TPCC Leaders
-
అంతా తెలుసు.. టీ కాంగ్రెస్ నేతలకు రాహుల్ స్ట్రాంగ్ వార్నింగ్
సాక్షి, ఢిల్లీ: పార్టీలో ఏ నాయకులు ఏం చేస్తున్నారో అంతా తెలుసు.. ఇప్పటివరకూ ఎవరెవరు పార్టీ కోసం ఏం చేశారో, ఇప్పుడు ఏం చేస్తున్నారో తన దగ్గర సమాచారం ఉందని తెలంగాణ కాంగ్రెస్ స్ట్రాటజీ సమావేశంలో రాహుల్ గాంధీ అన్నట్లు తెలిసింది. విబేధాల పేరుతో నోటికొచ్చినట్లు బహిరంగంగా వ్యాఖ్యలు చేస్తే అధిష్టానం కఠిన చర్యలు తీసుకుంటుందని తెలంగాణ కాంగ్రెస్ నేతలను రాహుల్ హెచ్చరించారు. పార్టీ కోసం అన్ని స్థాయిల్లోని నేతలు కలిసికట్టుగా, ఐక్యంగా పనిచేయాల్సిందేనని కర్ణాటక ఎన్నికల వ్యూహంలో అనుసరించిన విధానాన్ని సమావేశంలో ఆయన వివరించారు టీపీసీసీ నేతల సూచనలు, సలహాలు విన్న రాహుల్.. నాయకులంతా ఏకతాటిపై నడవాలని కోరారు. కేసీఆర్‌ను ఓడించేందుకు నేతలందరూ విబేధాలు, చిన్న చిన్న గొడవలు పక్కన పెట్టాలని సూచించారు. ఢిల్లీలో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే నేతృత్వంలో తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల వ్యూహ రచన సమావేశం మూడు గంటల పాటు సుదీర్ఘగా సాగింది. కాగా భారీ చేరికల నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్‌లో జోష్ సంతరించుకుంది. ఈ భేటీలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్‌రావ్ ఠాక్రే, పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిలతో పాటు ఉత్తమ్, కోమటిరెడ్డి, జానారెడ్డి, జగ్గారెడ్డి, మధుయాష్కీ తదితరలు ఈ ఎన్నికల వ్యూహ భేటీకి హాజరయ్యారు. చదవండి: టీ కాంగ్రెస్ స్ట్రాటజీ సమావేశం.. హైకమాండ్ ఏం చెప్పింది? భేటీ అనంతరం టీపీసీసీ ఛీప్ రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ ఎన్నికల కార్యచరణ మొదలైందని, రాబోయే 120 రోజుల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించామని తెలిపారు. ‘‘మేనిఫెస్టో రూపకల్పన త్వరగా పూర్తి చేయాలని చర్చ జరిపాం. అభ్యర్థుల ఎంపికలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలనే దానిపై చర్చ జరిగింది. ఎన్నికల సన్నాహక సమావేశం సుదీర్ఘంగా చర్చ జరిగింది. కర్ణాటక ఫార్ములాను తెలంగాణలో అమలు చేయాలని నిర్ణయించాం. అక్కడ అనుసరించిన మౌలిక అంశాలు ఇక్కడ కూడా అమలు చేయాలని డిసైడ్ అయింది’’ అని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. -
త్వరలో ఢిల్లీకి టీపీసీసీ నేతలు.. రాహుల్ అమెరికా నుంచి రాగానే!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ నేతలు త్వరలోనే ఢిల్లీ వెళ్లనున్నారు. రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలు, కర్ణాటక ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్రంలో నెలకొన్న వాతావరణం, పార్టీలోకి చేరికలు, ఈ నెలలోనే నిర్వహించాల్సిన బహిరంగ సభలు, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ముగింపుతో పాటు త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధతపై అధిష్టానంతో చర్చించనున్నారు. ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్, ప్రియాంకా గాంధీదీలతో పాటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో చర్చించేందుకు గానూ త్వరలోనే ఏఐసీసీ నుంచి తెలంగాణ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సభ్యులకు ఆహ్వానం అందనున్నట్టు తెలుస్తోంది. ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ సమావేశాల్లో భాగంగా ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్‌గాంధీ ఈనెల 8వ తేదీన ఢిల్లీ వస్తారని, ఆ తర్వాత ఎప్పుడైనా తెలంగాణ నేతలకు ఢిల్లీ నుంచి పిలుపు రావచ్చని సమాచారం. 9 లేదా 10 తేదీల్లో ఈ సమావేశం ఉండే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నా, గత నెల 26నే జరగాల్సిన సమావేశం వాయిదా పడిన నేపథ్యంలో తేదీల ఖరారుపై మాత్రం స్పష్టత రావాల్సి ఉంది. చదవండి: ధరణి మూలంగానే రైతుబంధు, ఎక్స్‌గ్రేషియా, పంటలకు డబ్బులు: కేసీఆర్ -
హైదరాబాద్ మీదుగా కోదాడకు ఠాక్రే..
సాక్షి, హైదరాబాద్/కోదాడ: రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే మంగళవారం హైదరాబాద్ వచ్చారు. నాగ్‌పూర్ నుంచి వచ్చిన ఆయనకు టీపీసీసీ నేతలు హర్కర వేణుగోపాల్‌రావు, సంగిశెట్టి జగదీశ్వర్‌రావు తదితరులు విమానాశ్రయంలో ఘనస్వాగతం పలికారు. అక్కడ కాసేపు టీపీసీసీ నేతలతో మాట్లాడిన ఠాక్రే ఏఐసీసీ కార్యదర్శు లు బోసురాజు, రోహిత్‌చౌదరితో కలిసి నేరుగా కోదాడ వెళ్లిపోయారు. మంగళవారంరాత్రి అక్కడే ఉండనున్న ఆయన బుధవారం ఉద యం నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో భేటీ అయి జోడో యాత్రలపై సమీక్ష నిర్వహిస్తారు. ఆ తర్వాత కోదాడలో హాథ్‌సే హాథ్‌జోడో యాత్రలో పాల్గొని ములుగు వెళ్లనున్నారు. ఐదు రోజుల పాటు తెలంగాణలోనే ఉండనున్న ఆయన వరంగల్ జిల్లాలో పర్యటిస్తారు. అనంతరం రెండు రోజులు గాంధీభవన్‌లో పార్టీ ముఖ్య నేతలతో సమావేశాలు నిర్వహించనున్నారు. ఠాక్రే వెంట నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఉన్నారు. -
పంటలకు సకాలంలో కరెంట్ ఇవ్వాలి
సాక్షి, హైదరాబాద్: పంటలు కాపాడుకోవడానికి రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం గొప్పలు చెప్పకుండా సకాలంలో పంటలకు కరెంట్ ఇవ్వాలని టీపీసీసీ నేతలు డిమాండ్ చేశారు. వ్యవసాయ రంగానికి విద్యుత్ సరఫరా అంశంపై అసెంబ్లీలో చర్చించాలన్న తమ విజ్ఞప్తిని స్పీకర్ మన్నించనందుకు నిరసనగా గురువారం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భట్టి విక్రమార్క, డి.శ్రీధర్‌బాబు, సీతక్క, జగ్గారెడ్డి సభ నుంచి వాకౌట్ చేశారు. అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద నిరసన తెలిపారు. రాష్ట్రంలో విద్యుత్ కోతలతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు ఉచితంగా 24 గంటలు కరెంట్ ఇస్తున్నామని ప్రభుత్వం డాంబికాలు చెబుతున్నా.. కనీసం 4–5 గంటలు కూడా కరెంట్ ఇవ్వట్లేదని ధ్వజమెత్తారు. ఆ కరెంట్ కూడా ఎప్పుడు ఏ సమయానికి ఇస్తున్నారో చెప్పలేని పరిస్థితి రాష్ట్రవ్యాప్తంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ఇబ్బందుల గురించి మాట్లాడటానికి సమయం ఇవ్వాలని సభలో పదేపదే కోరినా పట్టించుకోలేదన్నారు. తమ వైపు స్పీకర్ కనీసం చూడకుండా వాయిదా తీర్మానాన్ని తిరస్కరించినందుకు బయటకు వచ్చామన్నారు. వ్యవసాయానికి 24 గంటల పాటు నిరవధికంగా ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని, విద్యుత్ కోతలపై సభలో చర్చ జరగాలన్నారు. -
పోరాటాలు, యాత్రలపై దృష్టి!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేయడంతోపాటు భవిష్యత్తులో అనుసరించాల్సిన రాజకీయ వ్యూహాలపై కాంగ్రెస్ దృష్టి సారించింది. ఇందుకోసం పార్టీ ముఖ్యనేతలు వరుసగా రెండు రోజులపాటు సమావేశాలు జరుపుతున్నారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్యం ఠాగూర్ నేతృత్వంలో జరుగుతున్న ఈ భేటీల్లో రాష్ట్రంలో రాహుల్ పర్యటన, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటాలు, పార్టీ నేతల యాత్రలపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇందులోభాగంగా శుక్రవారం గాంధీభవన్‌లో పార్టీ ముఖ్య నేతల సమావేశం జరిగింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి మాణిక్యం ఠాగూర్‌తోపాటు ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లు జగ్గారెడ్డి, మహేశ్‌కుమార్‌గౌడ్, గీతారెడ్డి, అంజన్‌కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, టీపీసీసీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ, ప్రచార కమిటీ కన్వీనర్ అజ్మతుల్లా హుస్సేన్ తదితరులు హాజరయ్యారు. సమావేశంలో పార్టీ సభ్యత్వ నమోదు విజయవంతం, రాహుల్ పర్యటనపై రెండున్నర గంటల పాటు చర్చించారు. రాష్ట్రంలో పార్టీ సభ్యులుగా చేరిన 40లక్షల మందికి పైగా కార్యకర్తలకు బీమా అందేలా చూడాలని, ఇందుకోసం గాంధీభవన్‌లో కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పీఏసీ సభ్యులు, మాజీ మంత్రులు, పార్టీ సీనియర్ ఉపాధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, డీసీసీ అధ్యక్షులతో శనివారం సమావేశాలు నిర్వహించనున్నారు. 6, 7 తేదీల్లో రాష్ట్రానికి రాహుల్ వచ్చే నెల 6,7 తేదీల్లో ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ రాష్ట్ర పర్యటనకు రానున్నట్టు సమాచారం. ఈ రెండు తేదీల్లో ఆయన టూర్ దాదాపు ఖరారు కాగా, ఆయా తేదీలను నేడు ఏఐసీసీ అధికారికంగా ప్రకటించనుంది. రాహుల్ తన పర్యటనలో వరంగల్ రైతు బహిరంగసభలో పాల్గొనడంతో పాటు పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహించనున్నారు. ఇందుకోసం కుత్బుల్లాపూర్ లేదా ఇబ్రహీంపట్నం ప్రాంతాల్లో ప్రత్యేక వేదికను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. -
ఢిల్లీకి టీపీసీసీ నేతలు.. నేడు రాహుల్‌తో భేటీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ముఖ్య నాయకులు బుధవారం రాహుల్‌గాంధీని కలవనున్నారు. బుధవారం మధ్యాహ్నం ఒంటిగంటకు 10 జన్‌పథ్‌లో కలవాలని సోమవారం రాత్రి ఏఐసీసీ నుంచి 10 మంది టీపీసీసీ నేతలకు ఫోన్లు వచ్చాయి. దీంతో మంగళవారం సాయంత్రం అందరూ ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఢిల్లీ నుంచి ఆహ్వానం అందిన వారిలో టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కతో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్లు జగ్గారెడ్డి, మహేశ్‌కుమార్‌గౌడ్, గీతారెడ్డి, అంజన్‌కుమార్ యాదవ్, అజారుద్దీన్, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్, ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఉన్నారు. ఒక్కొక్కరితో 5 నిమిషాల చొప్పున రాహుల్ సమావేశమవుతారని, కొత్తగా ఎంపికైన నేతలను పరిచయం చేసుకోవడంతో పాటు రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, పార్టీ పరిస్థితిపై వారితో మాట్లాడతారని గాం«దీభవన్ వర్గాలు తెలిపాయి. కొత్తగా పీసీసీ అధ్యక్షుడిగా, ఇతర ముఖ్య పదవుల్లో నియమితులైన వారితో రాహుల్ లేదా సోనియా భేటీకావడం ఆనవాయితీ. ఇందులో భాగంగానే రాష్ట్ర నేతలకు ఆహా్వనం అందిందని తెలుస్తోంది. ఢిల్లీ టూర్‌కు జగ్గారెడ్డి నో... రాహుల్‌తో భేటీకి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి వెళ్లడం లేదు. అనుకోకుండా ఆహా్వనం రావడం, విమానం ఎక్కే అలవాటు లేకపోవడం, రైలులో వెళ్లే సమయం లేకపోవడంతో జగ్గారెడ్డి ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకున్నారు. ఈ విషయాన్ని అధిష్టానం పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. రాహుల్‌ను కలిసేందుకు మరోమారు తన కుటుంబ సభ్యులతో కలసి వస్తానని కేసీ వేణుగోపాల్, మాణిక్యం ఠాగూర్‌కు ఆయన తెలిపారు. -
సోనియా గాంధీ ఎన్నిక పట్ల హర్షం
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్లమెంటరీ పక్ష (సీపీపీ) నేతగా సోనియాగాంధీ ఎన్నిక కావడం పట్ల పలువురు టీపీసీసీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. యూపీఏ చైర్‌పర్సన్‌గా పదేళ్ల పాటు సమర్థంగా ప్రభుత్వాన్ని నడపడంతో పాటు ఎక్కువ కాలం ఏఐసీసీ అధ్యక్షురాలిగా పనిచేసిన అనుభవం ఉన్న ఆమె సీపీపీ నేతగా ఎన్నికవడం స్వాగతించదగిన విషయమని వారు అన్నారు. సోనియా నాయకత్వంలో కాంగ్రెస్ ఎంపీలు దేశంలోని ప్రజాసమస్యలపై విస్తృతంగా పోరాడతారని, ఆమె నేతృత్వంలో పార్టీ మరింత బలపడి రాబోయే రోజుల్లో అధికారంలోకి వచ్చే స్థాయికి చేరుతుందన్నారు. హర్షం వ్యక్తం చేసిన వారిలో టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, సీఎల్పీ మాజీ నేత జానా రెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రావణ్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లు పొన్నం ప్రభాకర్, జెట్టి కుసుమకుమార్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు ఎంఆర్జీ వినోద్‌రెడ్డి, బొల్లు కిషన్ తదితరులున్నారు. -
కాంగ్రెస్ పార్టీలో కోవర్టులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్‌పార్టీలో కోవర్టులున్నారా..? వారి మూలంగానే పార్టీ నష్టపోతోందా? పార్టీలో ఉంటూనే పార్టీకి నష్టం చేసే కార్యకలాపాలకు వారు పాల్పడుతున్నారా...? ఈ ప్రశ్నలన్నీ ఇప్పుడు గాంధీభవన్ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి. కాంగ్రెస్‌లో ఇంటిదొంగలున్నారని, వారెవరో త్వరలోనే చెబుతామంటూ ఆ పార్టీకి చెందిన ఒకరిద్దరు సీనియర్లు ఇటీవల బహిరంగంగా వ్యాఖ్యానించడంతో.. అసలు కోవర్టులెవరనే దానిపై చర్చ మొదలైంది. అయితే, కోవర్టులు ఎవరనే విషయంలో స్పష్టత రానప్పటికీ వారి మూలంగానే ఎమ్మెల్యేలు పార్టీలు మారుతున్నారని టీపీసీసీ నేతలు గుర్తించినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా తాజాగా గోడ దూకిన ఇద్దరు ఎమ్మెల్యేలతో పాటు గతంలో మరో నలుగురు పార్టీ మారేందుకు వీరే కారణమని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక్కడ ఉంటూనే...! గతంలో ఎన్నడూ లేని విధంగా టీపీసీసీలో కోవర్టుల వ్యవహారం ఆసక్తిని రేకెత్తిస్తోంది. అసలు ఈ కోవర్టులు టీపీసీసీకి చెందిన వారు కాదని, వేరే రాష్ట్రానికి చెందిన వారనే చర్చ మరింత ఆసక్తిని కలిగిస్తోంది. టీపీసీసీలో కూడా ఒకరిద్దరు ఉన్నప్పటికీ వారు నేరుగా పార్టీకి నష్టం చేసేంత శక్తి కలిగిన నేతలు కారని, పొరుగు రాష్ట్రానికి చెందిన ఓ నాయకుడే తెలంగాణ కాంగ్రెస్‌కు నష్టం కలిగేలా వ్యవహరిస్తున్నారని, ఆయనకు టీపీసీసీలోని కొందరు సహకరిస్తున్నారని చెబుతున్నారు. అయితే, ఆయనతో పాటు మరికొందరు టీపీసీసీ నేతలు కూడా ఈ జాబితాలో ఉన్నారని కొందరు అంటున్నారు. ఏదైనా కీలక అంశానికి సంబంధించిన టీపీసీసీ నిర్ణయం తీసుకున్న క్షణాల్లోనే ఆ సమాచారం ప్రత్యర్థి శిబిరానికి వెళ్తోందని, పార్టీ నిర్ణయాలను గులాబీ గూటికి మోసే కొందరిని గుర్తించారని కూడా అంటున్నారు. ‘పార్టీ అంతర్గత వ్యవహారాలతో పాటు కీలక నిర్ణయాలను ఇతర పార్టీలకు చేరవేసేలా కొందరు వ్యవహరిస్తున్నారనే చర్చ పార్టీలో జరుగుతోంది. దీనిపై పార్టీ కూడా ఆరా తీస్తోంది. ఈ విషయంలో ఎవరైనా ఆధారాలతో దొరికితే మాత్రం పార్టీ పరంగా కచ్చితంగా చర్యలుంటాయి.’అని టీపీసీసీ ముఖ్యనేత ఒకరు వ్యాఖ్యానించడం గమనార్హం. టికెట్లు ఇప్పించడంలోనూ... కాంగ్రెస్ కోవర్టులు పార్టీ నిర్ణయాలను మార్చగలిగే స్థాయికి చేరుకున్నారని, గత డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏఐసీసీని కూడా ప్రభావితం చేసి చివరి నిమిషంలో టికె ట్లు మార్పించారనే చర్చ జరుగుతోంది. పారాచూట్లకు టికెట్లు లేవని ఏఐసీసీ చీఫ్ రాహుల్‌గాంధీ స్వయంగా చెప్పినా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి టికెట్లు రావడంలో, పార్టీలో చాలా కాలంగా పనిచేస్తూ పార్టీకి అండగా ఉన్నవారికి టికెట్లు రాకుండా చేయడంలో వీరు కీలకపాత్ర పోషించారనే వాదన వినిపిస్తోంది. పార్టీ లో ఎమ్మెల్యేల మార్పునకు సహకరించిన, పార్టీ నిర్ణయాలను ఇతరులకు చేరవేస్తున్న నేతలెవరు? వారి పేర్లు బయటపడతాయా? టీపీసీసీ గుర్తించి చర్యలు తీసుకుంటుందా? కోవర్టుల కథ కొనసాగుతూనే ఉంటుందా? ఏం జరుగుతుందనేది కాలమే నిర్ణయించాల్సి ఉంది. -
ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్
సాక్షి, హైదరాబాద్: ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని టీపీసీసీ నేతలు ఆరోపించారు. దాదాపు 20 నియోజకవర్గాల్లో ఇలాంటి పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. ఇది చాలా బాధాకరమైన విషయమన్నారు. శనివారం సచివాలయంలో ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్, మాజీ ఎమ్మెల్యేలు మల్రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్‌రెడ్డిలు విలేకరులతో మాట్లాడారు. విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ వికారాబాద్‌లో కోర్టు పరిధిలో ఉన్న 25 స్ట్రాంగ్ రూంలోని ఈవీ ఎంలను అధికారులు తెరిచారని, దీనిపై ఢిల్లీలో ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశామన్నారు. ఇక్కడ సీఈవోకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదన్నారు. మనిషి తప్పు చేస్తాడు కానీ మిషన్లు కాదన్నారు. ప్రసాద్‌కుమార్ మాట్లాడుతూ.. కేసీఆర్ ఇక్కడ వచ్చి ప్రచారం చేసినా తాను గెలిచేవాడినని.. ఇక్కడ ఓడిపోవడం బాధ కలి గించిందన్నారు. 518 ఓట్లు ఉంటే 555 అని ఈవీఎంలలో చూపిస్తుందని, దీనిపై సీఈవోకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని వాపోయారు. అధికారులపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఆదేశాలు వచ్చాయన్నారు. అక్కడ మళ్లీ రీపోలింగ్ జరపాలని డిమాండ్ చేశారు. మల్రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో జరిగిన ఎన్నికల తీరు బాధాకరమన్నారు. ఈవీఎంల మీద నమ్మకం లేకే వీవీప్యాట్లను తెచ్చినా న్యాయం జరగడంలేదని పేర్కొన్నారు. రామ్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఇబ్రహీంపట్నం, పరిగి ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. -
స్వీట్లు తినిపించుకున్న కాంగ్రెస్ నేతలు
సాక్షి, హైదరాబాద్ : యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ పుట్టిన రోజు సందర్భంగా టీపీసీసీ నేతలు గాంధీభవన్‌లో ఆదివారం ఉదయం సంబరాలు చేసుకున్నారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన పుట్టినరోజు వేడుకల్లో టీపీసీసీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం ఉత్తమ్‌కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘దేశం కోసం సేవలందించిన ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీలను సోనియా దారుణమైన పరిస్థితుల్లో కోల్పోయారు. వారి ఆశయాల సాధన కోసం రాజకీయాల్లోకొచ్చి అసలైన త్యాగానికి అర్థం చెప్పారు. పేదల అభ్యున్నతికి పనిచేసి రైట్ టు ఇన్ఫర్మేషన్, రైట్ టు ఎడ్యుకేషన్, గ్రామీణ ఉపాధి హామీ పథకం, ఆహార భద్రతా పథకాలు తీసుకొచ్చేలా యూపీఏ ప్రభుత్వాన్ని నడిపించారు. మరెన్నో చారిత్రాత్మక చట్టాలను తీసుకురావడంలో కృషిచేశారు. ప్రధానమంత్రి పదవిని చేపట్టే అవకాశాల్ని సైతం ఆమె వదులుకున్నారు. ఆరు దశాబ్దాల తెలంగాణ ప్రజల కలను సాకారం చేసి రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. ఆమెకు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల తరపున హార్థిక జన్మదిన శుభాకాంక్షలు’ అని ఉత్తమ్ పేర్కొన్నారు. -
ఆశావహులకు టీపీసీసీ అల్టిమేటం
-
ఢిల్లీకి వెళ్లొద్దు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో టికెట్ల కేటాయింపు వ్యవహారం ఢిల్లీ పెద్దలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. పొత్తుల వ్యవహారం ఇప్పటికీ ఓ కొలిక్కి రాకపోవడం, నాన్చివేత ధోరణిపై కోదండరాం నేరుగా రాహుల్‌కే ఫిర్యాదు చేయడంపై ఏఐసీసీ పెద్దలు టీపీసీసీపై గుర్రుగా ఉన్నట్టు తెలిసింది. అయితే టికెట్ల ఆశావహులు పదేపదే ఢిల్లీ వెళ్లడం, అక్కడి ఏఐసీసీలోని పెద్దలను కలవడం రాష్ట్ర కాంగ్రెస్ నేతలను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టినట్టు తెలుస్తోంది. దీంతో ఆశావహులెవరూ ఢిల్లీ వెళ్లొద్దని, అక్కడ ఏఐసీసీ పెద్దలను కలిసి సమయం వృథా చేయవద్దని టీపీసీసీ నేతలు ఆశావహులకు అల్టిమేటం ఇచ్చినట్టు తెలిసింది. స్క్రీనింగ్ కమిటీ ఇచ్చిన జాబితా కోర్‌కమిటీకి చేరిన తర్వాత కూడా ఆశావహులు ఢిల్లీలోనే ఉంటూ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. పదేపదే కోర్ కమిటీ సభ్యులను కలవడం, వినతులివ్వడం చేస్తుండటంతో కోర్ కమిటీ సభ్యులు టీపీసీసీ పెద్దలను మందలించినట్టుగా తెలుస్తోంది. ఈనెల 9న అభ్యర్థుల జాబితా విడుదలవుతుండటంతో చివరి ప్రయత్నంగా అభ్యర్థులు ఢిల్లీ వెళ్లేందుకు సిద్ధమయ్యారు. కొంతమంది అభ్యర్థులు మూడు రోజుల కిందటే ఢిల్లీవెళ్లి అక్కడే మకాం వేశారు. దీంతో అభ్యర్థులెవరూ ఢిల్లీ రావద్దని, అనవసరంగా సమయం వృథా చేసుకోవద్దని కాంగ్రెస్ హైకమాండ్ అల్టిమేటం ఇచ్చినట్టు తెలిసింది. కొంతమంది అభ్యర్థులు ఏకంగా కులసంఘాల పెద్దలను, సామాజిక వర్గ నేతలను తీసుకెళ్లి యూపీఏ భాగస్వామ్య పక్షాలుగా ఉన్న ఇతర పార్టీల పెద్దలతో ఏఐసీసీ నేతలకు ఫోన్లు కొట్టించడం హైకమాండ్‌కు చిర్రెత్తుకొచ్చేలా చేసిందని హస్తినలో చర్చ జరుగుతోంది. అంతేకాకుండా అభ్యర్థుల వినతులను రాష్ట్ర కాంగ్రెస్ నేతలు పెద్దగా పట్టించుకోవడం లేదన్న ఫిర్యాదుపై టీపీసీసీ నేతలకు ఏఐసీసీ నేతలు ఘాటుగానే హెచ్చరికలు జారీచేసినట్టు తెలుస్తోంది. -
అన్ని వర్గాల ఆత్మబంధువు కాంగ్రెస్
సాక్షి, హైదరాబాద్ : దేశంలోని అన్ని వర్గాల ప్రజల ఆత్మబంధువు కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని, తమ పార్టీ నేతృత్వంలోనే దళిత, గిరిజన, ఆదివాసీ, మైనార్టీ, మహిళల హక్కుల పరిరక్షణ సాధ్యమవుతుందని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(టీపీసీసీ) నేతలు ఉద్ఘాటించారు. ఏఐసీసీ పిలుపు మేరకు సోమవారం గాంధీభవన్‌లో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో ‘ఎస్సీ, ఎస్టీ హక్కుల పరిరక్షణ దీక్ష’జరిగింది. దీక్షకు హాజరైన పలువురు కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ.. దేశంలో దళితుల హక్కులను నీరుగార్చే కుట్ర జరుగు తోందని ఆరోపించారు. రాష్ట్రంలోనూ దళితులపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయని, దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తామన్న కేసీఆర్ తానే ఆ కుర్చీలో కూర్చుని అప్రజాస్వామిక విధానాలను అవలంబిస్తూ దళితులపై దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వాలను ప్రశ్నించాలి: ఉత్తమ్ ఉత్తమ్ మాట్లాడుతూ.. దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పలు విధ్వంసకర ఘటనల్లో చాలా మంది దళితులు చనిపోయారని, తెలంగాణలోనూ కేసీఆర్ నేతృత్వంలో దళితులపై దాడులు జరుగుతున్నాయని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ఈ దాడులను ప్రశ్నించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ ప్రభుత్వాలు దళితుల పట్ల అనుసరిస్తున్న విద్వేషకర విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. సీఎల్పీ నేత జానారెడ్డి మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీల హక్కుల పరిరక్షణ కోసమే రాజ్యాంగం అట్రాసిటీ చట్టాన్ని ఇచ్చిందని, ఇప్పుడు కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు దళిత హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నాయని విమర్శించారు. ప్రభుత్వాల వైఖరిని ఎదుర్కొనేందుకు పోరాడతామన్నారు. మతకల్లోలాలతోనే బీజేపీ గెలుపు: జైపాల్ కేంద్ర మాజీ మంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి మాట్లాడుతూ మతకల్లోలాలు జరిగిన చోటే బీజేపీ గెలుస్తుందని, అవి జరగకపోతే బీజేపీ ఎక్కడా గెలవదని అన్నారు. ప్రభుత్వ లాయర్లు సరిగా వాదించకపోవడం వల్లనే ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం నీరుగారేలా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వాల్సి వచ్చిందని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఢిల్లీలో బీజేపీకి మిత్రుడిగా, గల్లీలో శత్రువుగా వ్యవహరిస్తున్నారన్నారు. మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ మాట్లాడుతూ దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని తెలంగాణ రాకముందు కేసీఆర్ తమ పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి లేఖ రాశారని, అధికారం వచ్చాక మాట తప్పారని అన్నారు. ఒక్క సంవత్సరంలో ఏర్పాటు చేస్తానని కేసీఆర్ చెప్పిన భారీ అంబేడ్కర్ విగ్రహం ఎక్కడని ప్రశ్నించారు. సీఎల్పీ ఉపనేత, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో మోదీ మార్కు రాజ్యాంగం, రాష్ట్రంలో కేసీఆర్ మార్కు రాజ్యాంగం నడుస్తున్నాయని ఆరోపించారు. నాటి అప్రజాస్వామిక విధానాలపై ప్రజలను కదలించిన మహానేత వైఎస్ మహాపాదయాత్ర చేపట్టి 15 ఏళ్లు అవుతోందని, ప్రజల అడుగుల్లో అడుగేసి ఈ దుర్మార్గపు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాడేందుకు ఆ మహనీయుని స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్లాలని కోరారు. కాంగ్రెస్‌తోనే సమాన హక్కులు: రఘువీరా దీక్షకు హాజరైన ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ దళితులు, మహిళలు, మైనారిటీలు, గిరిజనులకు ఒక రక్షణ కవచమని, అన్నివర్గాలకు సమాన హక్కులు కల్పించేది కాంగ్రెస్ పార్టీయేనని అన్నారు. ఆలంపూర్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ మాట్లా డుతూ దళితులను ఇసుక ట్రాక్టర్ల కింద నలిపేసిన చరిత్ర కేసీఆర్‌దని అన్నారు. టీపీసీసీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఆరేపల్లి మోహన్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని పటిష్ట పరచాలని తమ పార్టీ డిమాండ్ చేస్తోందన్నారు. అనంతరం తాను చేపట్టిన దీక్షను సాయంత్రం 5 గంటల సమయంలో ఉత్తమ్ విరమించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ ఆర్సీ కుంతియా, మాజీ మంత్రి డీకే అరుణ తదితరులు పాల్గొన్నారు. 23న ఢిల్లీలో.. దేశంలోని దళితుల హక్కుల పరిరక్షణ కోసం ఈ నెల 23న ఏఐసీసీ ఆధ్వర్యంలో ఢిల్లీలో దళిత విచారణ సమ్మేళనం జరుగుతుందని ఉత్తమ్ చెప్పారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ పాల్గొనే ఈ సమ్మేళనానికి రాష్ట్రంలోని దళిత నేతలంతా హాజరు కావాలని కోరారు. -
డీసీసీ నియామకాలకు బ్రేక్..?
-
డీసీసీ నియామకాలకు బ్రేక్..?
ఎన్నికల్లో పోటీ వద్దంటే ఎలాగంటున్న జిల్లాల నేతలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ)ల అధ్యక్షుల నియామకానికి మరికొంతకాలం బ్రేక్ పడినట్టుగా కనిపిస్తోంది. డీసీసీ అధ్యక్షుల నియామకానికి ఏఐసీసీ నిర్దేశించిన అర్హతలు, నిబంధనల ప్రకారం క్షేత్రస్థాయిలో నేతలకు అవరోధాలు ఎదురవుతున్నట్టుగా టీపీసీసీ నేతలు వెల్లడించారు. డీసీసీ అధ్యక్షులుగా పనిచేయాలంటే రానున్న ఎన్నికల్లో ప్రత్యక్షంగా పోటీ చేయడానికి అవకాశం రాదని పెట్టిన నిబంధన.. చాలా జిల్లాల్లో ఇబ్బందులను తెచ్చిపెడుతోంది. ఎన్నికల్లో పోటీ చేయకుండా రాజ కీయాల్లో ఎవరు పనిచేస్తారన్న ప్రశ్న జిల్లాల్లో తలెత్తుతోంది. లోక్‌సభకు, శాసనసభకు పోటీ చేయకూడదనే నిబంధనతో పలువురు నేతలు ఆ పదవి చేపట్టడానికి వెనుకంజ వేస్తున్నారు. ఈ విషయంలో ఏఐసీసీ కూడా పట్టుదలతోనే ఉన్నట్టుగా తెలుస్తోంది. డీసీసీ అధ్యక్షునిగా పనిచేసేవారు పూర్తికాలం పార్టీ కోసం పనిచేయాల నేది ఏఐసీసీ సూచన. పార్టీ కోసం పూర్తి సమయాన్ని కేటాయించాల్సిన నాయకుడికి ఎక్కడైనా పోటీ చేయాలనే ఆలోచన ఉంటే పరిమితులు ఏర్పడ తాయనేది ఏఐసీసీ అనుమానం. తాను పోటీ చేయాలనుకున్న నియోజకవర్గంపైనే దృష్టిని కేంద్రీకరించి, మిగిలిన నియోజకవర్గాల్లో సమయాన్ని ఇవ్వకపోవడం, పార్టీకి సంబంధించిన అంశాలపై దృష్టి పెట్టకుండా పోయే ప్రమాదముందని ఏఐసీసీ ఆందోళన. అయితే ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో అర్థంకాక టీపీసీసీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. -
‘సమస్యలను ప్రశ్నిస్తే ఉలికిపాటెందుకు?’
టీఆర్ఎస్ తీరుపై మండిపడ్డ టీపీసీసీ నేతలు సాక్షి, హైదరాబాద్: సమస్యలను ప్రశ్నించిన జేఏసీ చైర్మన్ కోదండరాంపై దాడులు చేయించడం అప్రజా స్వామికమని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి, అధికార ప్రతి నిధి బెల్లయ్యనాయక్ విమర్శించారు. గాంధీభవన్‌లో మంగళవారం విలేక రులతో వారు మాట్లాడుతూ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని అడగడం నేరమా అని ప్రశ్నించారు. నియంతృత్వ ధోరణితో ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహరిస్తున్నారన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కోదండరాంపై ఎవరు మాట్లాడినా నాలుకలు కోస్తామని హెచ్చరించిన టీఆర్ఎస్ నాయకులు ఇప్పుడేం చేస్తున్నారని ప్రశ్నించారు. నేడు కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవం: కాంగ్రెస్‌పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఉత్సవాలను నిర్వహించాలని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు. -
ఢిల్లీలో టీపీసీసీ నేతలు బిజిబిజీ
-
ఢిల్లీలో టీపీసీసీ నేతలు బిజిబిజీ
ఢిల్లీ: తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో బుధవారం బిజిబిజీగా గడిపారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్‌తో నేతలు బుధవారం సాయంత్రం ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ భేటీలో నేతలు చర్చించారు. టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక నిర్ణయాలను అసెంబ్లీలో ఎండగట్టాలని దిగ్విజయ్ నేతలకు దిశానిర్దేశం చేశారు. కొత్త జిల్లాల అధ్యక్షుల ఎంపికకు ఐదుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో సీనియర్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, షబ్బీర్ అలీ, భట్టి విక్రమార్క, కుంతియా సభ్యులుగా ఉన్నారు. అన్ని జిల్లాల నేతలతో కమిటీ సభ్యులు సంప్రదించి కొత్త అధ్యక్షులను ఎంపిక చేయాలని దిగ్విజయ్ సూచించారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల కాంగ్రెస్ అధ్యక్షుల ఎంపికపై ఢిల్లీలో వివాదం జరిగినట్లు తెలుస్తోంది. అయా జిల్లాల నేతలు రేణుక చౌదరి, మల్లు భట్టి విక్రమార్క, పొంగులేటి సుధాకర్‌రెడ్డి లు తమ వారిని అధ్యక్షులుగా నియమించాలంటూ పట్టుబడ్డారు. దీనిపై దిగ్విజయ్ నేతలతో చర్చించినట్లు సమాచారం. మరోవైపు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో పార్టీ సీనియర్లు బుధవారం ఢిల్లీలో సమావేశమయ్యారు. గురువారం పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలు సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశానికి సీనియర్ నేతలు చిదంబరం, ఆజాద్, జైరాం రమేష్ హాజరయ్యారు. -
గాంధీభవన్‌లో టీపీసీసీ ముఖ్యనేతల సమావేశం
హైదరాబాద్: గాంధీభవన్‌లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, షబ్బీర్ అలీ, పొన్నాల లక్ష్మయ్య, వి.హనుమంతరావు తదితరులు హాజరయ్యారు. ఈ సమావేశంలో నేతలంతా రైతుల సమస్యలు, ఫీజు రీయింబర్స్మెంట్ ఉద్య కార్యాచరణపై చర్చిస్తున్నట్టు సమాచారం. -
‘మల్లన్నసాగర్ వెళ్లేందుకు భద్రత కల్పించండి’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ అరాచకాలకు గాయపడిన రైతాంగాన్ని పరామర్శించడానికి మల్లన్నసాగర్లో పర్యటిస్తామని, తమకు అనుమతి ఇవ్వడంతోపాటు భద్రతను కల్పించాలని టీపీసీసీ ముఖ్యనేతలు రాష్ట్ర డీజీపీకి వినతిపత్రాన్ని ఇచ్చారు. రాష్ట్ర కార్యాలయంలో డీజీపీని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క, మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, నేతలు సునీతా లక్ష్మారెడ్డి, సురేష్‌శేట్కార్, పొన్నం ప్రభాకర్, జగ్గా రెడ్డి, కుసుమకుమార్, ఆరేపల్లి మోహన్, కిషన్, జడ్సన్, అనిల్‌కుమార్ యాదవ్, నేరేళ్ల శారద తదితరులు కలిశారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ రైతులను పరామర్శించడానికి వెళ్లడమే నేరమైనట్టుగా కాంగ్రెస్‌పార్టీ నేతలను పోలీసులు అరెస్టు చేయడం దారుణమన్నారు. మల్లన్నసాగర్లో 144 సెక్షన్ పెట్టినట్టుగా చెబుతున్న పోలీసులు అక్కడే టీఆర్ఎస్ నేతల ర్యాలీలకు మద్దతులను ఎలా ఇచ్చిందని ప్రశ్నించారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ చేసిన ప్రకటనలపైనా భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు అడ్డుకుంటే కొట్టిస్తామని, జైల్లో పెడతామని ప్రకటనలు చేసిన మంత్రి తలసానిపై చర్యలను తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
ఇక్కడకు మీరొచ్చి చేసేదేమిటి...!
టీపీసీసీ నాయకులకు కొత్త ప్రశ్నలు ఎదురవుతున్నాయట. సానుభూతి పవనాలతో పాలేరు ఉప ఎన్నికల్లో గెలవాలని అనుకుంటున్నపుడు, అందుకు తగ్గ ఏర్పాట్లు చేశారా అని కిందిస్థాయి నుంచి ప్రశ్నలు వస్తున్నాయట. సీనియర్ ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డిపై ఉన్న సానుభూతిని సెంటిమెంట్రూపంలో ఉపయోగించుకోవడానికి ఎలాంటి వ్యూహాలు చేపట్టారంటూ కార్యకర్తలు ఆరాతీస్తున్నారట. ఎన్నికల తేదీ సమీపిస్తుండగా పార్టీ ముఖ్యనాయకుల జాడే కనిపించకపోవడం, ప్రచారం హోరెత్తికంచకపోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారట. అధికారపార్టీ వ్యూహాలను, ప్రచారాన్ని తిప్పికొట్టేలా కార్యాచరణను చేపట్టకుండా ఇంకా ఏవో వ్యూహాలను రచిస్తున్నట్లుగా కనిపించడం వెనక ఆంతర్యమేమిటనే ప్రశ్నలు ముందుకు వస్తున్నాయట. పెద్ద ఎత్తున వనరులను అందుబాటులోకి తెచ్చి ఒక వాతావరణాన్ని సృష్టించేందుకు ఉపకరించాల్సి ఉండగా అటువంటి ప్రయత్నాలు జరగడం లేదని స్థానికనాయకులు వాపోతున్నారట. ఇవేమి చేయకుండా ఏదో మొక్కుబడి ప్రచారానికి వచ్చి ఒరగబెట్టేది ఏమిటీ ? ఈ మాత్రం దానికి పెద్ద పెద్దనాయకులు రావాలా అని పెదవి విరుస్తున్నారట. -
'గోల్కొండ'లో టీపీసీసీ కొత్త కార్యవర్గం భేటీ
హైదరాబాద్ : నగరంలోని గోల్కొండ హోటల్లో టీపీసీసీ కొత్త కార్యవర్గం శనివారం భేటీ అయింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై నేతలు చర్చిస్తున్నారు. అయితే ఈ సమావేశానికి ఆహ్వానం అందకపోవడంతో పీసీసీ శాశ్వత ఆహ్వానితులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పదవులు లభించని అసంతృప్తి నేతలను కట్టడి చేయలేమని ... కార్యవర్గ సమావేశాన్నిటీపీసీసీ హోటల్లో నిర్వహిస్తుంది. -
దిగ్విజయ్‌తో టీపీసీసీ నేతల భేటీ
ఎన్నికల ఫలితాలపై ఆత్మశోధన సాక్షి, హైదరాబాద్: ఏఐసీసీ ప్రధానకార్యదర్శి, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్‌తో టీపీసీసీ అగ్రనేతలు భేటీ అయ్యారు. గురువారం రాత్రి హైదరాబాద్‌లోని ఒక హోటల్లో టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి, శాసనమండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ, సర్వే సత్యనారాయణ, జె.గీతారెడ్డి, దామోదర రాజనర్సింహా, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల ముఖ్యనేతలు కలిశారు. ఈ సందర్భంగా గ్రేటర్, వరంగల్, నారాయణఖేడ్ ఉపఎన్నికల ఫలితాలపై దిగ్విజయ్ ఆరా తీశారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నేతలు కొందరు టీఆర్ఎస్కు అనుకూలంగా పనిచేసినట్లు ఫిర్యాదు చేశారు. గ్రేటర్ ఎన్నికలకు ముందు జానారెడ్డి తీరుపైనా దిగ్విజయ్‌కు ఫిర్యాదు చేశారు. పరస్పర ఫిర్యాదులతో పార్టీకి నష్టం చేసుకోవద్దని, అందరితో సమావేశమై చర్చించుకుందామని దిగ్విజయ్ చెప్పినట్లు పార్టీ నేతలు తెలిపారు. -
ఖమ్మం, వరంగల్ ఎన్నికలకు దూరం?
కొందరు పీసీసీ నేతల ప్రతిపాదన సాక్షి, హైదరాబాద్: ఖమ్మం, వరంగల్, అచ్చంపేట, సిద్దిపేట పుర పాలి కలకు త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో టీపీసీసీ నేతలు తర్జనభర్జన పడుతున్నారు. ఈ ఎన్నికలకు దూరంగా ఉంటే ఎలా ఉంటుందని కొందరు నేతలు ప్రతిపాదించినట్లు తెలిసింది. కాంగ్రెస్ ముఖ్యనేతలు కొందరు గాంధీభవన్‌లో బుధవారం సమావేశమయ్యారు. రానున్న పురపాలక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై స్థూలంగా చర్చించినట్లు తెలిసింది. వరుసగా వస్తున్న ఉప ఎన్నికలు, స్థానిక ఎన్నికల వల్ల రాష్ట్రస్థాయిలో చేపట్టాల్సిన పోరాటాలు, విధానాలపై స్పష్టత రావడం లేదని ఒక నాయకుడు చెప్పినట్లు తెలిసింది. ఇలాంటి ఎన్నికలు సహజంగానే అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలంగా ఉంటాయని పేర్కొన్నట్లు సమాచారం. మున్సిపాలిటీల బాధ్యతలను ఆయా జిల్లాల పార్టీ యంత్రాంగాలకు అప్పగించాలని ప్రతిపాదించారు. రాష్ట్ర పార్టీగా స్థానిక ఎన్నికలపై దృష్టిని కేంద్రీకరించకుండా, పర్యవేక్షణకు, సూచనల వరకే పరిమితం కావాలని సూచిం చారు. జిల్లాల నేతలకే ఎన్నికల నిర్వహణ బాధ్యతను అప్పగించాలని నిర్ణయించారు. ఈ మున్సిపాలిటీల్లో పేపర్ బ్యాలెట్ నిర్వహించాలని కోరేందుకు నేడో, రేపో ఎన్నికల కమిషన్‌ను కలవాలని నిర్ణయించారు. -
ఆమరణ దీక్షకు దిగుదామా?
రెండు మూడ్రోజుల్లో రాష్ట్రపతి వద్దకు టీపీసీసీ నేతలు సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి, శాసనమండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీపై దాడి జరిగినా ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం, వారిపైనే ఎదురుకేసులు నమోదు చేయడంపై కాంగ్రెస్ పార్టీలో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీలోని అంతర్గత విభేదాలను పక్కనబెట్టి ప్రభుత్వ తీరుపై ఐక్యంగా పోరాడకుంటే రాష్ట్రం టీఆర్ఎస్ రాజకీయ గుత్తాధిపత్యంలోకి పోతుందని పార్టీ ముఖ్యులు హెచ్చరిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీ నేతలపై అధికార పార్టీ కక్షసాధింపు ధోరణికి పాల్పడుతోందని, దీన్ని నిరసిస్తూ పీసీసీ చీఫ్ ఆమరణ నిరాహార దీక్షకు దిగితే బాగుంటుందని సూచిస్తున్నారు. పాతబస్తీ సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలను తీసుకోవాల్సిన ప్రభుత్వం ఎదురుదాడికి దిగుతోందని అంటున్నారు. ఆమరణ నిరాహారదీక్ష చేయడం ద్వారా ప్రభుత్వ చర్యలను ఎండగడితేనే ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయని చెబుతున్నారు. రాష్ట్రపతి వద్దకు... రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో ప్రభుత్వం విఫలమైందని, సెక్షన్ 8ని ఉపయోగించుకుని ప్రతిపక్ష పార్టీల నేతలను కాపాడాలని కోరుతూ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ వద్దకు వెళ్లాలని టీపీసీసీ నిర్ణయించింది. అఖిలపక్ష నేతలతో కలసి రెండు, మూడు రోజుల్లో ఢిల్లీకి వెళ్లాలని నిర్ణయించారు. -
అసద్‌ను అరెస్టు చేయాలి
కాంగ్రెస్ డిమాండ్.. గాంధీభవన్ నుంచి డీజీపీ కార్యాలయం వరకు ర్యాలీ డీజీపీ కార్యాలయం ఎదుట ధర్నా సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి, శాసన మండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీపై దాడి చేసిన ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ డీజీపీ కార్యాలయం ఎదుట టీపీసీసీ ధర్నాకు దిగింది. గాంధీభవన్ నుంచి డీజీపీ కార్యాలయం వరకు టీపీసీసీ నేతలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు పాదయాత్రతో ర్యాలీని నిర్వహించారు. మంగళవారం పాతబస్తీలో ఉత్తమ్, షబ్బీర్‌పై దాడి నేపథ్యంలో ప్రతిపక్ష నేత కె.జానారెడ్డి, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్, ఎమ్మెల్యేలు సంపత్‌కుమార్, రామ్మోహన్‌రెడ్డి తదితరులు గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. దాడికి దిగిన అసదుద్దీన్ ఒవైసీని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం పాదయాత్రగా గాంధీభవన్ నుంచి డీజీపీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఎంఐఎంకు, పోలీసులకు వ్యతిరేకంగా కార్యకర్తలు నినాదాలు చేశారు. ఈ ర్యాలీకి మల్లు భట్టి విక్రమార్కతో పాటు ఎమ్మెల్సీలు పొంగులేటి సుధాకర్ రెడ్డి, ఫారూఖ్ హుస్సేన్, అంజన్‌కుమార్ యాదవ్, దానం నాగేందర్ తదితరులు నేతృత్వం వహించారు. ర్యాలీ నాంపల్లి, పబ్లిక్ గార్డెన్స్, అసెంబ్లీ మీదుగా డీజీపీ కార్యాలయానికి చేరుకుంది. ఈలోగా ఉత్తమ్, షబ్బీర్ అలీ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం నేరుగా డీజీపీ కార్యాలయం ఎదుట బైఠాయించారు. కాసేపటి తర్వాత రోడ్డుపై ధర్నా చేశారు. దీంతో కొద్దిసేపు ట్రాఫిక్ స్తంభించిపోయింది. మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యేలు మహేశ్వర్ రెడ్డి, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్‌కుమార్ యాదవ్ తదితర ముఖ్య నేతలు ఈ ధర్నాలో పాల్గొన్నారు. నగర పోలీసు సంయుక్త కమిషనర్ అంజన్‌కుమార్ టీపీసీసీ నేతలతో చర్చించారు. ఉత్తమ్‌కుమార్, షబ్బీర్ అలీపై దాడిచేసినవారిపై 24 గంటల్లోగా చర్యలు తీసుకుంటామని ఆయన డీజీపీ తరపున హామీ ఇచ్చారు. దీంతో టీపీసీసీ ధర్నాను విరమించింది. ఇది ప్రజాస్వామ్యమేనా?: జానా పాతబస్తీలో భయోత్పాత వాతావర ణం సృష్టించి రిగ్గింగ్ చేసేందుకు ఎంఐఎం కుట్ర పన్నిందని ప్రతిపక్ష నేత జానారెడ్డి ఆరోపించారు. పురానాపూల్ డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థిని పోలింగ్ పర్యవేక్షించకుండా పోలీసులు నిర్బంధించడం ఎలా సమంజసమని ప్రశ్నించారు. దీనిపై స్పందించి పాతబస్తీకి వెళ్లిన ఉత్తమ్, షబ్బీర్ అలీపై ఎంఐఎం నేతలు దాడులకు దిగడం దారుణమన్నారు. అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అంటూ జానారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్ రోజున ఎంఐఎం బైక్ ర్యాలీకి అనుమతి ఎక్కడిదని ప్రశ్నించారు. దాడులు జరుగుతుంటే పోలీసులు చోద్యం చూశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఎన్నికలు నిర్వహించడం కంటే నామినేట్ చేసుకుంటే సరిపోయేదన్నారు. పురానాపూల్, మీర్చౌక్తోపాటు పాతబస్తీలోని 44 డివిజన్లలో రీ పోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు: భట్టి ఎంఐఎం నేతల ఆగడాలు మితిమీరిపోయినా టీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదంటూ టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వాటిని చూస్తూ ఊరుకోబోమని, తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తపోరాటం: ఉత్తమ్, షబ్బీర్ తమపై దాడికి దిగిన ఎంఐఎం నేతలపై చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం చేస్తే రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేస్తామని ఉత్తమ్‌కుమార్ రెడ్డి, షబ్బీర్ అలీ హెచ్చరించారు. -
అధికార పార్టీతో పొత్తా?
-
అధికార పార్టీతో పొత్తా?
* ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్తో అవగాహనపై కాంగ్రెస్‌లో మంటలు * దేశంలో ఎక్కడైనా ఇలా ఉందా? * దీనికన్నా పార్టీని గంపగుత్తగా విలీనం చేయడమే మేలు: టీపీసీసీ నేతలు * పొత్తు ప్రస్తావనే ఆత్మహత్యాసదృశం: భట్టి సాక్షి, హైదరాబాద్: స్థానిక ప్రజాప్రతినిధుల కోటా నుంచి శాసనమండలికి జరగనున్న ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్తో అవగాహన, పొత్తు కుదుర్చుకునే దిశగా జరుగుతున్న చర్చలపై కాంగ్రెస్‌లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. అధికార పార్టీతో ప్రధాన ప్రతిపక్ష పార్టీ పొత్తుల చర్చలు దేశంలో ఎక్కడైనా ఉన్నాయా అంటూ నిరసన ఆ పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. ‘‘టీఆర్ఎస్తో పొత్తు చర్చ కాంగ్రెస్‌కు మంచిది కాదు. అధికారంలో ఉన్న పార్టీతో చర్చించడం కంటే గంపగుత్తగా విలీనం చేయడమే మేలు. ఒక ట్రెండు సీట్ల కోసం అధికార పార్టీ దగ్గర మోకరిల్లడం అంటే కాంగ్రెస్‌ను, ప్రజా ప్రతినిధులను, కేడర్‌ను అమ్ముకోవడమే. దీన్ని పార్టీ నేతలు, శ్రేణులు ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించరు’’ టీపీసీసీ ముఖ్య నేతలు పలువురు స్పష్టం చేస్తున్నారు. చర్చలు జరిపేవారి హోదా ఏమిటో? వరంగల్ ఉప ఎన్నికల్లో ఓటమికి చాలా కారణాలున్నాయని, వాటిపై సమీక్షించుకుని భవి ష్యత్ పోరాటానికి సిద్ధం కావాలని టీపీసీసీలో కొందరు నేతలు సూచనలు చేస్తున్నారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో గెలుపోటములు అత్యంత సహజమని, ఒక్కసారి ఓడిపోతే అధికార పార్టీ దగ్గర దేబిరించడం ఎలా సమంజసమని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. ‘‘ప్రతిపక్ష పార్టీ అంటే ప్రజల పక్షాన అధికార పార్టీపై పోరాడటం. ఒక్కసారి ఓడిపోతే ఏమైతది? ప్రతిపక్ష పార్టీ సహజ లక్షణమే అధికార పార్టీపై పోరాడటం. దాన్ని వదిలిపెట్టి ఎవరి ప్రయోజనాల కోసం పొత్తులు, అవగాహనలు అం టూ చర్చలు జరుపుతున్నారో అర్థం కావడం లేదు. అసలు అధికార టీఆర్ఎస్తో చర్చలు ఎవరు జరుపుతున్నారో, పార్టీలో వారి హోదా ఏమిటో తెలుసుకోవడం మంచిది. కొందరు నేతల వ్యక్తిగత, రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం కాంగ్రెస్‌ను నాశనం చేయాలని కంకణం కట్టుకున్నట్టున్నారు. కాంగ్రెస్ ఉనికిని లేకుండా చేసేందుకు కొందరు సొంత పార్టీ నేతలే కుట్రలు చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. దీనిపై అధిష్టానం దగ్గర తేల్చుకుంటాం’’ టీపీసీసీ ముఖ్య నేతలు కొందరు పేర్కొన్నారు. పొత్తు ప్రస్తావనే ఉత్పన్నం కాదు: భట్టి అధికార పార్టీతో ఎన్నికల పొత్తులు, అవగాహన అనే చర్చ రావడమే కాంగ్రెస్‌కు ఆత్మహత్యాసదృశమని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క ‘సాక్షి’ ప్రతినిధితో అన్నారు. ‘‘అధికార పార్టీతో ప్రతిపక్ష పార్టీ ఎక్కడైన చర్చలు జరుపుతుందా? ప్రతిపక్ష పార్టీతో పొత్తులు పెట్టుకోవాలనే ప్రస్తావన రావడమే తప్పు. టీఆర్ఎస్తో పొత్తు లేదా అవగాహన అనే ప్రశ్నే ఉత్పన్నం కాదు. టీఆర్ఎస్ను ఓడించడానికి అవసరమైతే కలిసి వచ్చే మిగిలిన అన్ని ప్రతిపక్ష పార్టీలతో కలిసి పనిచేస్తాం. పొత్తుల చర్చల సంగతి నాకు, టీపీసీసీ అధ్యక్షుడికి తెలియదు. పొత్తు అంటూ ఎవరూ నన్ను, టీపీసీసీ అధ్యక్షుడిని అడగలేదు. టీఆర్ఎస్తో పొత్తుల ప్రస్తావనే కాంగ్రెస్‌కు ఆత్మహత్యా సదృశం’’ అని ఆయన స్పష్టం చేశారు. అధికార పార్టీ వైఫల్యాలపై పోరాటానికి తమ పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉన్నాయన్నారు. అధికార పార్టీపై పోరాటంలో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. -
కొట్లాడదామంటే అడ్డుపడతారేం..
* జానాపై టీపీసీసీ నేతల అసంతృప్తి ప్రాణహిత డిజైన్ మార్పు అంశాన్ని ఆసరాగా చేసుకుని సీఎం కేసీఆర్ తీరుపై పోరాడాలని పార్టీ నేతలంతా భావిస్తుంటే జానారెడ్డి మాత్రం ప్రభుత్వాన్ని వెనకేసుకొచ్చేలా మాట్లాడటంపై టీపీసీసీ నేతలు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రాజెక్టు డిజైన్ తుమ్మిడిహెట్టి వద్ద ఉండాలా, మారిస్తే వచ్చే లాభాలేమిటనే దానిపై లోతుగా అధ్యయనం చేయాలని, ప్రాజెక్టు నిర్మాణంలో వందలకొద్దీ సాంకేతిక సమస్యలు ఉంటాయని... అందువల్ల ప్రభుత్వంపై విమర్శలు చేయాలంటే సమగ్ర అవగాహన అవసరమని ఈ సమావేశంలో జానా సూచించడంపై వారు మండిపడ్డారు. ప్రజా సమస్యలపై పోరాటాలకు నాయకత్వం వహించాల్సిన బాధ్యతలో ఉన్న ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడంవల్ల శ్రేణుల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయన్నారు. టీఆర్‌ఎస్‌పట్ల జానా మెతక వైఖరితో ఉన్నారని విస్తృత ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు సరికావన్నారు. -
‘ప్రాణహిత’ మీ ఇంటి వ్యవహారమా?
సీఎం కేసీఆర్‌పై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ ధ్వజం * ప్రాజెక్టు డిజైన్ మార్పుపై నిపుణుల అభిప్రాయాలు వద్దా? * దీన్ని మేం అంగీకరించం, ప్రభుత్వంపై పోరాడతాం * ఈ అంశంపై సాగునీటి రంగ నిపుణులతో టీపీసీసీ నేతల భేటీ సాక్షి, హైదరాబాద్: వేల కోట్ల ప్రజాధనం, భావితరాల భవిష్యత్తుతో ముడిపడిన ప్రాణహిత ప్రాజెక్టు విషయంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అనుసరిస్తున్న వైఖరిపై టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధ్వజమెత్తారు. శాసనసభలో చర్చించకుండా, నిపుణుల సలహాలు తీసుకోకుండా, మేధావుల అభిప్రాయాలను పట్టించుకోకుండా ప్రాజెక్టు డిజైన్‌ను మార్చాలని కేసీఆర్ నిర్ణయించడాన్ని ఉత్తమ్ తప్పుబట్టారు. ఇదేమైనా సీఎం సొంతింటి వ్యవహారమా? అని ప్రశ్నించారు. ప్రాణహిత డిజైన్ మార్పును అంగీకరించబోమని స్పష్టం చేశారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును తుమ్మిడిహెట్టి నుంచి కాళేశ్వరం దిగువకు మార్చాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో దీనివల్ల రాష్ట్రానికి కలిగే లాభనష్టాలపై అవగాహన కోసం సాగునీటిరంగ నిపుణులు, జలసాధన సమితి నేతలతో టీపీసీసీ నేతలు గురువారం గాంధీభవన్‌లో సమావేశమయ్యారు. ప్రతిపక్ష నేతలు కె.జానారెడ్డి, షబ్బీర్ అలీ, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మాజీ మంత్రులు సుదర్శన్‌రెడ్డి, జి.వినోద్, సునీతా లక్ష్మారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, డి.కె.అరుణ, డీసీసీ నేతలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, ముఖ్యనేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా జలసాధన సమితి నేత గోవర్ధన్ ప్రాణహిత పాత డిజైన్ వల్ల ఉపయోగాలు, కొత్త డిజైన్ వల్ల నష్టాలను నేతలకు వివరించారు. వ్యాప్కోస్ సంస్థ తన నివేదికలో తుమ్మిడిహెట్టి వద్ద 160 టీఎంసీల నీరు అందుబాటులో ఉంటుందని పేర్కొందని, ఆ ప్రకారమే అక్కడ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టేందుకు అప్పటి సీఎం వై.ఎస్.రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేశారని వివరించారు. కాంగ్రెస్ హయాంలోనే 16 ప్రాంతాల్లో కాలువలు, సొరంగాల తవ్వకానికి వేల కోట్లు ఖర్చుచేశారన్నారు. తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణం చేపడితే గ్రావిటీ ద్వారా నీరు వస్తుందని, కరెంటు ఉత్పత్తికి కూడా అవకాశముందని గోవర్ధన్ వివరించారు. దీన్ని మార్చాలనే ఆలోచన సరికాదని, అన్ని సంఘాలు, పార్టీలు ప్రాణహితను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఉత్తమ్ మాట్లాడుతూ ప్రాణహిత ప్రాజెక్టు తెలంగాణకు ప్రాణాధారమని, గుండెకాయ వంటిదన్నారు. ప్రాజెక్టును పూర్తిచేయాలంటూ టీఆర్ఎస్ నేతలు గతంలో ఉద్యమించారని గుర్తుచేశారు. దీని నిర్మాణానికి ఇప్పటికే 36 అనుమతులు వచ్చాయని, ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రతిపాదన కూడా కేంద్రం వద్ద ఉందన్నారు. ఈ దశలో ప్రాజెక్టు డిజైన్ మార్పు వల్ల వచ్చే ప్రయోజనాలు ఏమిటో, కాళేశ్వరం దగ్గర ప్రాజెక్టును పూర్తిచేయడం వల్ల రాష్ట్రానికి వచ్చే లాభం ఏమిటో చెప్పకుండా నిర్ణయం ఎలా తీసుకుంటారని ఆయన ప్రశ్నించారు. డిజైన్ మార్పు వల్ల కలిగే నష్టాలపై లోతుగా అధ్యయనం చేసి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాడతామన్నారు. ప్రాజెక్టుల నిర్మాణంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీని తక్షణమే సమావేశపరచి వివరించాలని, లేకుంటే అఖిలపక్ష సమావేశంలో చర్చించాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. -
'ఉల్లంఘిస్తే అరెస్ట్‌లు తప్పవు'
హైదరాబాద్: సచివాలయాన్ని ఎర్రగడ్డకు... చెస్ట్ ఆసుపత్రిని అనంతగిరికి తరలించొద్దంటూ టీ పీసీసీ ఆధ్వర్యంలో శనివారం గాంధీభవన్ నుంచి రాజ్‌భవన్ వరకు పాదయాత్ర నిర్వహించనుంది. కాగా ఈ పాదయాత్రకు నగర పోలీసులు అనుమతి నిరాకరించారు. తాము అనుమతి కోరిన పోలీసులు నిరాకరించారంటూ టీ పీసీసీ నేతలు ఆరోపిస్తున్నారు. దీంతో గాంధీభవన్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. పాదయాత్రలో పాల్గొనే నేతలు, కార్యకర్తలను తరలించేందుకు పోలీసులు వాహనాలను సిద్ధం చేశారు. తమ ఆదేశాలు ఉల్లంఘిస్తే.. అరెస్ట్‌లు తప్పవంటూ కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర సచివాలయాన్ని ఎర్రగడ్డకు... చెస్ట్ ఆసుపత్రిని అనంతగిరికి తరలించాలని కేసీఆర్ సర్కార్ నిర్ణయించింది. ఈ నిర్ణయంపై అన్ని రాజకీయా పార్టీల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు గాంధీ భవన్ నుంచి రాజ్ భవన్ వరకు పాదయాత్ర నిర్వహించి... గవర్నర్‌కు వినతిపత్రం సమర్పించాలని భావించారు. పాదయాత్రకు పోలీసుల అనుమతి కోరగా... వారు నిరాకరించారు.