జేడి చక్రవర్తి పెళ్లయిపోయిందా..? | JD Chakravarthy has married budding actress Anukriti Sharma | Sakshi
Sakshi News home page

జేడి చక్రవర్తి పెళ్లయిపోయిందా..?

Published Fri, Aug 19 2016 10:59 AM | Last Updated on Mon, Sep 4 2017 9:58 AM

జేడి చక్రవర్తి పెళ్లయిపోయిందా..?

జేడి చక్రవర్తి పెళ్లయిపోయిందా..?

జేడి చక్రవర్తి.. టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలలో పరిచయం అవసరం లేని పేరు. రామ్ గోపాల్ వర్మ శిష్యుడిగా ఆయన సినీ కెరీర్కే కాదు, ఆయన విలక్షణ వ్యక్తిత్వానికి కూడా వారసుడిగా ఎదిగాడు చక్రవర్తి. హీరో, విలన్, దర్శకుడిగా, నిర్మాతగా ఇలా తనలోని అన్ని రకాల టాలెంట్లను తెర మీద చూపించిన చక్రవర్తికి వ్యక్తిగత విషయాల్లోనే వర్మ బాటలోనే అడుగులు వేశాడు. అందుకే పెళ్లి అనే పదానికి చాలా కాలం పాటు దూరంగా ఉండిపోయాడు.

అయితే ఇటీవల తన కుటుంబ సభ్యుల వత్తిడి మేరకు చక్రవర్తి పెళ్లి అంగీకరించాడన్న వార్తలు వినిపించాయి. వర్మ స్కూల్ నుంచే వచ్చిన ముద్దుగుమ్మ అనుకృతిని జేడి పెళ్లి చేసుకోబోతున్నాడన్న వార్త సోషల్ మీడియాలో సందడి చేసింది. తాజాగా ఈ ఇద్దరి వివాహం కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగిందట. వేడుకలకు దూరంగా ఉండే చక్రవర్తి అత్యంత సన్నిహితులను మాత్రమే తన పెళ్లికి ఆహ్వానించాడట. వీరి పెళ్లికి సంబందించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నా, వధూవరుల నుంచి మాత్రం వివాహానికి సంబందించి ఎలాంటి ప్రకటనా రాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement