
సాక్షి, హైదరాబాద్: ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని టీపీసీసీ నేతలు ఆరోపించారు. దాదాపు 20 నియోజకవర్గాల్లో ఇలాంటి పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. ఇది చాలా బాధాకరమైన విషయమన్నారు. శనివారం సచివాలయంలో ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్, మాజీ ఎమ్మెల్యేలు మల్‌రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్‌రెడ్డిలు విలేకరులతో మాట్లాడారు. విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ వికారాబాద్‌లో కోర్టు పరిధిలో ఉన్న 25 స్ట్రాంగ్ రూంలోని ఈవీ ఎంలను అధికారులు తెరిచారని, దీనిపై ఢిల్లీలో ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశామన్నారు. ఇక్కడ సీఈవోకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదన్నారు.
మనిషి తప్పు చేస్తాడు కానీ మిషన్లు కాదన్నారు. ప్రసాద్‌కుమార్ మాట్లాడుతూ.. కేసీఆర్ ఇక్కడ వచ్చి ప్రచారం చేసినా తాను గెలిచేవాడినని.. ఇక్కడ ఓడిపోవడం బాధ కలి గించిందన్నారు. 518 ఓట్లు ఉంటే 555 అని ఈవీఎంలలో చూపిస్తుందని, దీనిపై సీఈవోకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని వాపోయారు. అధికారులపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఆదేశాలు వచ్చాయన్నారు. అక్కడ మళ్లీ రీపోలింగ్ జరపాలని డిమాండ్ చేశారు. మల్‌రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో జరిగిన ఎన్నికల తీరు బాధాకరమన్నారు. ఈవీఎంల మీద నమ్మకం లేకే వీవీప్యాట్‌లను తెచ్చినా న్యాయం జరగడంలేదని పేర్కొన్నారు. రామ్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఇబ్రహీంపట్నం, పరిగి ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment