రాష్ట్రంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ)ల అధ్యక్షుల నియామకానికి మరికొంతకాలం బ్రేక్ పడినట్టుగా కనిపిస్తోంది. డీసీసీ అధ్యక్షుల నియామకానికి ఏఐసీసీ నిర్దేశించిన అర్హతలు, నిబంధనల ప్రకారం క్షేత్రస్థాయిలో నేతలకు అవరోధాలు ఎదురవుతున్నట్టుగా టీపీసీసీ నేతలు వెల్లడించారు. డీసీసీ అధ్యక్షులుగా పనిచేయాలంటే రానున్న ఎన్నికల్లో ప్రత్యక్షంగా పోటీ చేయడానికి అవకాశం రాదని పెట్టిన నిబంధన.. చాలా జిల్లాల్లో ఇబ్బందులను తెచ్చిపెడుతోంది. ఎన్నికల్లో పోటీ చేయకుండా రాజ కీయాల్లో ఎవరు పనిచేస్తారన్న ప్రశ్న జిల్లాల్లో తలెత్తుతోంది. లోక్‌సభకు, శాసనసభకు పోటీ చేయకూడదనే నిబంధనతో పలువురు నేతలు ఆ పదవి చేపట్టడానికి వెనుకంజ వేస్తున్నారు.