ఏఐసీసీ ప్రధానకార్యదర్శి, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌తో టీపీసీసీ అగ్రనేతలు భేటీ అయ్యారు.
ఎన్నికల ఫలితాలపై ఆత్మశోధన
సాక్షి, హైదరాబాద్: ఏఐసీసీ ప్రధానకార్యదర్శి, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌తో టీపీసీసీ అగ్రనేతలు భేటీ అయ్యారు. గురువారం రాత్రి హైదరాబాద్‌లోని ఒక హోటల్లో టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి, శాసనమండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ, సర్వే సత్యనారాయణ, జె.గీతారెడ్డి, దామోదర రాజనర్సింహా, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల ముఖ్యనేతలు కలిశారు. ఈ సందర్భంగా గ్రేటర్, వరంగల్, నారాయణఖేడ్ ఉపఎన్నికల ఫలితాలపై దిగ్విజయ్ ఆరా తీశారు.
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నేతలు కొందరు టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా పనిచేసినట్లు ఫిర్యాదు చేశారు. గ్రేటర్ ఎన్నికలకు ముందు జానారెడ్డి తీరుపైనా దిగ్విజయ్‌కు ఫిర్యాదు చేశారు. పరస్పర ఫిర్యాదులతో పార్టీకి నష్టం చేసుకోవద్దని, అందరితో సమావేశమై చర్చించుకుందామని దిగ్విజయ్ చెప్పినట్లు పార్టీ నేతలు తెలిపారు.