
చెట్లు గాలి పీల్చుకుంటాయని అవి కార్బన్‌డయాక్సైడ్‌ని పీల్చుకుని ఆక్సిజన్ వదలుతాయని విన్నాం. ఔనా! కానీ చెట్టు గాలి పీల్చుకుంటాయనే తెలుసు తప్ప కళ్లతో చూడలేం కదా. వృక్షశాస్త్ర పితామహుడు జగదీష్ చంద్రబోస్ లాంటి శాస్త్రవేత్తలు వివిధ ప్రయోగాల ద్వారా చెట్టు గాలి పీల్చుకుంటాయని పరిశోధనల్లో వెల్లడించారని మనం చిన్నానాటి పుస్తకాల్లో చదివిన జ్ఞాపకమే తప్ప. వాస్తవంగా కుదరదు. ఒకవేళ ఏమైన శాస్త్రవేత్తల సమక్షంలో ప్రత్యేకమైన పరికరాల సాయంతో చూడవచ్చునేమో మరీ. కానీ ఇక్కడొక చెట్టు మాత్రం మనుషులు గాలి పీల్చుకుంటున్నట్లు ఎలా తెలుస్తోందో అలా ఈ చెట్టును చూస్తే నేరుగా తెలిసిపోతుంది.
వివరాల్లోకెళ్తే...కెనడాలో కాల్గరీలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇటీవల కాల్గరీలో గంటకు 70 కిమీ వేగంతో బలమైన గాలులతో కూడిన వర్షాలు వచ్చాయి. ఆ విపత్తు అనంతరం ఒక వ్యక్తి ఏదైనా చెట్టు పడిపోయే స్థితిలో ప్రమాదకరంగా ఉన్నాయా? అని చెక్ చేయడానికి అడవిలోకి వచ్చినప్పుడూ ఈ వింత చూసినట్లు పేర్కొన్నాడు.
ఆ చెట్టు పెద్దగా పగ్గుళ్లు వచ్చి గాలి వీచినప్పుడల్లా గాలి పీల్చుకుంటున్నట్లు ఉందని వివరించాడు. అంతేకాదు ఆ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. పైగా ఈ వీడియోకి ఐదు మిలియన్ల వ్యూస్, నాలుగు వేల లైక్‌లు వచ్చాయి. మీరుకూడా ఓ లుక్కేయండి.
(చదవండి: ముగ్గురు దొంగల చిలిపి పని... భయపడి చస్తున్న నివాసితులు!)
Comments
Please login to add a commentAdd a comment