పాట్నా: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి వ్యాప్తికి చైనా కారణమంటూ ఆ దేశాధ్యక్షుడు జి జిన్‌పింగ్‌పై కేసు నమోదైంది. బిహార్‌లోని పశ్చిమ చంపారన్ జిల్లా కోర్టులో కేసు నమోదు చేశారు. కరోనా వ్యాప్తికి చైనాను సూత్రధారిగా చేస్తూ.. ఆ దేశాధ్యక్షుడు జి జిన్‌పింగ్, ప్రపంచ దేశాలకు సరైన సమాచారం అందించడంలో విఫలమైనందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్‌పై బీహార్‌కు చెందిన న్యాయవాది మురాద్ అలీ స్థానిక కోర్టులో ఫిర్యాదు చేశారు. ఈ కేసు జూన్ 16వ తేదీన విచారణకు రానుంది.
పిటిషన్‌లో చైనా వైరస్ వ్యాప్తి చేసిందనడానికి ప్రధాన సాక్షులుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీలను పేర్కొన్నారు. ఐపీసీ 269, 270, 302, 307, 500, 504, 120బి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే.. 2019 డిసెంబర్‌లో కరోనా వైరస్ వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుంచి.. ప్రపంచంలోని అనేక దేశాలు ఈ వైరస్‌కి చైనాను బాధ్యులుగా చేశాయి. కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది మరణాలకు దారితీసింది. ఇది వ్యాపార, వాణిజ్య సముదాయాలు, మానవాళి జీవనశైలిని ప్రభావితం చేసిన సంగతి తెలిసిందే. చదవండి: కరోనా కేసుల్లో బ్రిటన్‌ను దాటేసిన భారత్
Comments
Please login to add a commentAdd a comment