బీజింగ్: చైనా అధ్యక్షుడిగా షి జిన్‌పింగ్ రెండోసారి మళ్లీ ఎన్నికయ్యారు. ఆ దేశ రాజ్యాంగంలో అధ్యక్షుడు రెండు సార్లు మాత్రమే పదవిలో ఉండే నిబంధనను ఎత్తివేస్తూ ఇటీవల చైనా పార్లమెంటు సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో రెండో పర్యాయం అధ్యక్షుడిగా ఎన్నికైన జిన్‌పింగ్ (64) అయిదేళ్ల పదవీకాలం ముగిసిన తర్వాత కూడా జీవితకాలం అధ్యక్షుడిగా కొనసాగేందుకు అవకాశం లభించింది.
చైనా సెంట్రల్ మిలిటరీ కమిషన్ (సీఎంసీ) అధినేతగా కూడా జిన్‌పింగ్ ఎంపికయ్యారు. ఇప్పటికే ఆయన అధికార చైనా కమ్యూనిస్టు పార్టీ (సీపీసీ) ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. జిన్‌పింగ్ విధేయుడు, సన్నిహితుడు వాంగ్ క్విషాన్ (69) చైనా ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. వాంగ్ ఎన్నికపై పలు విమర్శలు వస్తున్నాయి. 68 ఏళ్లు నిండిన వారు పదవీ విరమణ చేయడం సంప్రదాయం. 69 ఏళ్ల వాంగ్ పదవిలో కొనసాగడాన్ని పలువురు ప్రశ్నిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment