
ఇమ్రాన్‌ఖాన్, జిన్‌పింగ్
బీజింగ్: జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370, 35ఏ రద్దు తర్వాత నెలకొన్న ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తున్నామని చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌తో వ్యాఖ్యానించారు. బుధవారం ఆయన ఇక్కడ ఇమ్రాన్‌తో భేటీ అయ్యారు. శాంతియుత చర్చల ద్వారా కశ్మీర్ సమస్యను పరిష్కరించగలమని జిన్‌పింగ్ అభిప్రాయపడ్డారు. చైనా, పాకిస్తాన్ మధ్య స్నేహం ధృడమైనదని.. అంతర్జాతీయ, జాతీయ పరిస్థితులు దీనిని విడదీయలేవని స్పష్టం చేశారు. చైనా, పాక్‌ల మధ్య సహకారం బలంగానే ఉంటుందని పేర్కొన్నారు.
కాగా, జిన్‌పింగ్ ఈనెల 11, 12 తేదీల్లో భారత్‌లో పర్యటించనున్నారు. 12న చెన్నైలో జరిగే భారత్–చైనా శిఖరాగ్ర సమావేశంలో ఆయన పాల్గొంటారు. తమిళనాడులోని సుప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలను భారత ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి ఆయన సందర్శిస్తారు. జిన్‌పింగ్ పర్యటన నేపథ్యంలో తమిళనాడులో భద్రతను కట్టుదిట్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment