‘హీరోయిన్‌ హారికకు అసభ్యంగా మెసేజ్ చేశా’ | Short film heroine files complaint against Director Yogi | Sakshi
Sakshi News home page

‘హీరోయిన్‌ హారికకు అసభ్యంగా మెసేజ్ చేశా’

Published Sat, Dec 23 2017 11:56 AM | Last Updated on Mon, Aug 27 2018 3:32 PM

Short film heroine files complaint against Director Yogi - Sakshi

తన పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించాడంటూ షార్ట్ ఫిల్మ్ హీరోయిన్ హారిక హైదరాబాద్, గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ వివాదంపై ఓ టీవీ చానల్ ఇంటర్వ్యూలో స్పందించిన యోగి తాను ఆమెను వేదించలేదని.. కేవలం పది వేల రూపాయల విషయంలో జరిగిన వివాదమే ఇందుకు కారణమని తెలిపాడు. అదే సమయంలో డీసీపీ గంగిరెడ్డి తనపై దాడి చేస్తున్న వీడియోను తాను రిలీజ్ చేయలేదని ఆ వీడియో కూడా హారికనే షూట్ చేసిన తన మిత్రులకు షేర్ చేసిందని తెలిపారు.

తాను హారికను ఏ రోజు వేధింంచలేదని తెలిపారు ‘గతంలో తన వ్యక్తిగత విషయాలు హారిక నాతో షేర్ చేసుకునేది. ఆ విషయాలు మరో వ్యక్తి కారణంగా బయటకు వచ్చాయి. కానీ నేనే ఆ విషయాలను బయటపెట్టానని నా మీద కోపం పెంచుకుంది. నువ్వు నా పరువు తీశావు.. నేను కూడా నీ సంగతి చూస్తానంటూ నా మీద ఆరోపణలు చేసింది. అంతే కాదు ఇండస్ట్రీలో నాకు తెలిసిన వ్యక్తులకు ఫోన్ చేసి నా గురించి తప్పుగా చెప్పేది’ అన్నారు.

తన మీద తప్పుడు ప్రచారం చేయటం ఆపేస్తేనే హారిక దగ్గర తీసుకున్న పదివేల రూపాయలు తిరిగిస్తానని చెప్పానన్నారు. హారికతో తానెప్పుడు కలిసి పని చేయలేదన్న యోగి.. ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా ఆమె పరిచయం అయ్యిందని తెలిపారు. తాను హారికకు అసభ్యంగా మెసేజ్ చేసిన మాట వాస్తవమేనని, అయితే ఆమె రెచ్చగొట్టడం వల్లే అలా చేశానన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement