
కొట్లాడదామంటే అడ్డుపడతారేం..
* జానాపై టీపీసీసీ నేతల అసంతృప్తి
ప్రాణహిత డిజైన్ మార్పు అంశాన్ని ఆసరాగా చేసుకుని సీఎం కేసీఆర్ తీరుపై పోరాడాలని పార్టీ నేతలంతా భావిస్తుంటే జానారెడ్డి మాత్రం ప్రభుత్వాన్ని వెనకేసుకొచ్చేలా మాట్లాడటంపై టీపీసీసీ నేతలు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు.
ప్రాజెక్టు డిజైన్ తుమ్మిడిహెట్టి వద్ద ఉండాలా, మారిస్తే వచ్చే లాభాలేమిటనే దానిపై లోతుగా అధ్యయనం చేయాలని, ప్రాజెక్టు నిర్మాణంలో వందలకొద్దీ సాంకేతిక సమస్యలు ఉంటాయని...
అందువల్ల ప్రభుత్వంపై విమర్శలు చేయాలంటే సమగ్ర అవగాహన అవసరమని ఈ సమావేశంలో జానా సూచించడంపై వారు మండిపడ్డారు. ప్రజా సమస్యలపై పోరాటాలకు నాయకత్వం వహించాల్సిన బాధ్యతలో ఉన్న ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడంవల్ల శ్రేణుల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయన్నారు. టీఆర్‌ఎస్‌పట్ల జానా మెతక వైఖరితో ఉన్నారని విస్తృత ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు సరికావన్నారు.