హెల్త్‌టిప్స్
నిమ్మరసంలోని యాంటీఆక్సిడెంట్లు ఆరోగ్యాన్ని కాపాడతాయి. కాబట్టి ఫ్రూట్‌జ్యూస్‌లో కాని, ఆహారంలో కాని నిమ్మరసాన్ని కలుపుకుని తీసుకుంటుంటే ఆరోగ్యం మెరుగవుతుంది. తేనెటీగలు కాని మరేవైనా కీటకాలు కాని కుట్టినప్పుడు వెంటనే గాయాన్ని నీటితో తడిపి ఉప్పుతో కవర్ చేయాలి. ఇలా చేస్తే నొప్పి వెంటనే తగ్గిపోతుంది. ఇది డాక్టరును సంప్రదించే లోపు నొప్పి లేకుండా ఉండడానికి చేసే ప్రథమ చికిత్స మాత్రమే.
పళ్లు, చిగుళ్లకు సంబంధించి ఏ రకమైన అసౌకర్యం ఉన్నా పుదీనా ఆకులను నమిలినట్లయితే సమస్య పరిష్కారమవుతుంది. ప్రతిరోజూ రాత్రి భోజనం తరువాత ఒకటి–రెండు పుదీనా ఆకులను తింటే నోట్లో క్రిములు చేరవు. నోటి దుర్వాసనతో బాధపడే వాళ్లు ఉదయం, సాయంత్రం రెండు– మూడు ఆకులను నములుతుంటే శ్వాస తాజాగా ఉంటుంది.