
‘సమస్యలను ప్రశ్నిస్తే ఉలికిపాటెందుకు?’
టీఆర్‌ఎస్ తీరుపై మండిపడ్డ టీపీసీసీ నేతలు
సాక్షి, హైదరాబాద్: సమస్యలను ప్రశ్నించిన జేఏసీ చైర్మన్ కోదండరాంపై దాడులు చేయించడం అప్రజా స్వామికమని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి, అధికార ప్రతి నిధి బెల్లయ్యనాయక్ విమర్శించారు. గాంధీభవన్‌లో మంగళవారం విలేక రులతో వారు మాట్లాడుతూ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని అడగడం నేరమా అని ప్రశ్నించారు. నియంతృత్వ ధోరణితో ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహరిస్తున్నారన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కోదండరాంపై ఎవరు మాట్లాడినా నాలుకలు కోస్తామని హెచ్చరించిన టీఆర్‌ఎస్ నాయకులు ఇప్పుడేం చేస్తున్నారని ప్రశ్నించారు.
నేడు కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవం: కాంగ్రెస్‌పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఉత్సవాలను నిర్వహించాలని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు.