Anukriti Sharma
-
‘పవర్’ఫుల్ ఐపీయస్ ఆఫీసర్
మనం సాంకేతికంగా ఎంత వేగంగా దూసుకుపోతున్నా, కొన్ని ప్రాంతాలలో మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే... అన్నట్లుగా ఉంది పరిస్థితి. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌కు చెందిన 70 సంవత్సరాల నూర్జహాన్ ఇంట్లో ఒక్కసారి కూడా బల్బ్ వెలగలేదు. ఆ ఇంటికి ఎలక్ట్రిసిటీ లేదు. విషయం తెలిసిన ఐపీయస్ ఆఫీసర్ అనుకృతిశర్మ వ్యక్తిగత చొరవ తీసుకొని ఆ ఇంటికి కరెంట్ తీసుకు వచ్చింది. బామ్మ కళ్లలో వెలుగులు నింపింది. ఆ ఇంట్లో బల్బ్ వెలగడమే కాదు ‘మీరు చల్లగా ఉండాలి’ అంటున్నట్లుగా ఫ్యాన్ తిరగడం మొదలుపెట్టింది. దీంతో బామ్మ ముఖం సంతోషంతో వెలిగిపోయింది. అనుకృతిని ఆలింగనం చేసుకొని స్వీట్లు పంచింది. ‘ఆమె ముఖంలో కనిపించిన సంతోషం నాకెంతో సంతృప్తిని ఇచ్చింది’ అంటూ ఈ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేసింది అనుకృతి. అనుకృతి శర్మ దయాహృదయానికి నెటిజనులు జేజేలు చెప్పారు. ‘బామ్మ ఇంట్లోనే కాదు జీవితంలోనూ వెలుగులు నిండాలి’ అంటూ కామెంట్స్ పెట్టారు. -
ఆ అవ్వ కళ్లలో ఆనందం.. ఐపీఎస్ అనుపై ప్రశంసలు
Viral Video: భావోద్వేగ సన్నివేశాలను తెర మీద చూసినప్పుడు కలిగే ఆనందం మాటల్లో వర్ణించలేనిది. అలాంటి క్షణాలు నిజజీవితంలోనూ కలిగితే!. ఆ ఆనందానికి అవధులు ఉంటాయా?.. కొన్ని కోట్లు ఖర్చు చేసినా అలాంటి ఆనందం దొరకదు మరి. యువ ఐపీఎస్ అధికారిణి అనుకృతి విషయంలోనూ అదే జరిగిందట. ఆ క్షణాల్ని ఆమె పంచుకోగా.. పలువురు అభినందిస్తున్నారు కూడా. ఉత్తర ప్రదేశ్ బులందర్‌షెహర్ జిల్లా ఐపీఎస్ అధికారిణి అనుకృతి శర్మ స్వయంగా ‘స్వదేశ్’చిత్ర అనుభూతిని పొందారట. ఆ హిందీ చిత్రంలో నాసా సైంటిస్ట్ అయిన షారూక్ ఖాన్ తన ఊరికి కరెంట్ తెప్పించడానికి చేసే ప్రయత్నాన్ని డైరెక్టర్ అశుతోష్ గోవార్కికర్ స్క్రీన్ మీద ఎంతో ఎమోషనల్‌గా చూపించారు. అలాంటి క్షణాల్ని.. అనుభూతినే తాను పొందానని ఐపీఎస్ అను స్వయంగా ట్వీట్ చేశారు. నూర్జహాన్(70) అనే వృద్ధురాలి ఇంటికి అనుకృతి దగ్గరుండి విద్యుత్ సదుపాయం అందించారు. ఆమె ఇంట్లో లైట్ వెలగగానే అటు అను ముఖంలో.. ఇటు బామ్మ ముఖంలో సంతోషం ఒక్కసారిగా వెల్లివిరిసింది. ఆ సంతోష కాంతుల్ని ట్విటర్ ద్వారా ఆమె పంచుకున్నారు. ఆమె ఇంటికి కరెంట్ తెప్పించడంలో సహకరించిన ఎస్‌హెచ్‌వో జితేంద్రకు, మొత్తం టీంకు ఆమె కృతజ్ఞతలు సైతం తెలియజేశారు. అనుకృతి శర్మ.. 2020 ఐపీఎస్ బ్యాచ్ అధికారిణి. ప్రస్తుతం బులంద్‌షెహర్‌కు అదనపు ఎస్పీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారామె. ఒంటరిగా పేదరికంలో ఉన్న నూర్జహాన్.. తన ఇంటికి వెలుగులు కావాలని నేరుగా పోలీసులను ఆశ్రయించిందట. ఆ విషయం తెలియగానే ఐపీఎస్ అనుకృతి.. ఇలా రంగంలోకి దిగి స్వయంగా ఆ ఏర్పాట్లను పర్యవేక్షించింది. అంతేకాదు ఓ ఫ్యాన్‌ను సైతం ఆ పెద్దావిడకు అందించింది. ఆపై అంతా స్వీట్లు పంచుకున్నారు. Swades moment of my life 🌸😊 Getting electricity connection to Noorjahan aunty's house literally felt lyk bringing light into her life. The smile on her face ws immensely satisfying.Thank u SHO Jitendra ji & the entire team 4 all da support 😊#uppcares @Uppolice @bulandshahrpol pic.twitter.com/3crLAeh1xv — Anukriti Sharma, IPS 🇮🇳 (@ipsanukriti14) June 26, 2023 ఇదీ చదవండి: జాతకాల పిచ్చోడా? బ్యాంక్ అధికారులకు షాకిచ్చాడుగా! -
‘జేడీ చక్రవర్తి భార్యను కూడా వేధించాడు’
యోగితో వివాదంపై షార్ట్ ఫిలిం హీరోయిన్ హారిక స్పందించారు. పది వేల రూపాయల కోసమే ఇంత రాద్ధాంతం చేస్తున్నానని యోగి చెప్పడం అవాస్తవమని ఆమె అన్నారు. తనను యోగి వేధించిందనందుకే పోలీసులను ఆశ్రయించానని తెలిపారు. తనతో పాటు తన భర్తకు కూడా అసభ్యకర పదాలతో మెసేజ్ లు చేశాడని, సాక్ష్యాలను పోలీసులకు అందించానని తెలిపారు. పది రోజుల క్రితం వరకు బాగానే ఉన్న యోగి కొద్ది రోజులుగానే ఇలా ప్రవర్తిస్తున్నాడని హారిక తెలిపారు. యోగి గతంలో కూడా కొంత మంది అమ్మాయిలను ఇలాగే వేధించాడని.. గతంలో జేడీ చక్రవర్తి భార్య అనుకృతి కూడా ‘పాప’ అనే షార్ట్ ఫిలిం సమయంలో యోగిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు హారిక తెలిపారు. అతడు బయటకు కనిపించేంత మంచి వాడు కాదని, అందరి ముందు ఎంతో మర్యాదగా నటించే యోగి గతంలో చాలా మంది అమ్మాయిలను ఇబ్బంది పెట్టాడని ఆరోపించారు. యోగి గురించి బయట చెడుగా ప్రచారం జరుగుతున్న విషయాన్ని ప్రస్తుతం అతనితో రిలేషన్ లో ఉన్న అమ్మాయికి చెప్పానని, దీంతో తన మీద పగ పెంచుకున్నట్లు హారిక తెలిపారు. తనపై వేధింపులకు దిగటంతో గతంలో ఇచ్చిన డబ్బు వెనక్కి ఇచ్చేయమన్నానని.. అప్పటి నుంచి వేధింపులు మరింత ఎక్కువయ్యాయని ఆమె పేర్కొన్నారు. ఇదే విషయంపై ఫిర్యాదు చేశానని, అయితే పోలీసుల ఎదుట కూడా యోగి అసభ్యకర భాష వాడటం వల్లే...అడిషనల్ డీసీపీ యోగిని కొట్టినట్లు చెప్పారు. మరోవైపు సైబరాబాద్ అడిషనల్ డీసీపీ గంగిరెడ్డి యోగీని కాలుతో కొట్టన వ్యవహారంపై మాదాపూర్ డీసీపీ విశ్వప్రసాద్ స్పందించారు. మూడు రోజుల క్రితం షీ టీంకి డైరెక్టర్ యోగిపై ఫిర్యాదు చేసిన హారిక.. తరువాత తనే ఫిర్యాదు వద్దు యోగీకి కౌన్సెలింగ్ చేయమని కోరిందని తెలిపారు. అడిషనల్ డీసీపీ గంగిరెడ్డి ఆధ్వర్యంలో విచారణ జరిగిందన్నారరు. ఆ సమయంలో డైరెక్టర్ యోగి అసభ్యంగా మాట్లాడటంతో డీసీపీ గంగారెడ్డి.. యోగిని బూటు కాలుతో తన్నినట్లు వీడియో బయటకు వచ్చిందని తెలిపారు. వీడియో ఎలా బయటకు వచ్చిందో తెలియదన్న విశ్వప్రసాద్.. డీసీపీ గంగిరెడ్డి అలా చేయటం మాత్రం కరెక్ట్ కాదన్నారు. ఈ విషయాన్ని కమిషనర్ సందీప్ శాండిల్యా దృష్టికి తీసుకెళ్లామని ఆయన చర్యలు తీసుకుంటారని తెలిపారు. -
జేడి చక్రవర్తి పెళ్లయిపోయిందా..?
జేడి చక్రవర్తి.. టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలలో పరిచయం అవసరం లేని పేరు. రామ్ గోపాల్ వర్మ శిష్యుడిగా ఆయన సినీ కెరీర్‌కే కాదు, ఆయన విలక్షణ వ్యక్తిత్వానికి కూడా వారసుడిగా ఎదిగాడు చక్రవర్తి. హీరో, విలన్, దర్శకుడిగా, నిర్మాతగా ఇలా తనలోని అన్ని రకాల టాలెంట్లను తెర మీద చూపించిన చక్రవర్తికి వ్యక్తిగత విషయాల్లోనే వర్మ బాటలోనే అడుగులు వేశాడు. అందుకే పెళ్లి అనే పదానికి చాలా కాలం పాటు దూరంగా ఉండిపోయాడు. అయితే ఇటీవల తన కుటుంబ సభ్యుల వత్తిడి మేరకు చక్రవర్తి పెళ్లి అంగీకరించాడన్న వార్తలు వినిపించాయి. వర్మ స్కూల్ నుంచే వచ్చిన ముద్దుగుమ్మ అనుకృతిని జేడి పెళ్లి చేసుకోబోతున్నాడన్న వార్త సోషల్ మీడియాలో సందడి చేసింది. తాజాగా ఈ ఇద్దరి వివాహం కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగిందట. వేడుకలకు దూరంగా ఉండే చక్రవర్తి అత్యంత సన్నిహితులను మాత్రమే తన పెళ్లికి ఆహ్వానించాడట. వీరి పెళ్లికి సంబందించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నా, వధూవరుల నుంచి మాత్రం వివాహానికి సంబందించి ఎలాంటి ప్రకటనా రాలేదు.