‘జేడీ చక్రవర్తి భార్యను కూడా వేధించాడు’ | Harika files complaint against Director Yogi | Sakshi
Sakshi News home page

యోగి చాలామంది అమ్మాయిలను వేధించాడు..

Published Sat, Dec 23 2017 1:39 PM | Last Updated on Mon, Aug 27 2018 3:32 PM

Harika files complaint against Director Yogi - Sakshi

యోగితో వివాదంపై షార్ట్ ఫిలిం హీరోయిన్ హారిక స‍్పందించారు. పది వేల రూపాయల కోసమే ఇంత రాద్ధాంతం చేస్తున్నానని యోగి  చెప్పడం అవాస్తవమని ఆమె అన్నారు. తనను యోగి వేధించిందనందుకే పోలీసులను ఆశ్రయించానని తెలిపారు. తనతో పాటు తన భర్తకు కూడా అసభ్యకర పదాలతో మెసేజ్ లు చేశాడని, సాక్ష్యాలను పోలీసులకు అందించానని తెలిపారు. పది రోజుల క్రితం వరకు బాగానే ఉన్న యోగి కొద్ది రోజులుగానే ఇలా ప్రవర్తిస్తున్నాడని హారిక తెలిపారు.

యోగి గతంలో కూడా కొంత మంది అమ్మాయిలను ఇలాగే వేధించాడని.. గతంలో జేడీ చక్రవర్తి భార్య అనుకృతి కూడా ‘పాప’ అనే షార్ట్ ఫిలిం సమయంలో యోగిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు హారిక తెలిపారు. అతడు బయటకు కనిపించేంత మంచి వాడు కాదని, అందరి ముందు ఎంతో మర్యాదగా నటించే యోగి గతంలో చాలా మంది అమ్మాయిలను ఇబ్బంది పెట్టాడని ఆరోపించారు. యోగి గురించి బయట చెడుగా ప్రచారం జరుగుతున్న విషయాన్ని ప్రస్తుతం అతనితో రిలేషన్ లో ఉన్న అమ్మాయికి చెప్పానని, దీంతో తన మీద పగ పెంచుకున్నట్లు హారిక తెలిపారు. తనపై వేధింపులకు దిగటంతో గతంలో ఇచ్చిన డబ్బు వెనక్కి ఇచ్చేయమన్నానని.. అప్పటి నుంచి వేధింపులు మరింత ఎక్కువయ్యాయని ఆమె పేర్కొన్నారు. ఇదే విషయంపై ఫిర్యాదు చేశానని, అయితే పోలీసుల ఎదుట కూడా యోగి అసభ్యకర భాష వాడటం వల్లే...అడిషనల్‌ డీసీపీ యోగిని కొట్టినట్లు చెప్పారు.

మరోవైపు సైబరాబాద్‌ అడిషనల్‌ డీసీపీ గంగిరెడ్డి యోగీని కాలుతో కొట్టన వ్యవహారంపై మాదాపూర్ డీసీపీ విశ్వప్రసాద్ స్పందించారు. మూడు రోజుల క్రితం షీ టీంకి డైరెక్టర్ యోగిపై ఫిర్యాదు చేసిన హారిక.. తరువాత తనే ఫిర్యాదు వద్దు యోగీకి కౌన్సెలింగ్ చేయమని కోరిందని తెలిపారు. అడిషనల్ డీసీపీ గంగిరెడ్డి ఆధ్వర్యంలో విచారణ జరిగిందన్నారరు. ఆ సమయంలో డైరెక్టర్ యోగి అసభ్యంగా మాట్లాడటంతో డీసీపీ గంగారెడ్డి.. యోగిని బూటు కాలుతో తన్నినట్లు వీడియో బయటకు వచ్చిందని తెలిపారు. వీడియో ఎలా బయటకు వచ్చిందో తెలియదన్న విశ్వప్రసాద్..  డీసీపీ గంగిరెడ్డి అలా చేయటం మాత్రం కరెక్ట్ కాదన్నారు. ఈ విషయాన్ని కమిషనర్ సందీప్ శాండిల్యా దృష్టికి తీసుకెళ్లామని ఆయన చర్యలు తీసుకుంటారని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement