కొందరు పీసీసీ నేతల ప్రతిపాదన
సాక్షి, హైదరాబాద్: ఖమ్మం, వరంగల్, అచ్చంపేట, సిద్దిపేట పుర పాలి కలకు త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో టీపీసీసీ నేతలు తర్జనభర్జన పడుతున్నారు. ఈ ఎన్నికలకు దూరంగా ఉంటే ఎలా ఉంటుందని కొందరు నేతలు ప్రతిపాదించినట్లు తెలిసింది. కాంగ్రెస్ ముఖ్యనేతలు కొందరు గాంధీభవన్‌లో బుధవారం సమావేశమయ్యారు. రానున్న పురపాలక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై స్థూలంగా చర్చించినట్లు తెలిసింది. వరుసగా వస్తున్న ఉప ఎన్నికలు, స్థానిక ఎన్నికల వల్ల రాష్ట్రస్థాయిలో చేపట్టాల్సిన పోరాటాలు, విధానాలపై స్పష్టత రావడం లేదని ఒక నాయకుడు చెప్పినట్లు తెలిసింది.
ఇలాంటి ఎన్నికలు సహజంగానే అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలంగా ఉంటాయని పేర్కొన్నట్లు సమాచారం. మున్సిపాలిటీల బాధ్యతలను ఆయా జిల్లాల పార్టీ యంత్రాంగాలకు అప్పగించాలని ప్రతిపాదించారు. రాష్ట్ర పార్టీగా స్థానిక ఎన్నికలపై దృష్టిని కేంద్రీకరించకుండా, పర్యవేక్షణకు, సూచనల వరకే పరిమితం కావాలని సూచిం చారు. జిల్లాల నేతలకే ఎన్నికల నిర్వహణ బాధ్యతను అప్పగించాలని నిర్ణయించారు. ఈ మున్సిపాలిటీల్లో పేపర్ బ్యాలెట్ నిర్వహించాలని కోరేందుకు నేడో, రేపో ఎన్నికల కమిషన్‌ను కలవాలని నిర్ణయించారు.
ఖమ్మం, వరంగల్ ఎన్నికలకు దూరం?
Published Thu, Feb 18 2016 12:23 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement