
సాక్షి, హైదరాబాద్/కోదాడ: రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే మంగళవారం హైదరాబాద్ వచ్చారు. నాగ్‌పూర్ నుంచి వచ్చిన ఆయనకు టీపీసీసీ నేతలు హర్కర వేణుగోపాల్‌రావు, సంగిశెట్టి జగదీశ్వర్‌రావు తదితరులు విమానాశ్రయంలో ఘనస్వాగతం పలికారు. అక్కడ కాసేపు టీపీసీసీ నేతలతో మాట్లాడిన ఠాక్రే ఏఐసీసీ కార్యదర్శు లు బోసురాజు, రోహిత్‌చౌదరితో కలిసి నేరుగా కోదాడ వెళ్లిపోయారు.
మంగళవారంరాత్రి అక్కడే ఉండనున్న ఆయన బుధవారం ఉద యం నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో భేటీ అయి జోడో యాత్రలపై సమీక్ష నిర్వహిస్తారు. ఆ తర్వాత కోదాడలో హాథ్‌సే హాథ్‌జోడో యాత్రలో పాల్గొని ములుగు వెళ్లనున్నారు. ఐదు రోజుల పాటు తెలంగాణలోనే ఉండనున్న ఆయన వరంగల్ జిల్లాలో పర్యటిస్తారు. అనంతరం రెండు రోజులు గాంధీభవన్‌లో పార్టీ ముఖ్య నేతలతో సమావేశాలు నిర్వహించనున్నారు. ఠాక్రే వెంట నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఉన్నారు.