
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్లమెంటరీ పక్ష (సీపీపీ) నేతగా సోనియాగాంధీ ఎన్నిక కావడం పట్ల పలువురు టీపీసీసీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. యూపీఏ చైర్‌పర్సన్‌గా పదేళ్ల పాటు సమర్థంగా ప్రభుత్వాన్ని నడపడంతో పాటు ఎక్కువ కాలం ఏఐసీసీ అధ్యక్షురాలిగా పనిచేసిన అనుభవం ఉన్న ఆమె సీపీపీ నేతగా ఎన్నికవడం స్వాగతించదగిన విషయమని వారు అన్నారు. సోనియా నాయకత్వంలో కాంగ్రెస్ ఎంపీలు దేశంలోని ప్రజాసమస్యలపై విస్తృతంగా పోరాడతారని, ఆమె నేతృత్వంలో పార్టీ మరింత బలపడి రాబోయే రోజుల్లో అధికారంలోకి వచ్చే స్థాయికి చేరుతుందన్నారు. హర్షం వ్యక్తం చేసిన వారిలో టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, సీఎల్పీ మాజీ నేత జానా రెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రావణ్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లు పొన్నం ప్రభాకర్, జెట్టి కుసుమకుమార్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు ఎంఆర్‌జీ వినోద్‌రెడ్డి, బొల్లు కిషన్ తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment