సాక్షి, హైదరాబాద్: తెలంగాణ తల్లి ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా చూడలేదని, డిసెంబర్ 7న ఎల్బీ స్డేడియంలో సోనియా గాంధీ వచ్చినప్పుడు తెలంగాణ తల్లి అంటే ఈ రూపంలో ఉంటుందని ప్రజలందరూ భావించారని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎల్బీ స్టేడియంలోకి సోనియా గాంధీ ప్రవేశించిన సమయంలో లక్షలాదిమంది తెలంగాణ బిడ్డలు లేచి స్వాగతం పలికారని, ఆ క్షణం ఆమె మొఖంలో కనిపించిన సంతోషం, సంతృప్తి ఎప్పటికీ మర్చిపోలేనన్నారు. తెలంగాణకు కష్టం వచ్చినా, నష్టం వచ్చినా కాంగ్రెస్ అండగా ఉంటుందని సోనియా ఓ తల్లిలా భరోసా ఇచ్చారని గుర్తు చేశారు.
తెలంగాణ బిడ్డలకు సోనియానే తల్లి అని ఆయన అభివర్ణించారు. శనివారం గాం«దీభవన్‌లో జరిగిన ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీ జన్మదిన వేడుకల్లో మంత్రులతో కలసి సీఎం ముఖ్యఅతి«థిగా పాల్గొన్నారు. సీనియర్ నేత వి.హనుమంతరావుతో కలసి 78 కిలోల కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజల కోసం సోనియా ఆరు గ్యారంటీలను ఇచ్చి మరింత భరోసా కvచారన్నారు.
పాలకుడిగా కాకుండా సేవకుడిగా ప్రజలందరి ఆకాంక్షలు నెరవేర్చే బాధ్యత తనదన్నారు. కాంగ్రెస్ కార్యకర్తల కృషి వల్లే తాము పదవుల్లో కూర్చున్నామని చెప్పారు. పదేళ్లు కార్యకర్తలు వేల కేసులు ఎదుర్కొన్నారని.. కార్యకర్తలకు మాట ఇస్తున్నానని.. ఈ ప్రభుత్వం కార్యకర్తలదేనని ప్రకటించారు.
సీఎంకు సేవాదళ్ గౌరవ వందనం
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ప్రకటన వచ్చిన డిసెంబర్ 9 చరిత్రాత్మకమైన రోజని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నా రు. కార్యక్రమంలో ఏఐసీసీ ఇన్ చార్జి మాణిక్ రావు ఠాక్రే, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీత క్క, కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహే‹శ్ కుమార్ గౌడ్, మాజీ రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు, పీసీసీ నేతలు తదితరులు పాల్గొన్నారు. సీఎం హోదాలో గాందీభవన్‌కు వచ్చి న రేవంత్ సేవాదళ్ కార్యకర్తల గౌరవ వందనం స్వీకరించారు.
Comments
Please login to add a commentAdd a comment