సాక్షి, హైదరాబాద్ : షార్ట్‌ఫిల్మ్ డైరెక్టర్ యోగి తనను చెడుగా చూపించే ప్రయత్నం చేస్తున్నాడని షార్ట్‌ఫిల్మ్ నటి హారిక చెప్పింది. తప్పు చేసిన వ్యక్తిని ఓ డీసీపీ బూటుతో తంతే తప్పేముందని, పోలీసులముందే తనను యోగి బూతు మాటలు అంటుంటే తన్నారని అన్నారు. అదే దుబాయ్‌లో అయితే కాలో చేయో తీస్తారని పేర్కొన్నారు. తాను ఏ తప్పు చేయలేదంటూ యోగి పోలీసులకు కొన్ని వాట్సాప్ మెసేజ్‌లను పంపించడంపై ఆమె స్పందిస్తూ ఓ సెల్ఫీ వీడియోను తాజాగా మీడియాకు పంపించింది.
ఎంతో మంది ఉద్యోగాలు చేస్తున్న వారు, చదువుకుంటున్నవారు జెన్యూన్‌గా నటించాలని ఇండస్ట్రీకి వస్తుంటారని, అలాంటి వారు యోగిలాంటి వారి బారిన పడకూడదనే తాను ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదును ఇచ్చానన్నారు. తానే స్వయంగా యోగికి అలాంటి మెసేజ్‌లు పెడితే ఎందుకు ఫిర్యాదు చేస్తానని అన్నారు. తన ఇమేజ్‌ను మీడియా సాక్షిగా దెబ్బకొట్టాననే అక్కసుతోనే తనపై యోగి కక్షపూరితంగా వ్యవహరిస్తున్నాడని, అతడిది పూర్తిగా క్రిమిలన్ బ్రెయిన్ అని మండిపడ్డారు. అతడిపై ఇప్పటికే మూడు లైంగిక వేధింపుల కేసులు ఉన్నాయని గుర్తు చేశారు. న్యాయం తనవైపే ఉందని, యోగిపై ఎందాకైనా పోరాడుతానని స్పష్టం చేశారు. ఏ అమ్మాయి కూడా వేధింపులను సహించకూడదని, ధైర్యంగా పోలీసులకు చెప్పాలని తెలిపారు.
‘బూతు మాట్లాడితే డీసీపీ బూటుతో తన్నాడు.. తప్పా?’
Comments
Please login to add a commentAdd a comment