సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ నేతలు త్వరలోనే ఢిల్లీ వెళ్లనున్నారు. రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలు, కర్ణాటక ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్రంలో నెలకొన్న వాతావరణం, పార్టీలోకి చేరికలు, ఈ నెలలోనే నిర్వహించాల్సిన బహిరంగ సభలు, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ముగింపుతో పాటు త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధతపై అధిష్టానంతో చర్చించనున్నారు. ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్, ప్రియాంకా గాంధీదీలతో పాటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో చర్చించేందుకు గానూ త్వరలోనే ఏఐసీసీ నుంచి తెలంగాణ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సభ్యులకు ఆహ్వానం అందనున్నట్టు తెలుస్తోంది.
ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ సమావేశాల్లో భాగంగా ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్‌గాంధీ ఈనెల 8వ తేదీన ఢిల్లీ వస్తారని, ఆ తర్వాత ఎప్పుడైనా తెలంగాణ నేతలకు ఢిల్లీ నుంచి పిలుపు రావచ్చని సమాచారం. 9 లేదా 10 తేదీల్లో ఈ సమావేశం ఉండే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నా, గత నెల 26నే జరగాల్సిన సమావేశం వాయిదా పడిన నేపథ్యంలో తేదీల ఖరారుపై మాత్రం స్పష్టత రావాల్సి ఉంది.
చదవండి: ధరణి మూలంగానే రైతుబంధు, ఎక్స్‌గ్రేషియా, పంటలకు డబ్బులు: కేసీఆర్
Comments
Please login to add a commentAdd a comment