైన సిల్క్ రోడ్ ప్రాజెక్టు సహా అనేక కీలక ప్రాజెక్టులను ఆయన ప్రారంభించారంది. ఆయన అధ్యక్షతన విదేశాలతో చైనా దౌత్య సంబంధాలు గణనీయంగా మెరుగుపడ్డాయంటూ ఒక సమగ్ర నివేదికను విడుదల చేసింది. సిల్క్‌రోడ్ ప్రాజెక్టు, ఆసియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు, వాతావరణ మార్పులపై పారిస్ ఒప్పందాన్ని సమర్థించడం తదితరాలను ఆయన విజయాలుగా వర్ణించింది. -
అధ్యక్షుడు 'రాజీనామా' అంటూ కలకలం..
బీజింగ్: ఓ చైనా వార్త సంస్థ ఆ దేశాధ్యక్షుడు జీ జిన్‌పింగ్ 'రాజీనామా' అంటూ పొరపాటున ఓ వార్త రాయడం కలకలం రేపింది. ఈ తప్పిదానికి బాధ్యులైన నలుగురు ఉద్యోగులను ఆ వార్త సంస్థ యాజమాన్యం విధుల నుంచి తొలగించింది. గతవారం జొహాన్నెస్‌బర్గ్‌లో జరిగిన చైనా-ఆఫ్రికా సదస్సులో జీ జిన్‌పింగ్ పాల్గొన్నారు. చైనా అధ్యక్షుడి ప్రసంగాన్ని కవర్ చేస్తూ చైనా న్యూస్ సర్వీస్ ఓ కథనం రాసింది. అయితే చైనీస్ భాషలో అధ్యక్షుడి 'ప్రసంగం' అనే పదాన్ని పొరపాటుగా 'రాజీనామా' అంటూ టైప్ చేశారు. రెండు చైనీస్ క్యారెక్టర్లు తప్పుదొర్లడంతో ప్రసంగం అనే పదం అర్థం మారిపోయి రాజీనామా అయ్యింది. గత శుక్రవారం ఈ తప్పిదం చోటు చేసుకుంది. ఆ వార్త సంస్థ ఈ తప్పిదాన్ని సరిచేసినా కొన్ని వెబ్సైట్లు ఆ వార్తను యథాతథంగా ప్రచురించడంతో దుమారం చెలరేగింది. -
ముందు ‘సరిహద్దు’ను తేల్చాలి
చైనా అధ్యక్షుడికి ప్రధాని మోదీ స్పష్టీకరణ న్యూఢిల్లీ: చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌కు బుధవారం తన సొంత రాష్ట్రం గుజరాత్లో ఆత్మీయ ఆతిథ్యం ఇచ్చిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. గురువారం ఆయనతో జరిపిన సుదీర్ఘ చర్చల్లో చైనాతో సరిహద్దు సమస్యలను నిర్మొహమాటంగా ప్రస్తావించారు. భారత భూభాగంలోకి చైనా వైపు నుంచి చొరబాట్లు పునరావృతం అవుతుండటం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. సరిహద్దుల్లో శాంతి, సామరస్యమే ఇరు దేశాల మధ్య విశ్వాసానికి పునాది అవుతుందని స్పష్టంచేస్తూ.. సరిహద్దుకు సంబంధించి శాంతి ఒప్పందాన్ని ఖచ్చితంగా పాటించాల్సిందేనని తేల్చిచెప్పారు. అపరిష్కృతంగా ఉన్న వాస్తవాధీన రేఖపై స్పష్టత అంశాన్ని త్వరగా తేల్చాలని కోరారు. ఇందుకు జిన్‌పింగ్ సానుకూలంగా స్పందిస్తూ.. సరిహద్దు సమస్యలను స్నేహపూర్వక సంప్రదింపుల ద్వారా సత్వరమే పరిష్కరించుకునేందుకు చైనా కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు. మూడు రోజుల భారత పర్యటన నిమిత్తం బుధవారం అహ్మదాబాద్‌లో పర్యటించిన జిన్‌పింగ్ గురువారం ఢిల్లీలో ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. కొద్ది రోజులుగా లడఖ్ వద్ద చైనా సైనికులు, పౌరులు తాజాగా భారత భూభాగంలోకి చొరబాట్లకు పాల్పడుతున్న నేపధ్యంలో.. మోదీ సరిహద్దు అంశాన్ని ప్రస్తావించారు. దాదాపు మూడు గంటల పాటు సాగిన ఈ శిఖరాగ్ర సమావేశంలో ఇరువురు నేతలూ కొంత సేపు ఏకాంతంగా ముఖాముఖి చర్చించుకున్నారు. ప్రతినిధుల స్థాయి చర్చలూ నిర్వహించారు. వాణిజ్యం, ఆర్థిక రంగాల్లో సహకారంపై ఒప్పందాలకు సంబంధించి మంతనాలు జరిపారు. అయితే.. చుమార్, దేమ్‌చోక్ సెక్టార్లలో బుధవారం రాత్రి, గురువారం ఉదయం తాజా చొరబాట్లు చోటు చేసుకోవటంతో వీరి చర్చలు ప్రధానంగా సరిహద్దు సంఘటనల చుట్టూతా తిరిగినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా వచ్చే ఐదేళ్లలో భారత్‌లో 2,000 కోట్ల డాలర్లను పెట్టుబడులుగా పెట్టాలని చైనా నిర్ణయించింది. దానితో పాటు మొత్తం 12 ఒప్పందాలపై ఇరు దేశాలూ సంతకాలు చేశాయి. అయితే.. ఇటీవల మోదీ జపాన్ పర్యటనలో ఆ దేశంతో 3,500 కోట్ల డాలర్ల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు జరిగాయి. జిన్‌పింగ్ భారత పర్యటనలో అంతకన్నా చాలా ఎక్కువ పెట్టుబడులకు ఒప్పందాలు కుదురుతాయని ప్రభుత్వ వర్గాలు ఆశించాయి. కానీ జపాన్ కన్నా చాలా తక్కువ స్థాయిలో పెట్టుబడులకు ఒప్పందాలు కుదరటం ఆ వర్గాలను నిరాశపరిచింది. భేటీ అనంతరం చైనా అధ్యక్షుడితో కలిసి ప్రధాని మోదీ మీడియాతో మాట్లాడుతూ.. జిన్‌పింగ్ భారత పర్యటన ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడటానికి ఒక చరిత్రాత్మక అవకాశమని అభివర్ణించగా.. భారత్, చైనాలు ఏకం కావటం ఆసియాకు అతి పెద్ద ఘటన అని జిన్‌పింగ్ అభివర్ణించారు. ఇరుగుపొరుగు వారి మధ్య సమస్యలు ఉంటాయని.. అయితే కేవలం ఈ విభేదాల మీద మాత్రమే దృష్టి కేంద్రీకరించరాదని ఆయన వ్యాఖ్యానించారు. మహాత్ముడికి జిన్‌పింగ్ నివాళి చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు గురువారం ఉద యం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ ఆవరణలో అధికార లాంఛనాలతో స్వాగతం పలికారు. ఆయన ఆ తర్వాత రాజ్‌ఘాట్‌ను సందర్శించి మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. ఉదయం 9:30 గంటలకు తన భార్య పెంగ్ లియువాన్‌తో కలిసి రాజ్‌ఘాట్‌కు చేరుకున్న జిన్‌పింగ్ అక్కడ స్మారక చిహ్నంపై పూలగుచ్ఛం ఉంచి పది నిమిషాల పాటు గడిపారు. సందర్శకుల పుస్తకంలో జిన్‌పింగ్ మండారిన్ భాషలో వ్యాఖ్యలు రాశారు. గురువారం దేశ రాజధానిలోని పలు ప్రాంతాల్లో జిన్‌పింగ్ ప్రయాణాలు, ఆయనకు వ్యతిరేకంగా టిబెటన్ల నిరసన ప్రదర్శనల ఫలితంగా గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోయింది. ఐదేళ్లలో 2,000 కోట్ల డాలర్ల పెట్టుబడులు జిన్‌పింగ్, మోదీల శిఖరాగ్ర చర్చల అనంతరం భారత్‌లో రెండు పారిశ్రామిక పార్కుల ఏర్పా టు, రైల్వేల్లో పెట్టుబడులు పెట్టడం సహా పలు అంశాలపై రెండు దేశాలూ 12 ఒప్పందాలపై సంతకాలు చేశాయి. భారత్, చైనాల మధ్య పౌర అణు ఇంధన సహకారంపై రెండు దేశాలూ చర్చలు ప్రారంభించాలని జిన్‌పింగ్‌తో భేటీ సందర్భంగా నిర్ణయించినట్లు మోదీ ప్రకటించారు. ‘‘పౌర అణు ఇంధన సహకారంపై మేం చర్చల ప్రక్రియను ప్రారంభిస్తాం. ఇది ఇంధన భద్రతపై రెండు దేశాల మధ్య విస్తృత సహకారానికి మరింత ఉత్తేజాన్నిస్తుంది’’ అని ఆయన జిన్‌పింగ్‌తో కలిసి మీడియాతో మాట్లాడుతూ పేర్కొన్నారు. * భారత్ - చైనాల మధ్య ఐదేళ్ల వాణిజ్య, ఆర్థిక సహకారంపై ఒప్పందం కుదిరింది. దీనిప్రకారం చైనా వచ్చే ఐదేళ్లలో భారత్‌లో 2,000 కోట్ల డాలర్లు పెట్టుబడులుగా పెడుతుంది. * భారత తీర్థయాత్రికుల వార్షిక కైలాస్ మానస సరోవర్ యాత్ర కోసం.. ప్రస్తుతం ఉత్తరాఖండ్ నుంచి లిపులేఖ్ మార్గంతో పాటు.. సిక్కింలోని నాథులా మార్గం ద్వారా కూడా వెళ్లేందుకు చైనాతో భారత్ అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంపై భారత విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి సంతకాలు చేశారు. దీనిద్వారా మానస సరోవర్ యాత్రలో దూరం, సమయం, కష్టతరమైన ప్రయాణం గణనీయంగా తగ్గిపోనున్నాయి. * భారతీయ రైల్వే వ్యవస్థను పరిపుష్టం చేసేందుకు చైనా అంగీకరించింది. ఇందుకు సంబంధించి ఇరు దేశాల మధ్య రెండు ఒప్పందాలు కుదిరాయి. రైళ్ల వేగాన్ని పెంచటం, హైస్పీడ్ రైలు మార్గాలపై సహకారానికి గల అవకాశాలను అధ్యయనం చేయటం, రైల్వే స్టేషన్ల పునర్అభివృద్ధికి సంబంధించిన ఒప్పందాలివి. * ఇరు దేశాలకు చెందిన ప్రొడ్యూసర్లు (నిర్మాతలు) తమ సృ జనాత్మక, కళాత్మక, సాంకేతిక, ఆర్థిక, మార్కెటింగ్ వనరులను సమీకృతం చేసుకుని ఉమ్మడిగా సినిమాలు నిర్మించేందుకు వీలుగా ఒప్పందం కుదిరింది. * సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా సీమాంతర ఆర్థిక నేరాలు, కస్టమ్స్ నేరాలపై పోరాటంలో సహకారాన్ని పెంపొందించుకోవటం లక్ష్యంగా కస్టమ్స్ పరిపాలనకు సంబంధించి భారత్, చైనాలు మరొక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. * అంతరిక్షాన్ని శాంతియుతంగా వినియోగించుకోవటంలో సహకారానికి సంబంధించి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)కు, చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ విభాగానికి మధ్య ఒక అవగాహనా ఒప్పందం కుదిరింది. * రెండు దేశాలకు చెందిన వివిధ సాంస్కృతిక సంస్థల మధ్య దీర్ఘకాలిక భాగస్వామ్యాన్ని పెంపొందించుకునేందుకు మరొక అవగాహనా ఒప్పందం కుదిరింది. ఇందులో ప్రదర్శనశాలలు, పురావస్తు సంస్థలు, కళాసాంస్కృతిక సంస్థలు ఉన్నాయి. * ఔషధాల ప్రమాణాలు, సంప్రదాయ ఔషధాలు, ఔషధాల పరీక్షల రంగాల్లో కూడా సహకారం పెంపొందించుకోవాలని ఇరు దేశాలూ నిర్ణయించాయి. * మహారాష్ట్రలోని ముంబై నగరానికి చైనాలోని షాంఘై నగరానికి మధ్య సహోదర సంబంధాన్ని నెలకొల్పేందుకు మరొక ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ఇరు దేశాల ప్రజల రాకపోకలను పెంపొందిస్తుంది. చైనా అధ్యక్షుడికి దలైలామా ప్రశంసలు ముంబై: భారత పర్యటనలో ఉన్న చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌కు అనూహ్యంగా.. టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామా నుంచి ప్రశంసలు లభించాయి. జిన్‌పింగ్ విశాల దృక్పథం ఉన్న, వాస్తవికవాది అని టిబెట్ నుంచి బహిష్కారానికి గురై భారత్‌లో ప్రవాసముంటున్న దలైలామా కీర్తించారు. సుహృద్భావమనేది విశ్వాసం ద్వారానే తేవచ్చునని.. భయం ద్వారా కాదని వ్యాఖ్యానించారు. చైనా కొత్త నాయకత్వంపై తనకు విశ్వాసముందన్నారు. భారత్‌కు స్ఫూర్తి చైనా!: ప్రణబ్ చైనా అధ్యక్షుడికి భారత రాష్ట్రపతి విందు న్యూఢిల్లీ: లడఖ్‌లో భారత్, చైనా సైనిక దళాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో.. ఇరుదేశాల మధ్య సరిహద్దుల్లో శాంతి నెలకొనేలా, పొరపాట్లకు తావులేని చర్చల ప్రక్రియ కొనసాగాలన్న ఆశాభావాన్ని భారత రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ వ్యక్తంచేశారు. సరిహద్దు సమస్య సహా ఇరుదేశాల మధ్య ఉన్న అన్ని సమస్యల సామరస్య పరిష్కారాన్ని భారత్, చైనాలు కోరుకుంటున్నాయన్నారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ గౌరవార్ధం ఆయన గురువారం ఒక విందును ఏర్పాటు చేశారు. చైనా సాధిస్తున్న ఆర్థికాభివృద్ధిని చూసి భారత్ స్ఫూర్తి పొందుతోందన్నారు. ఇరుదేశాల మధ్య కుదిరిన ఒప్పందాలపై రాష్ట్రపతి సంతోషం వ్యక్తం చేశారు. లడఖ్ నుంచి చైనా దళాల ఉపసంహరణ ఈశాన్య లడఖ్‌లోని చుమర్ ప్రాంతం వద్ద భారత భూభాగంలోకి చొచ్చుకువచ్చి, గత నాలుగు రోజులుగా తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైన చైనా సైనిక దళాలు గురువారం రాత్రి భారత్ భూభాగం నుంచి వెనక్కు మరలాయి. రాత్రి 9.45 నుంచి చైనా దళాల ఉపసంహరణ ప్రారంభమైందని భారత అధికార వర్గాలు వెల్లడించాయి. అక్కడే పెద్ద సంఖ్యలో ఉన్న భారత దళాలు కూడా క్రమంగా వెనక్కు వెళ్తున్నాయని తెలిపాయి. చైనా దళాలు వాస్తవాధీన రేఖకు కాస్త ఆవలగానే ఉంటున్నందున భారత దళాలు కూడా అప్రమత్తంగానే ఉన్నాయని పేర్కొన్నాయి. అయితే, చైనా సంచార జాతులైన ‘రెబో’లు భారత భూభాగంలోని దెమ్చాక్లో గత 12 రోజులుగా గుడారాలు వేసుకుని ఉంటున్న విషయంలో నెలకొన్న ప్రతిష్టంభన మాత్రం కొనసాగుతోంది. -
భారత్‌కు చేరుకున్న చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్
-
భారత్ పర్యటనకు వచ్చిన చైనా అధ్యక్షుడు
అహ్మదాబాద్: చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ భారత్ పర్యటనకు వచ్చారు. బుధవారం ఆయన అహ్మదాబాద్ చేరుకున్నారు. అహ్మదాబాద్ విమానాశ్రయంలో జిన్‌పింగ్ బృందానికి ఘనస్వాగతం లభించింది. చైనా అధ్యక్షుడు భారత్‌లో మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. భారత్‌తో పలు ఒప్పందాలపై సంతకాలు చేయనున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ స్వరాష్ట్రమైన గుజరాత్‌కు జిన్ రావడం విశేషం. మోడీ, జిన్ ఇద్దరూ పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. -
భారత్‌లో నేటి నుండి జిన్‌పింగ్ పర్యటన
-
చైనాతో బంధాలు బలోపేతం
జిన్‌పింగ్ పర్యటనపై మోడీ ఆశాభావం న్యూఢిల్లీ: చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ చేపట్టనున్న భారత పర్యటన ఇరు దేశాల సంబంధాలను బలోపేతం చేస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ఈ నెల 17న అహ్మదాబాద్‌లో ఆయనకు స్వాగతం పలికేందుకు ఎదురుచూస్తున్నానని సోమవారం ట్విట్టర్లో తెలిపారు. బౌద్ధమతంతో గట్టి అనుబంధమున్న ఉభయ దేశాల బంధాలు జిన్‌పింగ్ పర్యటనతో పటిష్టమవుతాయన్నారు. గుజరాత్‌లోని బౌద్ధక్షేత్రాల చిత్రాలను ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. వీటిలో ఆయన స్వస్థలమైన వాద్నగర్లో జరిపిన తవ్వకాల చిత్రాలూ ఉన్నాయి. ‘నేను జన్మించిన వాద్నగర్ కూడా బౌద్ధమత ప్రభావం గల ప్రాంతమే. గుజరాత్లో చాలా బౌద్ధమఠాలు, సన్యాసులు ఉన్నట్లు చైనా యాత్రికుడు హుయాన్ త్సాంగ్ చెప్పారు’ అని తెలిపారు. కాగా, మోడీ అహ్మదాబాద్‌లో ఈ నెల 17న సబర్మతి నది ఒడ్డున జిన్‌పింగ్‌కు వ్యక్తిగత విందు ఇవ్వనున్నారు. 50 ఏళ్ల కిందట అప్పటి చైనా ప్రధాని చౌ ఎన్‌లైకి కూడా నాటి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పంజాబ్‌లోని నంగల్‌లో సట్లేజ్ ఒడ్డున విందు ఇచ్చారు. పర్యటనలో సరిహద్దు వివాదంపై చర్చ జిన్‌పింగ్ పర్యటన సందర్భంగా సరిహద్దు వివాదంపై చర్చించనున్నట్లు భారత్ తెలిపింది. ఇరు దేశాల ఆందోళనలకు పరిష్కారం లభిస్తుందని, సరిహద్దు వివాదం వంటివాటిపై చ ర్చ జరుగుతుందని ఆశిస్తున్నట్లు పేర్కొంది. కాగా, భారత రైల్వే ఆధునీకరణ, పారిశ్రామిక రంగాల్లో 10 వేల కోట్ల డాలర్ల నుంచి 30 వేల కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు చైనా సిద్ధంగా ఉన్నట్లు ఆ దేశ అధికారులు తెలిపారు. లడఖ్‌లో చొరబాట్లు లేహ్: ఓ పక్క చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ భారత్ పర్యటనకు సిద్ధమవుతుండగా, మరోపక్క ైచె నా పౌరులు పెద్ద సంఖ్యలో భారత్‌లోకి చొరబడ్డారు. జమ్మూకాశ్మీర్ లడఖ్ ప్రాంతంలోని డెమ్చోక్లోకి చైనా పౌరులు తమ ప్రభుత్వ వాహనాల్లో అక్రమంగా ప్రవేశించారు. అక్కడ సాగునీటి ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో ఉన్న స్థానికులు అడ్డుకున్నారు. వీరిని వాస్తవాధీన రేఖ అవతలి తోషిగాంగ్ గ్రామం నుంచి వాహనాల్లో తీసుకొచ్చారని, వారం నుంచి చైనా ఈ ప్రాజెక్టు పనులకు అభ్యంతరం చెబుతోందని లేహ్ డిప్యూటీ కమిషనర్ సిమ్రాన్‌దీప్ సింగ్ చెప్పారు. చైనా ఆర్మీ ఈ ప్రాజెక్టు పనులను అడ్డుకున్నట్లు ఇదివరకే వార్తలు వచ్చాయి. అయితే ఈ ఉదంతాన్ని భారత విదే శాంగ శాఖ తక్కువ చేసి చూపేందుకు ప్రయత్నించింది. సరిహద్దు వివాదంపై చైనాతో చర్చిస్తామని పేర్కొంది.