సాక్షి, హైదరాబాద్ : యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ పుట్టిన రోజు సందర్భంగా టీపీసీసీ నేతలు గాంధీభవన్‌లో ఆదివారం ఉదయం సంబరాలు చేసుకున్నారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన పుట్టినరోజు వేడుకల్లో టీపీసీసీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అనంతరం ఉత్తమ్‌కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘దేశం కోసం సేవలందించిన ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీలను సోనియా దారుణమైన పరిస్థితుల్లో కోల్పోయారు. వారి ఆశయాల సాధన కోసం రాజకీయాల్లోకొచ్చి అసలైన త్యాగానికి అర్థం చెప్పారు. పేదల అభ్యున్నతికి పనిచేసి రైట్ టు ఇన్ఫర్మేషన్, రైట్ టు ఎడ్యుకేషన్, గ్రామీణ ఉపాధి హామీ పథకం, ఆహార భద్రతా పథకాలు తీసుకొచ్చేలా యూపీఏ ప్రభుత్వాన్ని నడిపించారు. మరెన్నో చారిత్రాత్మక చట్టాలను తీసుకురావడంలో కృషిచేశారు. ప్రధానమంత్రి పదవిని చేపట్టే అవకాశాల్ని సైతం ఆమె వదులుకున్నారు. ఆరు దశాబ్దాల తెలంగాణ ప్రజల కలను సాకారం చేసి రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. ఆమెకు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల తరపున హార్థిక జన్మదిన శుభాకాంక్షలు’ అని ఉత్తమ్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment