ఇక్కడకు మీరొచ్చి చేసేదేమిటి...! | TPCC leaders Sympathy Senior MLA Ramreddy Venkatareddy | Sakshi
Sakshi News home page

ఇక్కడకు మీరొచ్చి చేసేదేమిటి...!

Published Sun, May 8 2016 4:03 AM | Last Updated on Sun, Sep 3 2017 11:37 PM

ఇక్కడకు మీరొచ్చి చేసేదేమిటి...!

ఇక్కడకు మీరొచ్చి చేసేదేమిటి...!

టీపీసీసీ నాయకులకు కొత్త ప్రశ్నలు ఎదురవుతున్నాయట. సానుభూతి పవనాలతో పాలేరు ఉప ఎన్నికల్లో గెలవాలని అనుకుంటున్నపుడు, అందుకు తగ్గ ఏర్పాట్లు చేశారా అని కిందిస్థాయి నుంచి ప్రశ్నలు వస్తున్నాయట. సీనియర్ ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డిపై ఉన్న సానుభూతిని సెంటిమెంట్‌రూపంలో ఉపయోగించుకోవడానికి ఎలాంటి వ్యూహాలు చేపట్టారంటూ కార్యకర్తలు ఆరాతీస్తున్నారట. ఎన్నికల తేదీ సమీపిస్తుండగా పార్టీ ముఖ్యనాయకుల జాడే కనిపించకపోవడం, ప్రచారం హోరెత్తికంచకపోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారట.

అధికారపార్టీ వ్యూహాలను, ప్రచారాన్ని తిప్పికొట్టేలా కార్యాచరణను చేపట్టకుండా ఇంకా ఏవో వ్యూహాలను రచిస్తున్నట్లుగా కనిపించడం వెనక ఆంతర్యమేమిటనే ప్రశ్నలు ముందుకు వస్తున్నాయట. పెద్ద ఎత్తున వనరులను అందుబాటులోకి తెచ్చి ఒక వాతావరణాన్ని సృష్టించేందుకు ఉపకరించాల్సి ఉండగా అటువంటి ప్రయత్నాలు జరగడం లేదని స్థానికనాయకులు వాపోతున్నారట.  ఇవేమి చేయకుండా ఏదో మొక్కుబడి ప్రచారానికి వచ్చి ఒరగబెట్టేది ఏమిటీ ? ఈ మాత్రం దానికి పెద్ద పెద్దనాయకులు రావాలా అని పెదవి విరుస్తున్నారట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement