మోదీ ప్రశంసించారు : డొనాల్డ్‌ ట్రంప్‌ | Donald Trump Says Narendra Modi Calls Him | Sakshi
Sakshi News home page

మోదీ ప్రశంసించారు : డొనాల్డ్‌ ట్రంప్‌

Sep 14 2020 1:28 PM | Updated on Sep 14 2020 2:17 PM

Donald Trump Says Narendra Modi Calls Him   - Sakshi

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌  ప్రధానమంత్రి నరేంద్రమోదీ తనకు ఫోన్‌ చేశారని తెలిపారు. కరోనా టెస్ట్‌ల విషయంలో ఆయన గొప్పగా వ్యవహరించారంటూ ప్రశంసించారని తెలిపారు. అమెరికాలో ఎన్నికల వేడి రోజురోజుకు పెరుగుతోంది.  ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, ఆయన పోటీదారుడు జో బైడెన్ (డెమోక్రాట్ అభ్యర్థి)ల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలతో వాతావారణం వేడెక్కింది. కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో ట్రంప్ పూర్తిగా విఫలమయ్యారని, ఆ కారణంగా అనేక మంది అమెరికన్‌ పౌరులు ప్రాణాలు కోల్పోయారని బైడెన్ విమర్శించారు. ఈ విమర్శలపై స్పందించిన ట్రంప్‌ కరోనాను ఎదుర్కోవడంలో, కరోనా టెస్ట్‌ల విషయంలో గొప్పగా వ్యవహరించానని మోదీ ఫోన్‌ చేసి కితాబిచ్చారని ట్రంప్‌ తెలిపారు.

ఇండియా కంటే ఎక్కువ కరోనా టెస్టులు చేశామని,  భారత్‌ కంటే 44 మిలియన్ల టెస్టులను అధికంగా చేశామని చెప్పారు. ఈ నేపథ్యంలో భారత ప్రధాని మోదీ తనకు ఫోన్ చేసి ప్రశంసించారని చెప్పారు. ఇదే విషయాన్ని నిజాయతీ లేని తమ దేశ మీడియాకు చెప్పాలని మోదీని తాను కోరారని ట్రంప్ అన్నారు. చైనా వైరస్ (కరోనా) అమెరికాలోకి ప్రవేశించే సమయంలో బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా ఉండి ఉన్నట్టైతే... అదనంగా మరి కొన్ని వేల మంది అమెరికన్లు మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయేవారని ట్రంప్ ఎద్దేవా చేశారు. బలహీనమైన ప్రభుత్వంలో బైడెన్ ఉపాధ్యక్షుడిగా ఉన్నారని, వారి హయాంలో అమెరికా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని మండిపడ్డారు. 

చదవండి: పశ్చిమం వైపు ట్రంప్‌ చూపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement